తోట రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట రామస్వామి
తోట రామస్వామి


పదవీ కాలము
1972-1974
ముందు పిడతల రంగారెడ్డి
తరువాత ఎన్.వెంకటసుబ్బయ్య

పదవీ కాలము
1963-1974

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1952-1953
నియోజకవర్గం పెద్దాపురం

ఆంధ్ర రాష్ట్ర శాసనసభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1953-1954
నియోజకవర్గం పెద్దాపురం

పంచాయతీరాజ్ మరియు చిన్నమొత్తాల పొదుపు శాఖమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1964-1972

వ్యక్తిగత వివరాలు

జననం (1906-12-05)5 డిసెంబరు 1906
ఏలేశ్వరం ,తూర్పు గోదావరి జిల్లా
మరణం 1978
మతం హిందూ

తోట రామస్వామి(1906-1978) ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు. కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావు మంత్రి వర్గాలలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.

విశేషాలు[మార్చు]

తోట రామస్వామి 1906, డిసెంబర్ 5వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, ఏలేశ్వరం గ్రామంలో జన్మించాడు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బి.ఎ., పట్టాను పొందాడు. ఇతని రాజకీయ జీవితం 1928వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా బోర్డు ఉపాధ్యక్ష పదవితో ప్రారంభమైంది. ఇతడు 1940 నుండి సుమారు 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెరకు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యుడిగా, 1952 నుండి రెండు సంవత్సరాలపాటు ఇండియన్ షుగర్‌కేన్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 1959 నుండి 1964 వరకు తూర్పు గోదావరిజిల్లా పరిషత్ అధ్యక్షునిగా, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షునిగా సేవలను అందజేశాడు. 1952వ సంవత్సరంలో పెద్దాపురం నియోజక వర్గం నుండి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికై శాసనసభ్యుడిగా ఉన్నాడు. 1953 నుండి 1954 వరకు ఆంధ్ర శాసనసభ సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు 1963 మార్చి 23న శాసనసభ నియోజకవర్గం నుండి ఉప ఎన్నిక ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై 1968 జూన్ 30 వరకు, తర్వాత 1968 జులై 1 నుండి 1974 జూన్ 30 వరకు సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు 1968లో తాత్కాలిక నియమావళి సమితి సభ్యుడిగా పనిచేశాడు. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావు మంత్రి వర్గాలలో 1964 మే 24 నుండి 1972 మార్చి 20 వరకు సహకార, మత్స్య, అబ్కారీ, అటవీ, పంచాయతీరాజ్, చిన్నమొత్తాల పొదుపు శాఖల మంత్రిగా రాష్ట్రానికి తన సేవలను అందించాడు. ఇతడు 1972 మార్చి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1974 జూన్ 30వరకు కొనసాగాడు[1].

ఇతడు 1978వ సంవత్సరంలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "శ్రీ తోట రామస్వామి". లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్. Centre for Good Governance. Archived from the original on 15 డిసెంబర్ 2018. Retrieved 11 May 2020. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)