దుర్యోధన్ మాఝీ
దుర్యోధన్ మాఝీ | |||
| |||
సమాచార & ప్రజా సంబంధాలు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ, ప్రణాళిక & సమన్వయం, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 2000 – 2009 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1990 – 2009 | |||
ముందు | అనూప్ సింగ్ దేవ్ | ||
---|---|---|---|
తరువాత | హితేష్ కుమార్ బగర్ట్టి | ||
నియోజకవర్గం | ఖరియార్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | హితేష్ కుమార్ బగర్ట్టి | ||
తరువాత | అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి | ||
నియోజకవర్గం | ఖరియార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్, భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దుర్యోధన్ మాఝీ (14 ఏప్రిల్ 1938 - 11 జనవరి 2022) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖరియార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో సమాచార & ప్రజా సంబంధాలు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ, ప్రణాళిక & సమన్వయం, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]దుర్యోధన్ మాఝీ ఖరియార్ నియోజకవర్గం నుండి 1990, 1995లో జనతాదళ్ టికెట్‌పై రెండు సార్లు, 2000, 2004లో బిజూ జనతాదళ్ టికెట్‌పై రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2000 - 2009 మధ్యకాలంలో రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, ప్రణాళిక & సమన్వయం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పని చేసి 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఆయనకు 2019లో భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి బిజూ జనతా దళ్ పార్టీలో చేరాడు.[1]
మరణం
[మార్చు]దుర్యోధన్ మాఝీ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో 11 జనవరి 2022న మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ NDTV (24 March 2019). "Odisha Lawmaker, Denied Ticket By BJP, Returns To BJD". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ The Times of India (12 January 2022). "Ex-min Majhi passes away at 84". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ The New Indian Express (12 January 2022). "Odisha ex-minister Duryodhan Majhi passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ NT News (11 January 2022). "వృద్ధాప్య సమస్యలతో సీనియర్ రాజకీయ నేత కన్నుమూత". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.