దీవి శ్రీనివాసాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీవి శ్రీనివాసాచార్యులు సంప్రదాయ వైద్య పరిశోధకులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు దగ్గరలోని వణుకూరులో 1904 నవంబరు 29 న జన్మించారు.తండ్రి పేరు మంగాచార్యులు. బాల్యంలో సంస్కృత భాష నేర్చుకున్నారు. 14 వ యేట ఆగమశాస్త్రం, ఆయుర్వేద వైద్య విద్యభాసంలో ప్రవేశించారు. 1922లో ఆయుర్వేద కళాశాలలో చేరి, "వైద్య విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.[1]

పరిశోధనలు[మార్చు]

గ్రామీణ వైద్యశాలలో పనిచేస్తూ పైద్య పరిశోధనలు చేసారు.1938 లో గుంటూరులో జరిగిన ఆంధ్ర ఆయుర్వేద మహావైద్య సమ్మేళనంలో శాస్త్రీయ ఔషథ నిర్మాణం, ఔషధీ మూలికా ద్రవ్య మౌక్తికాదిమణిలలో నూతన పరిశోధనా పత్రాలను సమర్పించి బంగారుపతకాన్ని అందుకున్నారు.

1946లో ఆయన స్వగ్రామంలో ఆయుర్వేద వైద్య చికిత్సాలయాన్ని నెలకొల్పారు. ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ మహాసభలను 1957లో మహా వైభవంగా నిర్వహించి కార్యదక్షులుగా పేరు పొందారు. "వణుకూరు ఆచార్యులు" గా పేరు పొందారు. ఎన్నో జటిలమైన,దీర్ఘకాలిక వ్యాథులకు మందులను తయారుచేసారు. శాస్త్రీయంగా వినూత్న ఔషథాలను రూపొందిచారు. అబిమానులు,శిష్యులు ఆయనను "అపర ధన్వంతరి" గా పేర్కొన్నారు.

ఆయన స్వగ్రామంలో 1982 లో మరణించారు.

దీవిశ్రీనివాసాచార్యులు మెమోరియల్ ఎ.పి స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్[మార్చు]

దీవిశ్రీనివాసాచార్యులు మెమోరియల్ ఎ.పి స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్ ను ఆయుర్వేద రంగంలో పరిశోధకులకు యిస్తారు.[2][3]

ములాలు[మార్చు]

  1. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్ , విజయవాడ సంపాదకులు.). విజయవాడ: శ్రీ వాసవ్య. 2011.
  2. Dr. MURALI KRISHNA CURRICULUM VITAE
  3. profile of p.muralikrishna

ఇతర లింకులు[మార్చు]