Jump to content

ఏడు

వికీపీడియా నుండి
(7 నుండి దారిమార్పు చెందింది)

0 | 1 | 2| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 100 | 108 | 1000 | 1116

ఈ అంకె గురించి



ఏడు అంటే సంవత్సరం. ఏడు + ఆది = ఏడాది కనుక ఏడాది అంటే సంవత్సరానికి మొదలు అనే అర్థం వస్తున్నాది కదా. కనుక “మా అబ్బాయికి ఏడాది నిండింది” అనే ప్రయోగం తప్పు అని ఒక అభిప్రాయం. “మా అబ్బాయికి ఒక ఏడు నిండింది” అనాలని అంటారు.

ఏడు అనేది రోదించుకి సమానార్థకం అనుకొని కొందరు ఏడుని అశుభంగా భావించి ఏడుకి బదులు ఆరున్నొక్కటి అంటారు. పెళ్ళిళ్లల్లో వధూవరుల చేత సప్త పదులు తొక్కిస్తారు కదా. అటువంటప్పుడు ఏడు అశుభం ఎలా అవుతుంది? అవదు. రోదించు అనాలనుకుంటే ఏడ్చు అనాలి.

పెళ్లి అంటే గుర్తుకి వస్తోంది. పెళ్ళిలో సప్తర్షి మండలంలో ఉన్న అరుంధతిని చూపిస్తారు. “అరుంధతి కాదు కాని ఆరు వేలు అప్పు కనిపిస్తున్నాది” అన్నాడుట ఒక ప్రబుద్ధుడు. ఈ నక్షత్రం కంటికి కనిపిస్తే దృష్టి బాగున్నట్లు లెక్క అనే అభిప్రాయం అరేబియాలో కూడా ఉంది.

“ఏడుకొండలవాడా, వేంకటరమణా! గోవిందా! గోవింద!” అనడంలో ఉన్న ఇంపు “ఆరున్నొక్క కొండలవాడా!” అంటే వస్తుందా? రాదు!

ఈ ఏడుని వాడడం ఇష్టం లేకనో ఏమో కాని కుండలినీ యోగంలో ఉన్న ఏడు చక్రాలని షట్‌చక్రాలంటారు. కుండలినిలో అడుగు నుండి మీదకి ఉన్న చక్రాల పేర్లు: మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార.

ఊర్ధ్వ లోకాలు ఏడు: భూ, భువస్, సువర్, మహాస్, జనస్, తపస్, సత్య. అధో లోకాలు ఏడు: అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. ఏడు లోకాలు ఉన్నాయనే నమ్మకం హిందువులలోనే కాదు; ఇతర మతాలలో కూడా ఉంది.

మన సప్త స్వరాలైన సరిగమపదని లకి చివర స చేర్చి ఆ ఎనిమిదింటిని “ఆక్టేవ్” అన్నారు పాశ్చాత్యులు – అంటే, ఎనిమిది మాత్రల కాలం అని అర్థం.

సప్తర్షులనీ, సప్తసముద్రాలనీ, సప్తద్వీపాలనీ వర్ణించిన మన పెద్దలు ఇంద్రధనుస్సులో ఉన్న ఏడు రంగులని సప్తవర్ణములు అని చెప్పకపోవడం శోచనీయంగానే కనిపిస్తుంది.

మనకి పంచ మహాపాతకాలు ఉన్నట్లే క్రైస్తవులకి ఏడు మహాపాతకాలు ఉన్నాయి (seven deadly sins) : కామము (lust), క్రోధము (wrath), అత్యాశ (greed), మదము (pride), తిండిపోతుతనం (gluttony), బద్ధకం (laziness), మాత్సర్యము (envy).

ఏజంట్ 007 ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పత్తేదార్!

గణితంలో ఏడు

[మార్చు]

గణితంలో ఏడుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటిని ఏడు చేత భాగించగా వచ్చే లబ్ధాన్ని చూడండి.

0. 142857 142857 142857 … …

ఇక్కడ దశాంశ బిందువు తరువాత వచ్చే అంకెలు ఆరు అయిన తరువాత అవే అంకెలు పదే పదే నిర్విరామంగా పునరావృత్తమవుతూ వస్తాయి. తమాషా ఇంతటితో అయిపోలేదు. ఈ ఆరు అంకెల సంఖ్యనీ తీసుకుని దానిని 2, 3, 4, 5, 6 చేత వరసగా గుణిస్తే వచ్చే లబ్ధాలలో ఈ ఆరు అంకెలే పదే పదే ప్రత్యక్షమవుతూ వస్తాయి తప్ప 0, 3, 9 కనబడవు. ఆ గుణకారాలు ఈ దిగువ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నక్షత్రం గుణకారానికి గుర్తు.

142857 * 2 = 285714 142857 * 3 = 428571 142857 * 4 = 571428 142857 * 5 = 714285 142857 * 6 = 857142

అంతే కాకుండా, ప్రతీ లబ్ధములోని అంకెలు, తారుమారు కాకుండా, ఒకే వరుస క్రమంలో, చక్రీయంగా దర్శనమిస్తాయి. అంటే 2, 8 తరువాత 5, 7, 1, 4 ఆ వరుసలోనే కనిపిస్తాయి.

  1. చివరి అంకెను వేరుచేయండి,
  2. దాన్ని రెట్టింపు చేసి
  3. దాన్ని మిగిలిన అంకెల (సంఖ్య) నుంచి తీసివేయండి.
  4. ఫలితం ఋణాత్మకమై 2 లేక అంతకంటె ఎక్కువ అంకెల సంఖ్య అయితే ఋణసూచికను వదిలేయండి.
  5. ఫలితం 7 గుణిజము అయ్యేవరకు (-7 లేదా 0 లేదా +7) పై విధానాన్ని మరల మరల చేస్తూపొండి.
ఉదాహరణకు, 7చేత 1358 నిశ్శేషముగా భాగించబడుతుంది. ఎందుకంటే:
135 - (8*2) = 119
11 - (9*2) = -7
సంఖ్యా సిద్ధాంతము ననుసరిస్తే దీని నిరూపణ సులువే, సంఖ్య n ను ఈరూపంలోకి ఒకసారి మార్చిచూస్తే:
n = 10a + b
ఇక్కడ:
a అనేది మిగిలిన అంకెల సంఖ్య, కాగా
b అనేది చివరి అంకె.
అప్పుడు:
10a + b = 0 (mod 7)
5 * (10a + b) = 0 (mod 7)
49a + a + 5b = 0 (mod 7)
a + 5b - 7b = 0 (mod 7)
a - 2b = 0 (mod 7)

రెండవ విభాజకసూత్రం 2006లో భారతదేశంలో ఢిల్లీకి చెందిన సెయింట్ కొలంబా పాఠశాలలో ఎనిమదవ తరగతి విద్యార్థి హిమనీశ్ గంజూ చే సూత్రీకరించబడింది:

  1. చివరి రెండు అంకెలను తొలగించండి

"# మిగిలిన సంఖ్యను 7చే భాగించండి.

  1. శేషాన్ని రెండుచే గుణించండి.
  2. ఈ లబ్దాన్ని(తొలగించబడిన) రెండు అంకెలకు కలపండి
  3. ఇప్పుడు వచ్చిన మొత్తం 7చే భాగించబడితే, అసలు సంఖ్య కూడా 7చే భాగించబడుతుంది

మార్చి 25, 2007లో గంజూ చివరి మూడు అంకెలను వేరుచేస్తూ (1వ స్టెప్పు), శేషాన్ని 6 చేత భాగించి, ఆ మొత్తాన్ని చివరి మూడు (మందు వేరుపరచిన) అంకెలకు కలుపుతూ ఈ పరీక్షలాంటిదే మరొకటి కనిపెట్టేడు.

ఉదాహరణకు, 1568 ఏడుచేత నిశ్శేషంగా భాగించబడుతుంది.
    1. 15/7 శేషం = 1
  1. లబ్దము 1*2 = 2
  2. 68 + 2 = 70 (ఇది 7చే నిశ్శేషంగా భాగించబడుతుంది)

కాబట్టి, 7చే 1568 నిశ్శేషంగా భాగించబడుతుంది.

బయటి లింకులు

[మార్చు]

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఏడు&oldid=3917515" నుండి వెలికితీశారు