తొడసం కైలాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొడసం కైలాస్ తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత ఇంద్రవెల్లి మండలం, గౌరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]


తొడసం కైలాస్
[[
తొడసం కైలాస్.
]]
స్థానిక పేరుతొడసం కైలాస్
జననం(1975-03-05)1975 మార్చి 5
వాఘాపూర్
నివాస ప్రాంతంవాఘా పూర్: గ్రామము
మండలం: మావల
జిల్లా:ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా
విద్యఎం.ఏ,(ఆంగ్లం), ఎం.ఏ (పొలిటికల్ సైన్స్, డి.ఇడ్,. బి.ఇడ్,.
భార్య / భర్తఉమా దేవి
పిల్లలుగంగోత్రి, సృజన్ రామ్
తల్లిదండ్రులుతొడసం మోతి బాయి -గంగారామ్

[2]


జననం

[మార్చు]

తొడసం మోతిబాయి, గంగారామ్ దంపతులకు 5 మార్చి 1975 సంవత్సరంలో జన్మించాడు.

బాల్యం

[మార్చు]

తొడసం కైలాస్ ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలంలోని ఏజెన్సీ మారుమూల గ్రామమైన వాఘాపూర్ గ్రామంలో తొడసం మోతిబాయి గంగారం దంపతులకు మార్చి నెల 5తేదీ 1975 రోజున ఒక పూరి గుడిసెలో జన్మించారు. తొడసం గంగారాం గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు జంగుబాయి, రెండవ భార్య పేరు మోతీబాయి. కైలాస్ వాళ్ళ నాన్న తొడసం గంగారాం గారు వడ్రండి పని చేసేవారు. తను వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషించేవారు. చదువు విలువ తెలిసిన గంగారాం తన పిల్లలందరినీ చదివించాడు. తొడసం గంగారం గారు తన చిన్న తనంలో భారత స్వతంత్ర ఉద్యమం జైహింద్ గురించి తన పిల్లలకు చెప్పేవారు. ఇక తొడసం కైలాస్ గంగారం కి 11వ సంతానం. తొడసం కైలాస్ పుట్టగానే ఊపిరి తిత్తులు సరిగా పనిచేయక శ్వాస ఆడక పోవడంతో చనిపోయాడని అనుకున్నారు. ఛాతి పైన మర్దన చేయడంతో ప్రాణం వచ్చింది. తొడసం కైలాస్ ఇంట్లో చిన్నప్పుడు ఒక బర్రె ఉండేది. దాని పేరు చంద్రి. ఎందుకంటే ఆ బర్రె నెత్తి పైన తెల్లటి మచ్చ ఉండే కాబట్టి. చిన్నప్పుడు ఇటు బడికి పోతూనే ఉదయం పూట సాయంత్రం పూట తనకంటే పెద్ద అయినా వెంకటితో కలసి ఆ బర్రెను మేపేవాడు. ఇలా ఉండగా ఒక రోజు వాళ్ల ఇంటికి ఎక్కడి నుండో ఒక ఆవు వచ్చింది. ఆ ఆవును తొడసం కైలాస్ వాళ్ల నాన్న పది రోజుల నుండి గమనించాడు. ఆ ఆవు ఎటు వెళ్ళలేదు. ఇక తొడసం గంగారామ్ ఆ ఆవును తన ఇంట్లో వచ్చిన దేవతగా భావించాడు. ఆ ఆవుకు సురభి అని నామకరణం చేసి తమ ఇంట్లో పెంచుకోసాగారు. తొడసం కైలాస్ ఆ ఆవును మేపేవాడు. ఉదయం పూట సాయంత్రం పూట ఆ ఆవును మేపడానికి తీసుకెళ్లేవాడు. పాఠశాల వెళ్లకంటె ముందు ఆవు కొరకు ప్రతి రోజు ఒక గడ్డిమొపు తీసుకురావాలని కైలాస్ వాళ్ళ నాన్న ఆదేశించేవాడు. అయితే ఒక రోజు కైలాస్ గ్రామ సమీపంలో ఉన్న ఒక పత్తి చేనులో వెళ్లి కొడవలితో గడ్డి కోస్తున్న సమయంలో రెండు మూడు పత్తి చెట్లు తెగడంతో చేను యజమాని కైలాస్ ను పచ్చి కట్టేతో యెడపెడ బాదేశాడు. తొడసం కైలాస్ ఏడుస్తూ ఇంటికి వచ్చి చింత చెట్టు కింద కూర్చున్నాడు. వాళ్ల అమ్మ నాన్న వీపు పైన ఉన్న దద్దుర్లను చూసి బోరున విలపించారు. అంతే కాకుండా చిన్నప్పుడు గ్రామంలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవి తొడసం కైలాస్ గ్రామానికి పడమర దిక్కున ఉన్న పంగిడి నూతి నుండి నీళ్ళు మోసేవారు. చిన్నప్పుడు తొడసం కైలాస్ ఇటు చదువుకుంటూ సెలవులు ఉన్నప్పుడు అమ్మతో ఊర్లో చేనులో విత్తనాలు నాటడం, చెట్లకు మందులు పోయడం లాంటి వ్యవసాయ పనులకు కూలీగా వెళ్లేవారు. కూలి పని లేని సమయంలో అంటే వేసవి కాలంలో వాళ్ల అమ్మ మోతుబాయితో కలసి అడవిలో తునికి ఆకుల సేకరణ కొరకు వెళ్ళేవారు. అమ్మతో పాటు చిన్నప్పుడు వాఘాపూర్ చుట్టు ఉన్న గుట్టలు ఎక్కి తునికి ఆకు సేకరణకు వెళ్లేవారు. చిన్నప్పుడు ఉదయం మూడు గంటలకు లేచి ఇల్లు వాకిలి అలికి స్నానం చేసి వంటవార్పు చేసి చద్ది అన్నం సిద్దం చేసి నాలుగు గంటలకు గుట్టకు దగ్గర వెళ్లి అక్కడ కాసేపు నిద్ర పోయి ఉదయం తెల్లవారే సమయంలో చద్ది అన్నం తిని పగలు పన్నెండు గంటల వరకు అడవి అంతా తిరిగి, గుట్టలు ఎక్కి గుట్టలు దిగి తునికి ఆకు సేకరించేవారు. ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడిచేది. పండగలు వస్తే గుడిహత్నూర్ అంగడికి ధరమడుగు గుండా కాలి నడకన ఏడు కిలోమీటర్లు వెళ్లి సరకకులు తెచ్చేవారు.


ఆ ఆవు తొడసం కైలాస్ వచ్చినాక ఇంట్లో పాలు పెరుగుకు కొదవలేకుండా ఉండేంది. కైలాస్ వాళ్ళ అమ్మ పాలని వేడి చేసి పెరుగుగా మార్చి వారానికి ఒకసారి చిలికి వెన్న తీసి నెయ్యిగా మార్చేది. కైలాస్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు తినడానికి ఇబ్బందిగా ఉండేది. వర్షాకాలం వచ్చింది అంటే కష్టాలు మొదలు అయ్యేవి. ఆ రోజులలో వర్షాకాలంలో పది రోజుల వరకు ముసురు పట్టేది. ఒక ముసురు పోగానే మరో ముసురు. అలా వరుస ముసుర్లతో ఇంట్లో తినడానికి ఏమీ దొరకక ఒక్కో సారి పస్తులు ఉండి పడుకున్న సందర్భాలు ఉండేవి. కొంత జొన్న పిండి ఉంటే దానికి జతగా పొలంలో ఉన్న నల్ల మట్టిని తీసుకు వచ్చి పిండితో కలుపి రొట్టెలు చేసి, గునుగు ఆకులతో కూర వండి తిన్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాలలో వర్షాకాలంలో బయటకు వచ్చే ఈసుళ్లను పట్టి వాటిని పెనంలో కాల్చి మూడు నాలుగు రోజులు తినేవారు. కైలాస్ వాళ్ళ నాన్న ఊరికే ఉన్నప్పుడు అడవికి వెళ్లి దుంపలు తీసుకువచ్చి వాటిని బాగ కడిగి ఉడకబెట్టి తేనెవారు. అంతేకాకుండా కైలాస్ వాళ్ల నాన్న గంగారామ్ ఊరికే ఉన్నప్పుడు వాగుకు వెళ్లి చేపలు పట్టి తెచ్చేవారు. గంగారామ్ ఎక్కువ చేపలు తెస్తే కొన్నిటిని అమ్మి గ్రామంలో ఉన్న కిరాణా కొట్టు నుండి నూకలు, ఉప్పు కారం నూనె కొని తీసుకు వచ్చేవాడు. గంగారామ్ గారు ఒక్కో రోజు ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చేవారు. ఒక్కరోజు ఇంటికి రాత్రి తొమ్మిది గంటలకు చేపలు పట్టుకొని వచ్చేవారు. ఆ సమయంలో వాటిని కడిగి శుభ్రం చేస్తే కైలాస్ వాళ్ళ అమ్మ వాటిని వంట చేసిది అప్పటికి కైలాస్ మరియు వాళ్ళ అన్న వెంకటి, చెల్లే విజయ, తమ్ముడు శంకర్ పడుకొని ఉండేవారు. కైలాస్ పస్తులతో గోడకు వొరిగి పడుకునేవారు. వంట అయినాక కైలాస్ వాళ్ళ అమ్మ మోతీబాయి కైలాస్ ని నిద్ర నుండి మేల్కొల్పి అన్నం తిను అనేది. కైలాస్ మాత్రం నిద్ర మబ్బులో ఒక ముద్ద నోట్లో పెట్టి అన్నం ముందర పెట్టి అలాగే పడుకునే వాడు. వాళ్ల నాన్న కైలాస్ ని నిద్ర నుండి మేల్కొల్పి అన్నం తినిపించేవాడు. బతకడానికి ఎంతటి కష్టం ఉన్న తమ పిల్లలు కష్ట పడకూడదు అని తొడసం గంగారామ్ దంపతులు తమ పిల్లల కొరకు చాలా తపన పడ్డారు. ఆ రోజుల్లో ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీ తోటి కుటుంబాల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎవరికి సరైన తిండి దొరికేది కాదు కొందరైతే ఇంట్లోని పరిస్థితిని చూసి తమ పిల్లలను గ్రామంలో ఉన్న రెడ్డిల బర్రెలు మేపడానికి జీతానికి పెట్టేవారు. కొందరిని చేను పనికి, ఇంటి పనికి పెట్టేవారు. కానీ తొడసం కైలాస్ వాళ్ళ నాన్న తొడసం గంగారామ్ గారు తన లాగా కష్ట పడకుండా బాగ చదువుకోవాలని అనేవారు. ఒక సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి గంగారామ్ ఇంటి పక్కనున్న చేను యజమాని వచ్చి ఒక ఎడ్ల బండి చేసి ఇస్తే గ్రామ సమీపంలో ఉన్న చేను ఇస్తనంటే గంగారామ్ గారు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే తన పిల్లలను చదువుకు అలవాటు చేశాడు. మరియు అంతేకాకూండ అతను ఇచ్చే నాలుగు ఎకరాల భూమిని అంత మంది పిల్లలు ఎలా చేసి తింటారు. గంగారామ్ గారికి మహాభారత కథల గురించి బాగా తెలుసు. కాబట్టి భవిష్యత్తులో తన పిల్లలు భూ తగాదాల కొరకు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు అనే అపవాదు రాకూండా అతని కోరికను మన్నించారు. దానికి బదులుగా గంగారామ్ గారు మూడు కుంటాళ్ల జొన్నలు, రెండు వందల రూపాయలు తీసుకొని ఎడ్ల బండి చెసి ఇచ్చారు. కైలాస్ వాళ్ళ నాన్నకు పని ఉన్న సందర్భాల్లో వాళ్ల ఇంట్లో తినడానుకి కొరత ఉండేది కాదు. కానీ పని లేని రోజుల్లో కైలాస్ వాళ్ల ఇంట్లో తిండికి చాల కష్టాలు ఉండేవి. వర్షాకాలంలో వచ్చే పొలాల అమావాస్య పండుగ రోజులోనైతే ఒక్కోసారి తినడానికి ఏమీ ఉండకపోయేది. అంతేకాకుండా కైలాస్ వాళ్ళ ఇంటికి దక్షిణ దిశలో ఉన్నటువంటి ఇవన్నీ కష్టాలు చూసి కైలాస్ వాళ్ల అన్నయ్య గణపతి కైలాస్ ని మరియు కైలాస్ కంటే పెద్దవాడైన వెంకటిని ఉట్నూర్ లో హాస్టల్ లో చేర్పించాడు.

రచన ప్రస్థానం

[మార్చు]

2019వ సంవత్సరంలో కాండిరంగ్ వేసుడింగ్ రచనతో మొదలై తరువాత గోండిలో భాషలో మోటివేషన్ కొటోషన్స్ సద్విచార్,గోండి భాషలో విరాట్ కోహ్లీ జీవిత చరిత్ర, 2024వ సంవత్సరంలో గోండి భాషలో మొట్ట మొదటి సారిగా పండోక్న మహాభారత్ కథ,ప్రస్తుతం తన సొంత జీవిత కథతో పాటు యాదితల్ తెండ్తంగ్ పేన్క్ అనే కథను రాస్తున్నాడు.[3]

పుస్తకాలు

[మార్చు]
తొడసం కైలాస్ , రచించిన పుస్తకాలు
  1. కాండిరంగ్ వేసుడింగ్
  2. పండోక్న మహాభారత్[4][5][6]

పురస్కారాలు

[మార్చు]
  1. 2018లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.
  2. 2019లో శ్రీ శారద ఎడ్యుకేషన్ సొసైటీ వారు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,[7]
  1. 2019 అక్టోబర్ లో అంతర్జాతీయ ఉపాధ్యాయ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరియు సినీ నటుడు రాజశేఖర్ జీవితల చేతుల మీదుగా టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డ్ .[8]

విధులు

[మార్చు]
  1. ఉపాధ్యాయ వృత్తి ఆరంభంలో ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే 2011 వ సంవత్సరం నుండి పాఠ్య పుస్తకాలో, భోధనలో వచ్చే మార్పుల పై హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకొని క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాడు. 2011 వ సంవత్సరంలో ఆంగ్ల భాష పైన బెంగుళూరులో ఒక నెల రోజుల పాటు శిక్షణను తీసుకున్నాడు.
  2. 2012 వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఆంగ్ల పుస్తకాల పైన రాష్ట్ర స్థాయిలో నలగొండలోని నాగార్జున సాగర్ లో శిక్షణ పూర్తి చేసి క్షేత్ర స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేల జైనథ్ ఆదిలాబాద్ తాంసి తలమడుగు గుడిహత్నూర్ ఇచ్చోడ బోథ్ నేరడిగొండ లోకేశ్వరం మామడ ఉట్నూర్ నార్నూర్ ఇంద్రవెల్లి ఆసిఫాబాద్ కడెం మామడ లక్ష్మణ్ చాంద దిలావార్ పూర్ బజార్ హత్నూర్ మండలలో ఉపాధ్యాయులకు నూతన పుస్తకాలను విద్యార్థులకు ఎలా భోదించాలి అనే దాని పై శిక్షణ ఇచ్చాడు.
  3. 2015 వ సంవత్సరంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పదోన్నతి పొందిన తరువాత కెరమెరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో 2016 వ సంవత్సరంలో ఆసిఫాబాద్ జిల్లా తరుపున సాంఘిక శాస్త్రంలో రిసోర్స్ పర్సన్ గా హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకొని ఆదిఫాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చాడు.
  4. 2022 లో ELEC (English Language Enrichment Course) ట్రైనింగ్ హైదరాబాద్ లో బెంగుళూరు నుండి వచ్చిన Azim premji యూనివర్సిటీ వారు ఇచ్చిన శిక్షణ తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష పైన ట్రైనింగ్ ఇచ్చాడు.

గోండి భాషకి కృషి

[మార్చు]

తోడసం కైలాస్ 2017 నుంచి యూట్యూబ్ మాధ్యమం ద్వారా గోండీ భాషను ప్రచారం చేస్తున్నాడు. యువతకు ప్రేరణ కలిగించే సందేశాలను గోండీలో సద్విచార్ పుస్తకాన్ని రచించి వాటిని యూట్యూబ్ చానెల్ లో విడుదల చేసి యావత్ ఆదివాసీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వాఘాపూర్ గ్రామానికి చెందిన ఆయన ఇంద్రవెల్లి మండలం ప్రాథమికోన్నత పాఠశాల గౌరాపూర్ లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ. గోండీ భాషలో రచించిన పుస్తకాలు, కవితలు, కథలు, స్ఫూర్తిదాయక సందేశాలను ఏఐ(కృత్రిమ మేధ) ద్వారా చదివిస్తున్నాడు. [9]వాటిని రికార్డు చేసి యూట్యూబ్ లో పొందుపరుస్తున్నాడు. గోండీ భాషకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో ముందుకొచ్చాడు. గోండీ భాషపైన లోతుగా అధ్యయనం చేసి, వాడుకలో లేని కొన్ని పదాలు, పూర్వీకులు ఉపయోగించిన భాష పదాలను సేకరించాడు. వాటిని స్వచ్ఛమైన గోండీ భాషలో రాసి పుస్తకాన్ని రాశాడు. రాసిన వాటిన్నింటిని గూగుల్ డాక్యూమెంట్, బ్లాగ్ లో భద్రపరుస్తున్నాడు . తాజాగా గోండీ భాషలో మాట్లాడే విధానాన్ని యూట్యూబ్ ద్వారా వివరిస్తున్నాడు. కాండిరంగ్ వేసుడింగ్(పిల్లల ప్రపంచం) పుస్తకాన్ని గోండ్వానా సాహిత్య అకాడమీ ద్వారా విడుదల చేశాడు.[2][10]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి (2024-08-23), ఘనంగా అంతరిక్ష దినోత్సవం, retrieved 2024-09-04
  2. 2.0 2.1 ఈనాడు (2024-08-23), గగన విధుల్లో..మన ఖ్యాతి, retrieved 2024-09-03
  3. Reddy, S. Raja (2024-07-08). "Government teacher translates the Mahabharat into Gondi language". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-09-04.
  4. నమస్తే తెలంగాణ (2024-07-08), మహా భారతాన్ని గోండిలో రచించడం అభినందనీయం, retrieved 2024-09-04
  5. ఈనాడు (2024-07-08), యువతకు దిశానిర్దేశం చేయాలి, retrieved 2024-09-04
  6. ఈనాడు (2024-07-07), గోండి భాషలో మహాభారతం, retrieved 2024-09-04
  7. ఈనాడు (2019), ఉత్తమ సేవలకు రాష్ట్ర స్థాయి పురస్కారం, retrieved 2024-09-03
  8. సాక్షి (2019-09-12), జిల్లా వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు, retrieved 2024-09-04
  9. నవ తెలంగాణ (2020-02-08), కృత్రిమ మేదాధారిత యాంకర్ సృష్టించిన ఉపాధ్యాయుడు, retrieved 2024-09-04
  10. ఈనాడు (2024-02-21), గోండి ప్రచారంలో తోడసం కైలాస్, retrieved 2024-09-04