తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం)
తెలుగు సినిమా చరిత్ర పేరున తెలుగు సినిమా చరిత్రపై ఒక పరిశోధన గ్రంథాన్ని సినీవిమర్శకుడు, రచయిత, పాత్రికేయుడు అయిన బి. వెంకటేశ్వర్లు వ్రాసాడు. ఇది 1997లో తొలిసారిగా ప్రచురించబడింది. 1912 నుండి 1995 నడుమ జరిగిన తెలుగు సినిమా రంగ విశేషాలపై వచ్చిన తొలి విశ్లేషణాత్మక గ్రంథంగా ఈ పుస్తకాన్ని పేర్కొంటారు.
ప్రచురణ
[మార్చు]తెలుగు సినిమా చరిత్రను నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ అండ్ ఎంటర్టెయిన్మెంట్స్ అనే హైదరాబాద్ లోని ఒక సంస్థ ప్రచురించగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ వారు మార్కెటింగ్ చేసారు.
విషయవస్తువు
[మార్చు]1997లో ముద్రితమైన ఈ పుస్తకంలో తెలుగు సినిమాని ఐదు యుగాలుగా వర్ణిస్తూ వ్రాయటం జరిగింది.
- మూకీ యుగం (1912-1930)
- తొలినాళ్ళ తెలుగు సినీరంగం (1931-1940)
- స్వర్ణ యుగం (1941-75)
- కమర్షియల్ పంథాలో తెలుగు సినిమా (1976-1995)
- ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగం
ఈ పుస్తకంలో మూకీ చిత్రాలు, ప్రపంచ సినిమా, బాలీవుడ్, టాలీవుడ్ లో యానిమేషన్, ప్రత్యామ్నాయ సినిమా, తెలుగు సినిమా లెజెండ్లు మొదలగు అంశాలపైన వ్యాసాలున్నాయి.
పురస్కారాలు
[మార్చు]ఈ పుస్తకాన్ని మెచ్చుకుంటూ పలు పురస్కారాలు వచ్చాయి, అందులో చెప్పుకోదగింది 1997 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నంది పురస్కారం.