రోజారమణి
రోజా రమణి | |
---|---|
Roja Ramani | |
జననం | [1] | 1959 సెప్టెంబరు 16
ఇతర పేర్లు | చెంబరుతి శోభన |
వృత్తి | నటి, డబ్బింగ్ కళాకారిణి |
జీవిత భాగస్వామి | చక్రపాణి |
పిల్లలు | తరుణ్ కుమార్ , అమూల్య |
రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాదలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970, 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన తరుణ్ రోజారమణి కొడుకు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు.[3] ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా చానల్‌లో దర్శకుడు, నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు తరుణ్. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.
కెరీర్
[మార్చు]ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్నె వయసు అనే సినిమా గా, తమిళంలో పరువ కాలంగా పునర్నిర్మించారు.
తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రం అందించింది.
నటించిన సినిమాలు
[మార్చు]- అసెంబ్లీ రౌడీ (1991)
- లంబాడోళ్ళ రామదాసు (1991)
- మగధీరుడు (1986)
- కాష్మోరా (1986)
- కొంగుముడి (1985)
- దారి తప్పిన మనిషి (1981)
- శ్రీ ఆంజనేయ చరిత్ర (1981)
- రక్తబంధం (1980)
- నాయకుడు – వినాయకుడు (1980)
- సొమ్మొకడిది సోకొకడిది (1979)
- డ్రైవర్ రాముడు (1979)
- పునాదిరాళ్ళు (1979)
- ఆలుమగలు (1977)
- రంభ ఊర్వశి మేనక (1977)
- మా ఇద్దరి కథ (1977)
- గంగ యమున సరస్వతి (1977)
- ఖైదీ కాళిదాసు (1977)
- రాజా (1976)
- మన ఊరి కథ (1976)
- మొనగాడు (1976)
- మహాత్ముడు (1976)
- మొగుడా- పెళ్ళామా (1975)
- జేబు దొంగ (1975)
- సంసారం (1975)
- భారతంలో ఒకమ్మాయి (1975)
- బలిపీఠం (1975)
- అన్నదమ్ముల కథ (1975)
- ఓ సీత కథ (1974)
- రామ్ రహీమ్ (1974)
- తాతమ్మకల (1974)
- ఎవరికివారే యమునాతీరే (1974)
- అనగనగా ఒక తండ్రి (1974)
- ఆడంబరాలు - అనుబంధాలు (1974)
- ఇంటి కోడలు (1974)
- మరపురాని మనిషి (1973)
- రామరాజ్యం (1973)
- కన్నెవయసు (1973)
- మా ఇంటి వెలుగు (1972)
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972)
- బుల్లెమ్మ బుల్లోడు (1972)
- విచిత్ర దాంపత్యం (1971)
- భాగ్యవంతుడు (1971)
- రామాలయం (1971)
- శ్రీదేవి (1970)
- తల్లి తండ్రులు (1970)
- సత్తెకాలపు సత్తెయ్య (1969)
- జరిగిన కథ (1969)
- అసాధ్యుడు (1968)
- సతీ అరుంధతి (1968)
- చిన్నారి పాపలు (1968)
- భక్త ప్రహ్లాద (1967)
చిత్రమాలిక
[మార్చు]-
జమున, నిర్మాత అనురాధ దేవితో
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (16 September 2021). "మరపురాని రోజారమణి". Retrieved 12 April 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ EENADU (22 July 2021). "ఎస్వీఆర్ ఇలా అయిపోయారేంటి అనుకున్నా! - alithosaradaga". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
- ↑ http://www.rediff.com/movies/2000/dec/07ramani.htm