Jump to content

తరుణ్ కుమార్

వికీపీడియా నుండి
(మాస్టర్ తరుణ్ నుండి దారిమార్పు చెందింది)
తరుణ్ కుమార్
జననం
తరుణ్ కుమార్ బట్టి

(1983-01-08) 1983 జనవరి 8 (వయసు: 43)
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1990 - ప్రస్తుతం
బంధువులురోజా రమణి (తల్లి)
అమూల్య (సోదరి)
చక్రపాణి బట్టి (తండ్రి)

తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు సినీనటి రోజారమణి కుమారుడు. కథానాయకుడిగా తరుణ్ తొలి చిత్రం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2000 లో వచ్చిన నువ్వే కావాలి. ఇది బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి చిత్రాలలో నటించాడు. 2018 లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ తర్వాత మరే చిత్రాలలో నటించలేదు.

చిత్రసమాహారం

[మార్చు]

అవార్డులు

[మార్చు]
  • అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]