Jump to content

బులెమోని వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
(బి. వెంకటేశ్వర్లు నుండి దారిమార్పు చెందింది)
అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా "నంది అవార్డు" అందుకుంటున్న బి. వెంకటేశ్వర్లు. చిత్రంలో కర్ణాటక గవర్నర్ రమాదేవి కూడా ఉన్నారు.

బులెమోని వెంకటేశ్వర్లు (జననం: మే 8, 1973, చారకొండ, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ) బి.వెంకటేశ్వర్లు గా,, శ్రీవెంకట్ గా కూడా పిలవబడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో జర్నలిస్ట్, రచయిత, సినీ దర్శకులుగా సుపరిచితుడు.

వ్యక్తిగత సమాచారం

[మార్చు]

బి.కనకప్ప, బి.కమలమ్మలకు జన్మించిన బులెమోని వెంకటేశ్వర్లు ప్రభుత్వ పాఠశాల, చారకొండ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చారకొండలో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని, నారాయణ పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, హైదరాబాదులో డిగ్రీ పూర్తి చేసుకుని, ఈనాడు జర్నలిజం పాఠశాలలో జర్నలిజంలో డిప్లొమా, దూరదర్శన్లో స్క్రిప్టు రచనలో ప్రత్యేక డిప్లొమా పూర్తి చేశాడు.

అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో ఉన్న అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ ఫిలిం టెక్నాలజీ పూర్తి చేశాడు.

వెంకటేశ్వర్లు బులెమోని రచించిన "తెలుగు సినిమా చరిత్ర", "తెలుగు సినిమా వైతాళికులు", "చిలుకూరు క్షేత్ర చరిత్ర" గ్రంథాలు, వెంకటేశ్వర్లు దర్శకత్వం వహించించిన దేశభక్తితో కూడిన "త్రివర్ణం" మ్యూజిక్ ఆల్బం, "అలజడి", "తెలుగు సినిమా వైతాళికులు" టెలీ సీరియల్స్, "మైసిగండి క్షేత్ర చరిత్ర" డాక్యుమెంటరీ చిత్రం బహుళ ప్రాచుర్యమైనవి.

"తెలుగు సినిమా చరిత్ర" గ్రంథం

[మార్చు]

ప్రపంచ సినీ పితామహులు లూమియర్ బ్రదర్స్ 1896 జూలై 7న బొంబాయిలోని వాట్సన్ హోటల్ లో ఏర్పాటు చేసిన తొలి చలన చిత్ర ప్రదర్శన ద్వారా భారత దేశంలోకి చలనచిత్ర రంగం ప్రవేశించింది. అది మొదలు గత 100 సంవత్సరాల భారతీయ చలనచిత్ర చరిత్ర, 1931లో ప్రారంభమైన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమగ్ర చరిత్రపై బులెమోని వెంకటేశ్వర్లు ఏడున్నర సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "తెలుగు సినిమా చరిత్ర".

ఈ "తెలుగు సినిమా చరిత్ర" గ్రంథంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సమగ్ర చరిత్ర, సాంకేతిక అభివృద్ధి, తెలుగు చలనచిత్ర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు, 1931 నుంచి 1997 దాకా వచ్చిన మేటి చలనచిత్రాల సమీక్ష, సంవత్సర వారీగా విడుదలైన సినిమాల పూర్తి వివరాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఈ గ్రంథాన్ని నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, నవోదయ బుక్ హౌజ్, ప్రజాశక్తి బుక్ హౌజ్లు సంయుక్తంగా విడుదల చేశాయి. అప్పటి కేంద్ర మంత్రి యు.కృష్ణంరాజు 25 నవంబర్ 1997 న ఈ గ్రంథాన్ని విడుదల చేశారు.

ఈ "తెలుగు సినిమా చరిత్ర" గ్రంథానికిగాను ఉత్తమ గ్రంథంగా రాష్ట్ర ప్రభుత్వ "నంది అవార్డు", ఉత్తమ రచయితగా "యువకళావాహిని" అవార్డు రచయితకు లభించాయి.

"తెలుగు సినిమా వైతాళికులు" గ్రంథం

[మార్చు]

తెలుగు సినిమా గొప్పదనాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసి, అంతర్జాతీయంగా తెలుగు సినిమా కీర్తి పతాకాన్నెగురవేసిన తెలుగు సినిమా మార్గదర్శకులపై బులెమోని వెంకటేశ్వర్లు తూలనాత్మక పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "తెలుగు సినిమా వైతాళికులు".

మే 8 2002 న ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావుఈ గ్రంథాన్ని విడుదలచేయగా, సినీ ప్రముఖులు పద్మశ్రీ డి.వి.ఎస్. రాజు, ఏడిద నాగేశ్వరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, పరుచూరి గోపాలకృష్ణ, రోజారమణి, తదితరులు గ్రంథావిష్కరణ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ గ్రంథాన్ని నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, నవోదయ బుక్ హౌజ్, ప్రజాశక్తి బుక్ హౌజ్లు విడుదల చేశాయి.

ఈ గ్రంథానికిగాను రచయిత వెంకటేశ్వర్లుకు ఉత్తమ గ్రంథ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ "నంది అవార్డు" లభించింది.

"త్రివర్ణం" (ఎవ్రీ ఇండియన్ హార్ట్ బీట్)

[మార్చు]

దేశభక్తి, జాతీయ సమైక్యతలపై తెలుగు భాషలో నిర్మించిన తొలి తెలుగు వీడియో ఆల్బం "త్రివర్ణం".

దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రధాన భూమికగా రూపొందించిన ఆరు పాటలతో కూడుకున్న ఈ "త్రివర్ణం"లోని పాటలను ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కార్తీక్, శ్రీకాంత్, నిష్మ, టీనాలు పాడారు.

ఈ "త్రివర్ణం"లో బులెమోని వెంకటేశ్వర్లు వ్రాసిన "నన్ను కదిపే..నన్ను కదిపే మూడు రంగుల చందనం.." గీతం అమెరికాలోని మ్యూజిక్ చార్ట్ లోని తెలుగు పాటల విభాగంలో ఏకంగా ఏడునెలలపాటు ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.[ఆధారం చూపాలి]

ఇక బులెమోని వెంకటేశ్వర్లు వ్రాసిన మరోగీతం "భారతావని..." పాటకు శాస్త్రీయ నృత్యం చేసిన బేబి వర్శిణికి ప్రతిష్ఠాత్మక భారత రాష్ట్రపతి అవార్డు "బాలరత్న" లభించింది.[ఆధారం చూపాలి]

సికింద్రాబాదులోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థిని అయిన బేబి వర్శిణిని తొలిసారి ఈ "త్రివర్ణం" ఆల్బం ద్వారా బులెమోని వెంకటేశ్వర్లు పరిచయం చేయడం జరిగింది.

2002 ఆగస్టు 2న ఈ "త్రివర్ణం" వీడియో ఆల్బాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి విడుదలచేశారు.

సూర్య సెల్యులాయిడ్స్ బ్యానరుపై బులెమోని వెంకటేశ్వర్లు స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో పిరాటి నవీన్ కుమార్ నిర్మించిన ఈ వీడియో ఆల్బాన్ని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ "ఆదిత్య మ్యూజిక్ ఇండియా లిమిటెడ్" ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. బులెమోని వెంకటేశ్వర్లు రెండు పాటలు రచించగా, వేమూరి విశ్వనాథ్ ఆల్బంలోని మిగిలిన నాలుగు పాటలను రచించారు.

"చిలుకూరు క్షేత్ర చరిత్ర" గ్రంథం

[మార్చు]

తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన చిలుకూరు బాలాజీ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "చిలుకూరు క్షేత్ర చరిత్ర".

సా.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చ్ 2005న అప్పటి శాసన సభ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి విడుదల చేశారు.

ఈ "చిలుకూరు క్షేత్ర చరిత్ర" గ్రంథాన్ని నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, నవోదయ బుక్ హౌజ్, ప్రజాశక్తి బుక్ హౌజ్ లు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాయి.

అప్పట్లో కేవలం రెండు రోజుల్లో 10 వేల కాపీలు అమ్ముడుపోయి ఈ గ్రంథం చరిత్ర సృష్టించింది.[ఆధారం చూపాలి]

"మైసిగండి క్షేత్ర చరిత్ర" డాక్యుమెంటరీ చిత్రం

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద మహిషాసుర మర్దని దేవాలయంగా ప్రసిద్ధి గాంచి, హైదరాబాదుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసిగండి క్షేత్ర స్థల పురాణం, క్షేత్ర అభివృద్ధి లగూర్చి బులెమోని వెంకటేశ్వర్లు దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం "మైసిగండి క్షేత్ర చరిత్ర".

లోక కంటకుడైన రాక్షసరాజు మహిషాసురుడిని సంహరించడంకోసం ఆదిశక్తి, త్రిమూర్తులు, సకల దేవతల అంశతో అవతరించిన శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దని అవతార వృత్తాంతం, మైసిగండి దేవాలయాల స్థల పురాణం, కాకతీయ రాజుల కాలం నాటి శివ, రామాలయాల చరిత్ర, ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ రామావత్ పంతూనాయక్ చేసిన కృషి ప్రధాన ఇతి వృత్తంగా రూపొందిన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహకారంతో, ఆలయ ఛైర్మన్ సిరోలీ పంతూ నాయక్ నిర్మించారు.

"నంది అవార్డు" గ్రహీత బులెమోని వెంకటేశ్వర్లు స్క్రీన్ ప్లే అందించి, దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ చిత్రం యొక్క డి.వి.డిని రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 23 జూలై 2009న విడుదల చేశారు.

హాలీవుడ్-టాలీవుడ్.బ్లాగ్

[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనా, శ్రీలంక, నెదర్లాండ్స్, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్, ఇరాన్, ఇరాక్, నార్వే, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, కెనడా, జర్మనీ, మలేషియా, గ్రీస్, స్విట్జర్లాండ్, ఈజిప్ట్...ఇలా సుమారు 200ల దేశాలలో, అన్ని భాషలలో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చలన చిత్రాలకు సంబంధించిన సమాచారం, ప్రధాన కథా ఇతివృత్తం, ఆయా చలనచిత్రాల హైలైట్స్, ఫోటోలు, ట్రైలర్లు ప్రధానాంశంగా బులెమోని వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న బ్లాగ్ "హాలీవుడ్-టాలీవుడ్.బ్లాగ్-స్పాట్" ప్రపంచ సినిమాపై భారతదేశం నుంచి నిర్వహిస్తున్న ప్రముఖ బ్లాగ్ గా గుర్తింపు పొందింది.[ఆధారం చూపాలి]

2008-09వ సంవత్సరానికిగాను రైటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నుంచి "బెస్ట్ ఫిలిం బ్లాగ్ ఆఫ్ ది ఇయర్"గా అవార్డు పొందిన ఈ బ్లాగ్ కు[ఆధారం చూపాలి]

స్వదేశంతోబాటు, విదేశాలలో ప్రత్యేక ఆదరణ ఉంది.

ప్రముఖ హాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన ఒరిజినల్ స్క్రీన్ ప్లే లను ప్రచురిస్తున్న ఏకైక బ్లాగ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన[ఆధారం చూపాలి]

ఈ బ్లాగ్ తో గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ తన ప్రకటనలను పొందుపరచడంకోసం అధికారిక ఒప్పందం కుదుర్చుకోవడం ఈ బ్లాగ్ స్థాయిని తెలియజేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా 200 వందల దేశాల ఆన్ లైన్ పాఠకులు ప్రతినిత్యం సందర్శిస్తున్న ఈ బ్లాగ్ వీక్షకుల సంఖ్య ఇప్పటికే ఒక లక్షా, అరవై వేలు దాటి ముందుకు పోతోంది.

"టాలీవుడ్: గ్లోరీ & గ్లిట్జ్" డాక్యుమెంటరీ చిత్రం

[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర నిర్మాణంలో ప్రఖ్యాతిగాంచిన తెలుగు చలన చిత్ర పరిశ్రమపై బులెమోని వెంకటేశ్వర్లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్యుమెంటరీ చిత్రం "టాలీవుడ్: గ్లోరీ & గ్లిట్జ్".

భారతదేశ అధికార భాష ఐన హిందీతో పోటీ పడుతూ రాసి పరంగా, వాసి పరంగా కొత్త పుంతలు తొక్కుతూ, సాంకేతికంగా అత్యంత ప్రతిభావంతంగా కొనసాగుతున్న తెలుగు సినిమా చరిత్రకు సంబంధించిన ఈ డాక్యుమెంటరీ చిత్రం 2014లో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు, తెలుగు భాషలలో విడుదల చేయడంకోసం చిత్ర దర్శకుడు బులెమోని వెంకటేశ్వర్లు కృషి చేస్తున్నారు.

బయటి లింకులు

[మార్చు]