Jump to content

దయా బాయి

వికీపీడియా నుండి
దయా బాయి
దయా బాయి
జననం
మెర్సీ మాథ్యూ

1940 (age 83–84)
విద్యాసంస్థఎం.ఎస్.డబ్ల్యూ (ముంబయి విశ్వవిద్యాలయం)
వృత్తిసామాజిక కార్యకర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గిరిజన అభ్యున్నతి

దయా బాయి, (మెర్సీ మాథ్యూ) కేరళకు చెందిన సామాజిక కార్యకర్త. మధ్య భారతదేశంలోని గిరిజనుల గురించి పని చేస్తున్నది. ఆమె మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా బారుల్ గ్రామంలో నివసిస్తున్నది.

తొలి జీవితం

[మార్చు]

మెర్సీ మాథ్యూ, 1940లో కేరళ రాష్ట్రంలోని పాలాలో సంపన్న క్రైస్తవ కుటుంబంలో జన్మించింది.[1] దేవుడిపై ఉన్న బలమైన విశ్వాసంతో ఆమె బాల్యంమంతా సంతోషంగా గడిపింది.[2]

సామాజిక సేవ

[మార్చు]

16 సంవత్సరాల వయస్సులో సన్యాసంలో చేరడానికి తన స్వగ్రామం పాలాను విడిచిపెట్టి వచ్చింది.[3] భారతదేశంలోని మధ్యప్రాంతాలలో ఉన్న గిరిజనుల కోసం స్పూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తూ, సత్యాగ్రహాలు, ప్రచారాలను నిర్వహించింది. పాఠశాలలను తెరిచేందుకు, అంతర్గత, గిరిజన మధ్యప్రదేశ్‌లోని నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు అధికారాన్ని అందించాలని స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చింది. బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలోని అటవీ నివాసులు, గ్రామస్తులకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఒంటరిగా పోరాటం చేస్తూ నర్మదా బచావో ఆందోళన, చెంగారా ఆందోళనలో పాల్గొన్నది. బంగ్లాదేశ్‌లో యుద్ధ సమయంలో ఆమె సామాన్య ప్రజలకు కూడా తన సేవలను అందించింది. దయా బాయి మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా గోండుల మధ్య స్థిరపడి, అక్కడి బారుల్ గ్రామంలో పాఠశాలను కూడా ఏర్పాటుచేసింది. దయా బాయి తను సందర్శించే ప్రతి గ్రామానికి తనను తాను ఎలా చూసుకోవాలో నేర్పుతుంది, తరువాత మరో గ్రామానికి వెళుతుంది.[4]

ఆమె 90వ దశకం చివరిలో పేదరిక నిర్మూలనకు సాధనంగా స్వయం సహాయ బృందాన్ని ప్రారంభించింది. ఆ సందర్భంలో మధ్యవర్తులు, వడ్డీ వ్యాపారులు, గ్రామపెద్దల ఆగ్రహానికి గురైంది. అణగారిన, కష్టాల్లో ఉన్న పేదల అభ్యున్నతికి తమ ఉద్యోగాలను ఉపయోగించాలని బ్యాంకులోని మహిళా అధికారులను కూడా కోరింది.[5]

అవార్డులు

[మార్చు]

దయా బాయి 2007లో వనితా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.[6] జనవరి 2012లో గుడ్ సమారిటన్ జాతీయ అవార్డు (కొట్టాయం సోషల్ సర్వీస్ సొసైటీ, అగాపే మూవ్‌మెంట్, చికాగోచే స్థాపించబడింది) కూడా లభించింది.[7]

వారసత్వం

[మార్చు]

షైనీ జాకబ్ బెంజమిన్ అనే దర్శకుడు దయా బాయిపై ఒట్టయాల్ (వన్ పర్సన్) అనే పేరుతో ఒక గంట నిడివిగల డాక్యుమెంటరీని రూపొందించాడు.[8] దయా బాయి జీవితం తనకి ఒక ప్రేరణగా నిలిచిందని 2005లో నందితా దాస్ పేర్కొన్నది.

సినిమాలు

[మార్చు]

దయా బాయి కాంతన్ - ది లవర్ ఆఫ్ కలర్ (2021) సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది.

మూలాలు

[మార్చు]
  1. Suneetha, B. (2010-11-26). "Face of compassion". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-03-19.
  2. "daya bai,lady of fire". Archived from the original on 2018-12-25. Retrieved 2022-03-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Policies of Church contrary to Christ". Archived from the original on 2018-06-25. Retrieved 2022-03-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. Face of compassion
  5. "One-woman army drives financial inclusion in rural Madhya Pradesh". Vinson Kurian. The Hindu. 31 January 2012.
  6. Kiran Bedi calls for change in education system[permanent dead link]
  7. Good Samaritan National Award presented to Dayabai
  8. Face of compassion
"https://te.wikipedia.org/w/index.php?title=దయా_బాయి&oldid=4218431" నుండి వెలికితీశారు