దండు నారాయణరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండు నారాయణరాజు
జననందండు నారాయణరాజు
ఆగష్టు 15, 1889
భీమవరం తాలూకా నేలపోగుల
మరణంజనవరి 30, 1944
మరణ కారణముగుండె జబ్బు
తండ్రిభగవాన్ రాజు

దండు నారాయణరాజు (ఆగష్టు 15, 1889 - జనవరి 30, 1944) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.

బాల్యము, విద్య[మార్చు]

వీరు భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు దంపతులకు 1889, 15 ఆగష్టు తేదీన జన్మించారు. వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.

స్వాతంత్ర్య సాధన లో[మార్చు]

  • 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.
  • ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించారు.
  • శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932లో 7 నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.

రాజకీయ జీవితం[మార్చు]

వీరు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలలో ముఖ్యులు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నతమైన సేవ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. 1937 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

మరణం[మార్చు]

క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజావూరు జైల్లో ఉంటూ 1944, జనవరి 30 న అక్కడే గుండె జబ్బుతో మరణించారు.

మూలాలు[మార్చు]