దర్భ

వికీపీడియా నుండి
(దర్భగడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దర్భ
దర్భ
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
D. bipinnata
Binomial name
Desmostachya bipinnata
Synonyms[2][3][4]
  • Briza bipinnata L.
  • Eragrostis bipinnata (L.) K.Schum.
  • Eragrostis cynosuriodes (Retz.) P.Beauv.
  • Poa cynosuriodes Retz.
  • Stapfiola bipinnata (L.) Kuntze
  • Uniola bipinnata (L.) L. (basionym)

దర్భ గడ్డి వృక్ష శాస్త్రీయ నామం Desmostachya bipinnata. దర్భ గడ్డి ఒక గడ్డి మొక్క. దర్భను కుశదర్భ అని కూడా అంటారు.

ఇతర భాషలలో పేర్లు

[మార్చు]

సంస్కృతం : దర్భ, కుశః, హిందీ : దబ్, దహోలీ, కన్నడ : దర్భ, మలయాళం : దర్భ, దర్భప్పుల్లు, తమిళం : దర్బైపుల్, ఆంగ్లం : సాక్రిఫిషియల్ గ్రాప్

వ్యాప్తి

[మార్చు]

భారతదేశమంతటా.

మొక్క వర్ణన

[మార్చు]

గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్ల నుండి అనేక సన్నగా పొడవుగా మందపాటి పోచలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. సంవత్సరం అంతా పెరుగుతుంది. వేళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దర్భ పోచలు అంచులో చాలా పదునుగా ఉంటాయి. కొస కూడా ముల్లులాగా ఉంటుంది. ఈ పోచలు 50 సెం.మీ. నుంచి 1 మీటరు పొడవున నూగు ఏమీ లేకుండా నున్నగా ఉంటాయి. దీని గింజలు 0.5 నుండి 0.6 సెం.మీ. బారు ఉంటాయి. కొలగా, ముక్కొంగా అణగగొట్టబడ్డట్టు ఉంటాయి.

ఔషధ లక్షణాలు

[మార్చు]

వేర్లు వగరుగా ఉంటాయి. చలవ చేస్తుంది. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. మూత్రము బొట్లు బొట్లుగా అవుటను మాన్పుతుంది. క్షీరవర్దనిగా పని చేస్తుంది. ఉబ్బసము, కామెర్లు, పిత్త ప్రకోపము వలన వచ్చు రోగములకు, అతిదాహము, మూత్రములో రక్తము పోవుటకు, మంచి మందు. దీని కాడలు రుచిగా ఉంటాయి. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. ఉత్సహ ప్రేరకము, కామోద్రేకాన్ని కలిగిస్తుంది. బంక విరేచనాలకు మంచి మందు. అతి బహిష్టుస్రావమును అరికడుతుంది. కామెర్లు, ఉబ్బసము, మూత్రము బొట్లు బొట్లుగా పడుటను, మూత్ర నాళ రోగులకు, చర్మము పెట్లుట వంటి వ్యాధులకు మంచి మందు.

ఉపయోగపడు భాగాలు

[మార్చు]

మొక్క మొత్తము.

పూజా కార్యక్రమాలలో

[మార్చు]

యజ్ఞ, యాగాలలో దర్భ గడ్డి ప్రముఖ పాత్ర వహిస్తుంది. (పూజకు తగిన, యోగ్యమైన అష్టార్ఘ్యములు : పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భగడ్డి, పువ్వులు)

మూలాలు

[మార్చు]
  1.  Desmostachya bipinnata was published in W. T. Thiselton-Dyer's Flora Capensis; being a systematic description of the plants of the Cape Colony, Caffraria, & port Natal. London 7(4): 632. 1900 "Plant Name Details for Desmostachya bipinnata". IPNI. Retrieved June 15, 2011.
  2.  GRIN (August 31, 2000). "Desmostachya bipinnata information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Archived from the original on 2012-10-11. Retrieved June 15, 2011.
  3.  Uniola bipinnata, the basionym for D. bipinnata, was originally described and published in Species Plantarum ed. 2, 1:104. 1762 GRIN (August 31, 2000). "Uniola bipinnata information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Archived from the original on 2012-10-11. Retrieved June 15, 2011.
  4. "Desmostachya bipinnata". Flora of Pakistan. eFloras. Retrieved 8 February 2011.

వనమూలికా వైద్యము

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దర్భ&oldid=3878517" నుండి వెలికితీశారు