తేజ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. హరిబాబు
నిర్మాణం రామోజీరావు
తారాగణం మాస్టర్ తరుణ్ ,
సుధాకర్
సంగీతం ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం హరి అనుమోలు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు
రామోజీరావు

తేజా 1992 లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం, ఎన్.హరి బాబు దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. [1] ఈ చిత్రం ఉత్తమ పిల్లల చిత్రానికి నంది అవార్డు, ఉత్తమ బాల కళాకారుడిగా నంది అవార్డు, ఉత్తమ విలన్ కొరకు నంది అవార్డును కూడా పొందింది. [2] [3]

కథ[మార్చు]

ఈ కథ తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువుతూ 10 వ తరగతికి సిద్ధమవుతున్నాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఉత్సాహవంతుడు. అతను తన తోటివారిపై, ప్రధానంగా ఇంట్లో తన సేవకుడిపై చిలిపిపనులు చేస్తూంటాడు. ఒక రోజు అతను తన హోంవర్కు చెయ్యనందున తన వైస్ ప్రిన్సిపాల్ శారద (తులసి) సమక్షంలో అతని గురువు క్లాస్ నుండి బయటికి పంపేస్తాడు. తేజా ఆ విషయం గురించి బాగా వివరించినప్పటికీ, అతన్ని అల్లరి కారణంగా తరగతి నుండి బహిష్కరిస్తారు.

అతడి జ్ఞానం చూసి ఆశ్చర్యపోయిన శారద తేజను 10 వ తరగతికి సిఫారసు చేస్తుంది. తరువాత తేజ జగన్ అనే జర్నలిస్టుతో స్నేహం చేస్తాడు. అతను తన తెలివితేటలను మెచ్చుకుంటాడు. అనేక సందర్భాల్లో తేజ సహాయం తీసుకుంటాడు. ఒక రోజు పాఠశాల విహారయాత్రలో శారద తన మాజీ భర్త వినోద్ ఓ స్త్రీని హత్య చెయ్యడం చూస్తుంది. ప్రకృతి చిత్రాలను క్లిక్ చేస్తున్న తేజకు ఈ హత్య గురించి తెలియదు. వినోద్ వారిని చంపడానికి వెంబడిస్తాడు. శారద తేజతో పాటు పరుగెత్తి సురక్షితంగా తన బస్సు ఎక్కేస్తుంది. తరువాత శారద ధైర్యం తెచ్చుకుని వినోద్‌ను అరెస్టు చేయిస్తుంది. తరువాత వినోద్ ఒక కానిస్టేబుల్‌కు లంచం ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి అక్రమంగా బయటకు వచ్చి శారదను ఆమె స్కూల్ ల్యాబ్‌ లోనే యాసిడ్ పోసి చంపేస్తాడు. తీర్పు రోజున తేజ ద్వితీయ సాక్ష్యాలను - అంటే హత్య చేస్తున్నప్పటి ఫోటోలు తన కెమెరా ద్వారా తనకు తెలియకుండానే క్లిక్ చేసినవి - సమర్పిస్తాడు. అప్పుడు న్యాయమూర్తి వినోద్కు మరణశిక్ష విధిస్తాడు.

తరువాత వినోద్ తేజను చంపడానికి జైలు నుండి తప్పించుకుంటాడు. ఇంతలో తేజ ఇంటి వద్ద తేజ సహాయంతో అతని సోదరి పెళ్ళి ఏర్పట్లు జరిగుతాయి. పెళ్ళికి అందరూ తిరుపతికి వెళ్తారు. గందరగోళంలో తేజను ఇంట్లో పెళ్ళి తళం వేసి వెళ్ళిపోతారు. అదే సమయంలో ఇద్దరు దొంగలు తెలియకుండానే అతని ఇంట్లోకి ప్రవేశిస్తారు (ఒకసారి జగన్ పర్సును కొట్టేసినందుకు వాళ్ళకు తేజ పాఠం చెబుతాడు). ఇంతలో వినోద్ పోలీసుల నుండి తప్పించుకుని తేజ ఇంట్లోకి ప్రవేశించి అతనిని చంపడానికి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ వాస్తవాలన్నీ తెలియని తేజ తన పెంపుడు జంతువుతో ఒంటరిగా తన ఇంటిలోనే ఉంటాడు. చాలా గందరగోళం తరువాత వాళ్ళంతా తాము ఒక ప్రమాదకరమైన నాటకంలో ఉన్నామని గ్రహిస్తారు. వినోద్ దొంగలను కట్టేసి తేజ కోసం వెతుకుతాడు. అప్పుడు తేజ తన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో ఎదురుదాడి చేస్తాడు. చివరకు వినోద్ తేజను చంపబోతూండగా, తేజ తల్లిదండ్రులు, జగన్ తో పాటు పోలీసులు అతనిని చుట్టుముట్టి మళ్ళీ అరెస్టు చేస్తారు. ప్రభుత్వం తేజ ధైర్య సాహసాల పురస్కారం ప్రకటిస్తుంది

మూలాలు[మార్చు]

  1. Jaideep Deo Bhanj. "Sharing his knowledge". The Hindu.
  2. "About". STPL Films.
  3. "Teja (తేజ) 1992". ♫ tunes.