Jump to content

తొగురు ఆర్థర్

వికీపీడియా నుండి
(తొగురు ఆర్థర్‌ నుండి దారిమార్పు చెందింది)
తొగురు ఆర్థర్‌

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 3 జూన్ 2024
ముందు వై ఐజయ్య
తరువాత గిత్తా జయసూర్య
నియోజకవర్గం నందికొట్కూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జులై 1955
మద్దూరు , పాములపాడు మండలం, కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
తల్లిదండ్రులు శ్యామూల్‌, మార్తమ్మ
జీవిత భాగస్వామి వంట్ల పాపమ్మ
సంతానం వివేక్‌ జయ సందీప్, విజయ సిరి సింధూర[1]

తొగురు ఆర్థర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తొగురు ఆర్థర్‌ 10 జులై 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా , పాములపాడు మండలం, మద్దూరు గ్రామంలో శ్యామూల్‌, మార్తమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.[3]

వృత్తి జీవితం

[మార్చు]

తొగురు ఆర్థర్‌ 1982లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి వివిధ హోదాల్లో పని చేసి, 2009 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేశాడు. ఆయన తర్వాత డీజీపీ పేషీలో డీఎస్పీగా పని చేసి వి.ఆర్.ఎస్ తీసుకున్నాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

తొగురు ఆర్థర్‌ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి 2014లో నందికొట్కూరు నియోజకవర్గం టికెట్ ఆశించినా దక్కలేదు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన 2019లో నందికొట్కూరు నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండి జయరాజు పై 40,610 ​ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

ఆర్థర్‌కు 2024లో శాసనసభ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన 2024 మార్చి 19న కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 May 2023). "ముంబై టీఐఎస్‌ఎస్‌లో సీటు సాధించిన తొగురు సిరి సింధూర". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  2. Sakshi (2019). "Nandikotkur Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  3. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  4. The Times of India (25 May 2019). "Andhra Pradesh assembly elections: Former assembly chief marshal Thoguru Arthur to contest from Nandikotkuru | Amaravati News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  5. Sakshi (24 May 2019). "ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  6. Eenadu (19 March 2024). "కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  7. The New Indian Express (19 March 2024). "Nandikotkuru YSRCP MLA Toguru Arthur quits ruling party to join Congress in Andhra Pradesh" (in ఇంగ్లీష్). Retrieved 19 March 2024.