తెలుగు సాహిత్యంలో మహిళలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రాచీన సాహిత్యంలో వెలుగులోకి వచ్చిన కవయిత్రుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా ఆధునిక కాలంలో రాశిలోనూ, వాశిలోనూ ఎక్కువగానే ఉంది.

చరిత్ర

[మార్చు]

ప్రాచీన భారత చరిత్రలో కవయిత్రులు

[మార్చు]

క్రీ.పూ.6వ శతాబ్దం నాటి బౌద్ధ భిక్షుకిల నుంచి మొదలుకొని సా.శ. 1 - 3 శాతాబ్దాల నాటి తమిళ సంగం యుగం వరకూ పరిగణనలోకి తీసుకుంటే స్త్రీలు రచనలు చేసిన దాఖలాలు విరివిగా కనిపిస్తాయి. క్రీ.పూ.650ల నాటి ఇప్పటి కర్ణాటక ప్రాంతంలో జీవించిన విజ్జిక (విద్య) అనే కవయిత్రిని మహాకవి కాళిదాసు ప్రతిభతో పోలుస్తూ చేసిన పలు వ్యాఖ్యలు దొరుకుతున్నాయి. సా.శ.9వ శతాబ్దపు ప్రాకృత పండితుడు రాజశేఖరుడి భార్యయైన అవంతీ సుందరి కవయిత్రిగా ఆనాటి సమాజంలో సుప్రసిద్ధురాలని చెప్పేందుకు ఆధారాలున్నాయి. ఆమె ప్రాకృతంలో కవిత్వాన్ని సృజించింది. ఐతే వీరి ప్రస్తావనలు, ప్రశస్తులు దొరుకుతున్నాయే తప్ప వీరు సృజించిన సాహిత్యం అలభ్యం.

ప్రతిష్టాత్మక పురస్కారాలు గ్రహీతలు

[మార్చు]
Malati Chandoor.JPG
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రి మాలతీ చందూర్

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రులు

[మార్చు]

భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 4 రచయిత్రులు నవల, కథాసంకలనాలు, సాహిత్య విమర్శ వంటి ప్రక్రియలకు గాను అందుకున్నారు.

  • ఇల్లిందల సరస్వతీదేవి: ఇల్లిందల సరస్వతీదేవి (1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించిన తొలి తెలుగు రచయిత్రిగా ఆమె చరిత్రకెక్కారు. ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. దరిజేరిన ప్రాణులు, ముత్యాల మనసు మొదలైన 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. స్వర్ణకమలాలు, తులసీదళాలు, రాజహంసలు వంటి కథాసంకలనాలు వెలువరించారు. ఆమెకు 1982లో స్వర్ణకమలాలు కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. సరస్వతీదేవికి 1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి లభించింది.
  • మాలతీ చందూర్: బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పలు ప్రక్రియల్లో రచనలు చేసి సుప్రసిద్ధురాలైన రచయిత్రి. కాలమిస్టుగా ఆంధ్రప్రభ వారపత్రికలో స్త్రీల కోసం నిర్వహించిన ప్రమదావనం అత్యంత ఎక్కువకాలం నడిచిన శీర్షికగా గిన్నిస్ రికార్డు సాధించింది. పాత కెరటాలు శీర్షికన 400 ఆంగ్ల నవలలను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. చీరాల పేరాల ఉద్యమం నేపథ్యంగా ఆమె రచించిన హృదయనేత్రి నవలకు 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మద్రాసు నగరంలో చిరకాలం జీవించిన మాలతి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. తమిళ భాషపై తనకున్న పట్టు కారణంగా డి.జయకాంతన్, పార్థసారథి తదితర ప్రఖ్యాత తమిళ రచయిత నవలలను తెలుగులోకి అనువదించారు. ఆమె రాసిన వంటలు పిండివంటలు అనే వంటల పుస్తకం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది.
  • అబ్బూరి ఛాయాదేవి:
  • కాత్యాయని విద్మహే:

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలైన రచయిత్రులు

[మార్చు]

భారతీయ సాహిత్యరంగంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కారం 2014 వరకూ 3 తెలుగు సాహిత్యకారులకు లభించగా వారిలో స్త్రీలు లేరు.

మూలాలు

[మార్చు]