థామస్ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

థామస్ కప్ (The Thomas Cup) అనేది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌. ఇందులో ప్రపంచ గవర్నింగ్ బాడీ అయిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) సభ్య దేశాలు పాల్గొంటాయి. 1948-49లో తొలి ‘థామస్‌ కప్‌’ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లో నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి టోర్నీ నిర్వహించేవారు. అయితే 1982 నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించబడుతున్నాయి.

చరిత్ర

[మార్చు]

థామస్‌ కప్‌ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన సర్ జార్జ్ అలాన్ థామస్‌ది. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ థామస్‌ 1900ల్లో గొప్ప బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ సహ వ్యవస్థాపకుడు. 1939లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (ప్రస్తుతం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) సాధారణ సమావేశంలో అతని ఆలోచనకు మంచి స్పందన లభించింది.[1][2] బ్యాడ్మింటన్‌లో ఓ ప్రపంచస్థాయి టోర్నమెంట్‌ ఉండాలని జార్జ్ అలాన్ థామస్‌ భావించి ‘థామస్‌ కప్‌’ టోర్నీకి ప్రణాళిక రచించాడు. థామస్‌ కప్‌నే ‘వరల్డ్స్‌ మెన్స్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌’ అని కూడా వ్యవహరిస్తారు.

మొదటి ‘థామస్‌ కప్‌’ తో పాటు మలేషియా ఇప్పటివరకు నాలుగు కైవసం చేసుకుంది. కాగా ఇండోనేషియా అత్యధికంగా 14 సార్లు ఈ కప్‌ గెలిచింది. చైనా 10 సార్లు, డెన్మార్క్‌ ఒక్కసారి సాధించాయి. 2014లో ఢిల్లీ వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ మెగా టోర్నీలో జపాన్‌ తొలిసారి కప్‌ను దక్కించుకుంది. ఇక భారత్‌ విషయానికొస్తే1952లో తొలిసారి ‘థామస్‌ కప్‌’లో పోటీ పడింది. రెండు సార్లు ఫైనల్‌ రౌండ్‌ వరకు వెళ్లింది. మూడుసార్లు క్వార్టర్‌ ఫైనల్స్‌., ఓసారి సెమీఫైనల్‌ వరకు వచ్చి వెనుదిరిగింది.

థామస్‌కప్‌ విజేతగా భారత్

[మార్చు]

2022లో థామస్‌ కప్‌ టోర్నమెంట్ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో మే 8 నుంచి 15 వరకు జరిగాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 29 దేశాలు పోటీ పడగా, 16 దేశాలు క్వాలిఫై అయ్యాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించించి పోటీలు నిర్వహించారు. టోర్నీ ఫైనల్లో చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌ కప్‌ విజేతగా భారత్ నిలిచింది.[3] థామ‌స్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో మొత్తం రెండు డ‌బుల్స్, మూడు సింగిల్ మ్యాచ్‌లు ఉండ‌గా వ‌రుస‌గా మూడింటిలోనూ భార‌త్ గెలుపొందింది. దీంతో 73 ఏళ్ళ త‌ర్వాత థామ‌స్ క‌ప్ ను భార‌తదేశం కైవసంచేసుకున్నట్టయింది.

ఈసారి థామస్‌ కప్‌లో భారత్‌ తరఫున మొత్తం పది మంది ప్రాతినిధ్యం వహించారు. వారు సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (ఆంధ్రప్రదేశ్‌), లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (కేరళ), ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌) పోటీపడ్డారు. ఇక డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర), పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌), ఎం.ఆర్‌.అర్జున్‌ (కేరళ)–ధ్రువ్‌ కపిల (పంజాబ్‌)

బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ థామస్‌ కప్‌ లో భారత్ కు స్వ‌ర్ణం సాధించిపెట్టిన ఆట‌గాళ్లు ల‌క్ష్య‌సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, కిదాంబి శ్రీకాంత్ పలువిరిని ప్రధానితో పాటు దేశప్రజలందరూ అభినందించారు.

మూలాలు

[మార్చు]
  1. "The Thomas Cup". Archived from the original on 2007-03-20. Retrieved 2007-04-13.
  2. "Mengenal Sejarah Piala Thomas" (in ఇండోనేషియన్). Archived from the original on 2007-12-22. Retrieved 2007-04-13.
  3. "Thomas Cup: బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయం.. థామస్‌కప్‌ విజేతగా భారత్". web.archive.org. 2022-05-16. Archived from the original on 2022-05-16. Retrieved 2022-05-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=థామస్_కప్&oldid=3849187" నుండి వెలికితీశారు