దిల్జీజ్ దోసాంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిల్జీజ్‌ దోసాంజ్‌ (జననం 6 జనవరి 1984) భారతదేశానికి చెందిన గాయకుడు, పాటల రచయిత, నటుడు, నిర్మాత & టెలివిజన్ వ్యక్తి. అతను పంజాబీ సంగీతంలో,  పంజాబీ & హిందీ సినిమాలలో పని చేశాడు. దోసాంజ్ 2020లో బిల్‌బోర్డ్ ద్వారా సోషల్ 50 చార్ట్‌లోకి ప్రవేశించాడు. ఆయన నటించిన జాట్ & జూలియట్ 2, పంజాబ్ 1984, సజ్జన్ సింగ్ రంగూట్, హోన్స్లా రఖ్ పంజాబీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలు.

దోసాంజ్ 2002లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి యో యో హనీ సింగ్‌తో కలిసి 'స్మైల్' (2005), 'చాక్లెట్' (2008) తర్వాత ' ది నెక్స్ట్ లెవెల్ ' (2009)తో పంజాబీ సంగీతంలో మంచి గుర్తింపు పొందాడు. ఆయన 2011లో తొలిసారి నటుడిగా పంజాబీ సినిమా ది లయన్ ఆఫ్ పంజాబ్‌లో నటించాడు. ఆయన 2016లో క్రైమ్ థ్రిల్లర్ ఉడ్తా పంజాబ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఆ సినిమాలో నటనకుగాను ఉత్తమ పురుష డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకొని ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ కూడా పొందాడు.

డిస్కోగ్రఫీ[మార్చు]

 • దిల్ (2002)
 • ఇష్క్ దా ఉదా ఆదా (2002)
 • హేషా ( UK ) (2004)
 • స్మైల్ ( భారతదేశం & కెనడా ) ఓవర్ ఎక్స్‌పోజర్ ( UK ) (2005)
 • ఇష్క్ హో గయా (2008)
 • చాక్లెట్ (2008)
 • ది నెక్స్ట్ లెవెల్ (2009)
 • సిక్కు (2012)
 • బ్యాక్ 2 బేసిక్స్ (2012)
 • కాన్.ఫై.డెన్.టియల్ (2018)
 • రోర్ (2018)
 • గోట్ (2020)
 • మూన్ చైల్డ్ ఎరా (2021)
 • ఘోస్ట్ (2023)

నటించిన సినిమాలు[మార్చు]

పంజాబీ[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2010 మెల్ కరాడే రబ్బా రాజ్‌వీర్ ధిల్లాన్ అతిథి పాత్ర
2011 లయన్ ఆఫ్ పంజాబ్ అవతార్ సింగ్ మొదటి ప్రధాన పాత్ర
జిహ్నే మేరా దిల్ లుతేయా గుర్నూర్ సింగ్ రంధవా
2012 జాట్ & జూలియట్ ఫతే సింగ్
2013 సాది లవ్ స్టోరీ రాజ్‌వీర్ (బిల్లా)
జాట్ & జూలియట్ 2 ఫతే సింగ్
2014 డిస్కో సింగ్ లాతు
పంజాబ్ 1984 శివజీత్ సింగ్ మాన్ (శివ)
2015 సర్దార్జీ జగ్గీ
ముక్తియార్ చద్దా ముక్తియార్ చద్దా స్క్రీన్ రైటర్ కూడా
2016 అంబర్సరియ జట్ అంబర్సరియా
సర్దార్జీ 2 సర్దార్జీ జగ్గీ

సింగ్, సర్దార్జీ అత్రా సింగ్ & సర్దార్జీ సత్కార్ సింగ్

త్రిపాత్రాభినయం
2017 సూపర్ సింగ్ సాజన్ సామ్ సూపర్ సింగ్
2018 సజ్జన్ సింగ్ రంగూట్ సజ్జన్ సింగ్
2019 షాదా చడ్తా
2021 హోన్స్లా రాఖ్ యెంకీ సింగ్ నిర్మాత కూడా
2022 బేబ్ భాంగ్రా పౌండే నే జగ్గీ నిర్మాత కూడా
2023 జోడి సితార
2024 జాట్ & జూలియట్ 3 ఫతే సింగ్ చిత్రీకరణ

హిందీ[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2012 తేరే నాల్ లవ్ హో గయా అతనే "పీ పా పీ పా" పాటలో ప్రత్యేక పాత్ర
2016 ఉడ్తా పంజాబ్ సర్తాజ్ సింగ్ తొలి సినిమా
2017 ఫిల్లౌరి రూప్ లాల్ ఫిల్లౌరి
2018 వెల్‌కమ్ టు న్యూయార్క్ తేజీ
సూర్మ సందీప్ సింగ్
2019 అర్జున్ పాటియాలా అర్జున్ పాటియాలా
గుడ్ న్యూజ్ హనీ బాత్రా
2020 సూరజ్ పే మంగళ్ భారీ సూరజ్
2022 జోగి జోగిందర్ "జోగి" సింగ్
2024 క్రూ జై సింగ్ రాథోడ్
అమర్ సింగ్ చంకీలా అమర్ సింగ్ చంకీలా

టెలివిజన్[మార్చు]

మూలాలు[మార్చు]