మగధీరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మగధీరుడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయబాపినీడు
నిర్మాణం మాగంటి రవీంద్రనాథ చౌదరి
తారాగణం చిరంజీవి ,
జయసుధ ,
రోజారమణి
సంగీతం ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ శ్యాంప్రసాద్ ఆర్ట్స్
భాష తెలుగు

మగధీరుడు 1986 లో విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, జయసుధ ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

కథ[మార్చు]

చిరు, సత్యనారాయణ చిన్న కుమారుడు. మధ్యతరగతి అమ్మాయి (జయసుధ) తో ప్రేమలో పడి అతని అన్నలూ అక్కలూ అంగీకరించకపోయినా ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. అసూయతో అక్కలు, ఆస్తిని కాజేయడానికి గోతి కాడ నక్కలా కూర్చున్న రావు గోపాలరావు సహాయంతో, కొత్త కోడలికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకుని సత్యనారాయణ గుండెపోటుతో మరణిస్తాడు. అన్నలు ఆస్తి కోసం తగువులాడుకుంటారు. చిరు, జయసుధ ఖాళీ చేతులతో ఇంటి నుండి బయటికి వెళ్తారు., కాని చిరు ఒక పరిస్థితిలో జైలుకు వెళతాడు. జయసుధ ఒంటరిగా మిగిలిపోతుంది. కుటుంబమంతా చెల్లాచెదురైపోతుంది. జైలు నుండి బయటకు వచ్చి చిరు తన కుటుంబాన్ని ఎలా ఏకం చేస్తాడనేది మిగతా కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • "అటు దహనం , ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం
  • "ఇచ్చోటనే , ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
  • "ఇంటిపెరు అనురాగం , ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, లలిత, రచన: వేటూరి
  • "జత కలిసే ఇద్దరం , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  • "మన జీవితాలు , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

మూలాలు[మార్చు]

  1. "మగధీరుడు వ్యాఖ్యలు Movie Comments & Discussion in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.
"https://te.wikipedia.org/w/index.php?title=మగధీరుడు&oldid=3982601" నుండి వెలికితీశారు