దివ్యేందు బారువా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1966, అక్టోబర్ 27 న జన్మించిన దివ్యేందు బారువా (Dibyendu Barua) భారత దేశానికి చెందిన ప్రముఖ ఛెస్ క్రీడాకారుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రెండో భారతీయుడు బారువా. 1978లో 12 సంవత్సరాల ప్రాయంలోనే బారువా భారత జాతీయ చెస్ చాంపియన్ షిప్ లో పాల్గొని ఈ ఘనత పొందిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అదే సంవత్సరంలో బారువా ఇంగ్లాండులో ప్రపంచ నెంబర్ 2 ను ఓడించి సంచలనం సృష్టించాడు. 1983లో బారువా తొలిసారిగా జాతీయ చాంపియన్‌షిప్ పొందినాడు. 1991 అతడు గ్రాండ్ మాస్టర్ హోదా పొందినాడు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]