రక్తబంధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్త బంధం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆలూరి రవి
తారాగణం చిరంజీవి,
నూతన్ ప్రసాద్ ,
కవిత
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ రికో ఫిల్మ్స్
భాష తెలుగు

రక్తబంధం డిసెంబర్ 13, 1980న విడుదలైన తెలుగు సినిమా.చిరంజీవి, కవిత , జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం జీ. కె.వెంకటేష్ సమకూర్చారు. ఆలూరు రవి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

నటీనటులు

[మార్చు]
  • చిరంజీవి
  • కవిత
  • ప్రసాద్ బాబు
  • నూతన్ ప్రసాద్
  • రోజారమణి
  • సువర్ణ

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఆలూరి రవి
  • మాటలు: మోదుకూరి జాన్సన్
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • పాటలు: సినారె, జాలాది
  • నేపథ్య గాయకులు: ఎస్.జానకి, పి.సుశీల, ఎస్.పి.శైలజ, జి.ఆనంద్

చిత్రకథ

[మార్చు]

మిత్రుడు ధర్మారావు సహాయంవల్ల పైకి వచ్చిన శ్రీనివాసరావు తన ఆస్తిలో సగభాగం ధర్మారావుకు ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. ఇంతలో శ్రీనివాసరావు హత్యచేయబడి, ఆ హత్యానేరం ధర్మారావుపై మోపబడుతుంది. ధర్మారావు జైలుకు వెళతాడు. ధర్మారావు కొడుకులిద్దరూ ఒకరికొకరు చిన్నప్పుడే దూరమవుతారు. పెద్దవాడు భగత్‌కు తాగుడు, జూదం, దొంగతనాలు అన్నీ అలవడతాయి. అయినా మనసు మంచిదే. చిన్నవాడు తిలక్ పోలీసాఫీసరు అవుతాడు. శ్రీనివాసరావు కొడుకు చిత్తరంజన్ మేనమామ పెంపకంలో విలాసాలతో బ్రతుకుతుంటాడు. ఒక ఘటనతో ఎవరు ఎవరో తెలుసుకుంటారు. చిత్తరంజన్ మనసు మారుతుంది. భగత్, తిలక్‌లతో కలిసి ముగ్గురూ ఏకం అవుతారు. చిత్తరంజన్ ఆస్తిపై కన్ను వేసిన మేనమామ, స్వంత తోబుట్టువుకన్నా ఎక్కువగా చూసుకుంటున్న మల్లిని చంపివేసి ఆ హత్యానేరాన్ని చిత్తరంజన్‌పై వేస్తాడు. చిత్తరంజన్‌పై భగత్ కత్తిగడతాడు. పోలీస్ ఆఫీసర్‌గా అసలు హంతకుడిని పట్టుకోవలసిన బాధ్యత తిలక్‌పై పడుతుంది[1].

పాటలు

[మార్చు]
  1. అడిగింది అమ్మ నన్ను అమ్మడు ఓ అమ్మడు పెళ్లి చేసుకోవా అని - ఎస్.జానకి - రచన: డా. సినారె
  2. కాకమ్మ కాకి కలువల్ల కాకి - పి.సుశీల,జి.ఆనంద్,వినోద్,ఎస్.పి.శైలజ బృందం - రచన: జాలాది
  3. చం చం చం చండిక చూడిక ఆడిస్తా రావికొండ రమ్మా - జి.ఆనంద్,పి.సుశీల - రచన: డా. సినారె

మూలాలు

[మార్చు]
  1. పి.ఎస్. (23 December 1980). "చిత్రసమీక్ష రక్తబంధం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 259. Retrieved 2 February 2018.[permanent dead link]

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రక్తబంధం&oldid=4211191" నుండి వెలికితీశారు