దలీప్ కౌర్ తివానా
దలీప్ కౌర్ తివానా పంజాబీ సాహిత్యంలో నవల, లఘుకథా రచయిత్రి. ఆమెకు అనేక ప్రాంతీయ, జాతీయ పురస్కారాలు లభించాయి. ఆమె అనువాద రచయిత్రిగా కూడా సుపరిచితులు. ఆమె పంజాబ్ విశ్వవిద్యాలయం (పాటియాలా) లో పంజాబీ భాష ప్రొఫెసర్, డీన్ గా పదవీవిరమణ చేసారు. ఆమెకు కథా రచయిత్రిగా ఆమెకు ఎంత గొప్ప పేరుందో, నవలా రచయిత్రిగా అంతే గుర్తింపు ఉంది.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన లూధియానా జిల్లాలోని రబ్బన్ గ్రామంలో మే 4 1935 న జన్మించారు. పాటియాలా పట్టణంలోని పెద్దమ్మ ఇంట పెరిగారు. ఆమె పాటియాలాలో విద్యాభ్యాసం చేసారు. ఆమె ఎం.ఎ లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత చెందారు, చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పొందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.[1] ఉద్యోగరీత్యా పంజాబు విశ్వవిద్యాలయంలో పంజాబీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలయ్యారు. క్రమక్రమంగా డీన్, యూనివర్సిటీ నేషనల్ ప్రొఫెసర్ వంటి ఉన్నతస్థాయి పదవుల్ని కూడా చేపట్టారు.[2] ఆమెకు గ్రామాలన్నా, గ్రామీణులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఆమె కథల్లో, నవలల్లో అమాయక జనం, అట్టడుగు జనం ఎక్కువగా కనిపిస్తారు. వారి ఆశ, నిరాశల్నే ఆమె ఎక్కువగా చిత్రించారు.
ఆమె ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ భూపేందర్ సింగ్ ను వివాహమాడారు. ఆమెకు సిమ్రజిత్ సింగ్ అనే కుమారుడున్నాడు. ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ప్రొఫెసరుగా యున్నారు. ఆమె పాటియాలాలోని పంజాబ్ విశ్వవిద్యాలయ కాంపస్ లో నివాసముంటున్నారు.
అక్టోబరు 14 2015 న ఆమెకు వచ్చిన పద్మశ్రీ అవార్డును వెనుకకు యిచ్చె వేసారు. దాదరీ ఘటన, కల్బుర్గీ హత్యకు నిరసనగా అవార్డులు వెనక్కి ఇచ్చే పరంపరగా ఈ అవార్డును వెనుకకు యిచ్చివేసారు. ఆమెకు ఈ అవార్డు సాహిత్యం, విద్యా అంగాలలో చేసిన కృషికి గానూ 2004 లో వచ్చింది.[3]
దలీప్ కౌర్ వైవాహిక జీవితం ఆశించినంత సంతోషంగా సాగలేదు. సంసార నావ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓటమిని నిబ్బరంగా ఎదుర్కొంటూ, విద్యారంగంలోనూ, సాహితీ రంగంలోనూ నిరంతర కృషి కొనసాగించారు. సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా పలు అవార్డులను ఆమె కైవసం చేసుకున్నారు.[4]
రచనా ప్రస్థానం
[మార్చు]ఇంటాబయటా ఎక్కడా సాహిత్య వాతావరణం లేని రోజుల్లో కళాశాలలోని ఓ అధ్యాపకురాలు ఈమెను కథా రచన వైపు మళ్లించారు. కాలేజీ మేగజైనుకు ఏదో ఒకటి రాసుకురమ్మని ప్రోత్సహించారు. దాంతో దలీప్‌కౌర్ ఓ చిన్న కథ రాసుకుపోయారు. అది అచ్చయిన తర్వాత కళాశాల ప్రిన్స్‌పాల్ దలీప్ కౌర్‌ను ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. దీంతో ఆమెకు తన రచనా శక్తిపట్ల విశ్వాసం పెరిగింది. ఆ రకంగా ఆమె ఆ తర్వాత రెండు వందల కథలు రాయగలిగారు. ఎనిమిది సంపుటాలు ప్రచురించగలిగారు. ప్రముఖ పంజాబీ కథా రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగారు. 'మేరీసారీ కహానియా పేరుతో ఒక సర్ప కథా సంకలనం కూడా వెలువరించారు. పంజాబీ కథానికా రంగంలో శైలీ పరంగా వచ్చిన మార్పులన్నీ దలీప్‌కౌర్ కథల్లో స్పష్టంగా చూడొచ్చు.[4]
అవార్డులు
[మార్చు]"కథా కహూ ఊర్వశి" నవలకు 2001లో ప్రతిష్ఠాత్మకమైన సరస్వతీ సమ్మాన్ స్వీకరించారు. శిరోమణి సాహిత్యకార్, దలివార్, పంజాబ్ అకాడమీ వంటి అవార్డులతో పాటు ఐదు జాతీయ పురస్కారాలతోపాటు రెండు అంతర్జాతీయ అవార్డులు కూడా స్వంతం చేసుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-06. Retrieved 2016-07-03.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ http://www.quamiekta.com/englishnews/p.php?q=1353
- ↑ http://indianexpress.com/article/india/india-news-india/writer-returns-padma-shri-rss-lashes-out/
- ↑ 4.0 4.1 స్త్రీ మనోవేదనఫైనే ఆమె శ్వాస, ధ్యాస
ఇతర లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with NLA identifiers
- పంజాబ్ రచయితలు
- 1935 జననాలు
- పంజాబ్ వ్యక్తులు
- జీవిస్తున్న ప్రజలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ నవలా రచయితలు