Coordinates: 25°38′N 85°3′E / 25.633°N 85.050°E / 25.633; 85.050

దానాపూర్ (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దానాపూర్
దీనాపూర్ నిజామత్
పట్తణం
దానాపూర్ is located in Bihar
దానాపూర్
దానాపూర్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°38′N 85°3′E / 25.633°N 85.050°E / 25.633; 85.050
దేశం India
రాష్ట్రంబీహార్
డివిజనుపాట్నా
జిల్లాపాట్నా
పట్టణ సముదాయంపాట్నా
Government
Population
 (2011)
 • Total1,82,241
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
801101/03/05/08/09/13/12
801501/03/06
800111
టెలిఫోన్ కోడ్06115
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-01

దానాపూర్ బీహార్ రాష్ట్రంలో పాట్నా పట్టణానికి చెందిన ఉపగ్రహ పట్టణం. [1] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా 1,82,241. ఇది పాట్నా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం. [2] దీన్ని దీనాపూర్ నిజామత్ అని, దీనాపూర్ అనీ కూడా పిలుస్తారు. ఇది 1887 లో పురపాలక సంఘంగా ఏర్పడింది. [3] స్థానికంగా జాన్‌గిల్ అని పిలిచే వలస వచ్చిన సైబీరియన్ కొంగలకు దానాపూర్ ఆశ్రయ మిస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సంతానోత్పత్తి కోసం అవి ఇక్కడికి వస్తాయి. శీతాకాలం ప్రారంభానికి ముందు ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోతాయి. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సైనిక సబ్-ఏరియా ప్రధాన కార్యాలయం ఇక్కడి ఆర్మీ కంటోన్మెంట్లో ఉంది. [4] [5] ఈ పట్టణం దానాపూర్ విధానసభ నియోజకవర్గం, పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గాల్లోకి వస్తుంది.

దానాపూర్ వద్ద గంగానదిపై ఉన్న ఫ్లాగ్‌స్టాఫ్ ఘాట్ను 1859 లో నిర్మించారు. ఇది అత్యంత పురాతన ఘాట్లలో ఒకటి. [6] గురు తేజ్ బహదూర్ కు చెందిన గురుద్వారా హండి సాహిబ్ సిక్కులకు పుణ్యక్షేత్రం. నౌలఖా ఆలయం, బ్రిటిష్ పాలనలోని వివిధ చారిత్రక భవనాలు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు.

భౌగోళికం[మార్చు]

1859 లో ఫ్లాగ్‌స్టాఫ్ ఘాట్

ఇది గంగా నది ఒడ్డున ఉంది .

దానాపూర్ పట్టణ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం, పట్టణం మొత్తం వైశాల్యం 11.63 కిమీ 2. పట్టణాన్ని 40 వార్డులుగా విభజించారు. [1] దానాపూర్ పురపాలక సంస్థను 1889 లో స్థాపించారు.

జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
199184,616—    
20011,31,176+55.0%
20111,82,241+38.9%

2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణం జనాభా 97,129. ఇందులో పురుషులు 85,112, మహిళలు 182,241 మంది. జనాభాలో 25,092 (13.77%) మంది ఆరేళ్ల లోపు పిల్లలు. వీరిలో 13,398 మంది బాలురు కాగా, 11,694 మంది బాలికలు. 2001 డేటా ప్రకారం జనసాంద్రత హెక్టారుకు 113 మంది. [1] పట్టణ అక్షరాస్యత 78.4% పురుషుల అక్షరాస్యత 84.54%, స్త్రీల అక్షరాస్యత 71.39%. లింగ నిష్పత్తి 882. పిల్లల్లో లింగ నిష్పత్తి 873. [2]

రవాణా సౌకర్యాలు[మార్చు]

దానాపూర్ రైల్వే స్టేషన్

దానాపూర్ పట్టణానికి చక్కటి రైలు, రోడ్డు సౌకర్యాలున్నాయి. భారతదేశంలోని చాలా ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి దానాపూర్ స్టేషన్ (స్టేషన్ కోడ్ డిఎన్ఆర్ ) ఇక్కడి ప్రధానమైన రైల్వే స్టేషన్. ఇది తూర్పు మధ్య రైల్వే లోని దానాపూర్ డివిజన్‌కు ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం మొఘల్‌సరాయ్‌ - హౌరా ప్రధాన రైలు మార్గంలో ఉంది. జాతీయ రహదారి నం. 30 పట్టణాన్ని బీహార్‌లోని ఇతర పట్టణాలకు కలుపుతుంది. పాట్నా విమానాశ్రయం, ఇక్కడికి సమీపం లోని విమానాశ్రయం.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 City Development Plan for Danapur Archived 5 మార్చి 2014 at the Wayback Machine 2014-03-05
  2. 2.0 2.1 "Dinapur Nizamat City Population Census 2011 | Bihar". Census2011.co.in. Archived from the original on 5 March 2014. Retrieved 2014-03-05.
  3. Hoiberg, Dale (2000). Students' Britannica India — Google Books. ISBN 9780852297605. Retrieved 2014-03-05.
  4. Ramashankar (2010-12-08). "The Telegraph — Calcutta (Kolkata) | Bihar | Police force to hire 9000 ex-armymen". Telegraphindia.com. Archived from the original on 21 February 2015. Retrieved 2014-03-05.
  5. "New commander of Danapur Army HQ — The Times of India". Timesofindia.indiatimes.com. 2009-05-03. Archived from the original on 1 December 2017. Retrieved 2014-03-05.
  6. The story of the Lall Bazar Baptist Church Calcutta: being the history of Carey's church from 24th April 1800 to the present day. Edinburgh Press. 1908. Retrieved 17 March 2011.