దఖాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దఖాల్
దర్శకత్వంగౌతమ్ ఘోష్
రచనగౌతమ్ ఘోష్
పార్థ బెనర్జీ
కథసుశీల్ జన
నిర్మాతపశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
తారాగణంమమతా శంకర్
రాబిన్ సేన్ గుప్తా
సునీల్ ముఖర్జీ
సుజల్ రాయ్ చౌదరి
ఛాయాగ్రహణంగౌతమ్ ఘోష్
కూర్పుమలయ్ బెనర్జీ, జయతి ఘోష్, ప్రశాంత డే
సంగీతంగౌతమ్ ఘోష్
విడుదల తేదీ
1981
సినిమా నిడివి
72 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

దఖాల్, 1981లో విడుదలైన బెంగాలీ సినిమా. గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా శంకర్, రాబిన్ సేన్ గుప్తా, సునీల్ ముఖర్జీ, సుజల్ రాయ్ చౌదరి తదితరులు నటించారు.[1]

కథా నేపథ్యం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్లోని సంచార తెగకు చెందిన ఒక మహిళ నేపథ్యంలో సినిమా ఉంటుంది. కాకి వేటగాళ్ళు అని పిలుస్తారు. అతను దక్షిణ బెంగాల్‌కు పారిపోయి క్షుద్ర పద్ధతుల ద్వారా జీవనం సాగిస్తుంటాడు. మోసపూరిత భూస్వామి గిరిజన ప్రజలను దోపిడీ చేసే సమస్యను చూపిస్తుంది.[2][3]

నటవర్గం

[మార్చు]
  • మమతా శంకర్ (అండి)
  • రాబిన్ సేన్ గుప్తా
  • సునీల్ ముఖర్జీ
  • సుజల్ రాయ్ చౌదరి
  • బిమల్ డెబ్

ఇతర వివరాలు

[మార్చు]

తెలుగులో మా భూమి తీసిన గౌతమ్ ఘోష్ రూపొందించిన తొలి బెంగాలీ సినిమా ఇది.[3] 29వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలన చిత్రం అవార్డును గెలుచుకుంది.[4][5] పారిస్‌లో జరిగిన 11వ అంతర్జాతీయ మానవ హక్కుల చలన చిత్రోత్సవంలో గ్రాండ్ జ్యూరీ బహుమతిని కూడా గెలుచుకుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Dakhal (1981)". Indiancine.ma. Retrieved 2021-06-17.
  2. 2.0 2.1 Banerjee, Srivastava (2013). One Hundred Indian Feature Films: An Annotated Filmography. Routledge. p. 140. ISBN 978-1-135-84098-3.
  3. 3.0 3.1 Ray, Bibekananda; Joshi, Naveen; Division, India. Ministry of Information and Broadcasting. Publications (2005). Conscience of the race: India's offbeat cinema. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. ISBN 978-81-230-1298-8.
  4. "29th National Film Awards". International Film Festival of India. Archived from the original on 3 December 2013. Retrieved 17 June 2021.
  5. "29th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 17 June 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దఖాల్&oldid=4339652" నుండి వెలికితీశారు