Jump to content

దావోజీపాలెం

వికీపీడియా నుండి

దావోజీపాలెం కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం నందిగామ గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 67 కి.మీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ విజయ అమలేశ్వరీదేవి ఆలయం:- గ్రామములోని ఈ అమ్మవారిని "అంకెం" వంశీకుల ఇలవేలుపుగా కొలుస్తారు. 1832లో "అంకెం" వంశీయులు, పశ్చిమగోదావరి జిల్లా నుండి ఇక్కడకు వలసవచ్చిన సమయంలో తమవెంట తీసికొనివచ్చిన అమ్మవారికి ప్రతిరూపమైన గరివెలకు, ఆచారంగా వస్తున్న రీతిలో, పూజలు నిర్వహించుచున్నారు. అమ్మవారి మహిమ అంతా గరివెలలోనే ఉన్నదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి 11 సంవత్సరాలకొకసారి, అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి, దేశ, విదేశాలలో ఉంటున్న "అంకెం" వంశీకులు, వేలాదిగా ఇక్కడికి తరలివచ్చెదరు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామ చెరువు వద్ద, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు, 2015,మే నెల-21వతెదీ నుండి, 31వతేదీ వరకు, నిర్వహించారు. [1]&[2]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2015,మే-19; 5వపేజీ.[2] ఈనాడు కృష్ణా; 2015,జూన్-1; 4వపేజీ.