దుషన్ హేమంత
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | మునసింగ్ అరాచ్చికి దుషన్ ఇషార హేమంత |
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1994 మే 24
ఎత్తు | 5 అ. 9 అం. (1.75 మీ.) |
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి లెగ్‌బ్రేక్ |
పాత్ర | ఆల్ రౌండర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి వన్‌డే (క్యాప్ 208) | 2023 జూన్ 2 - Afghanistan తో |
చివరి వన్‌డే | 2023 జూలై 7 - వెస్టిండీస్ తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2013–2014 | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ |
2014–2016 | Saracens Sports Club |
2016–2022 | Badureliya Sports Club |
2017–2019 | Sri Lanka Navy Sports Club |
2020–2022 | Burgher Recreation Club |
2022–present | Dambulla Aura |
2024 | Sylhet Strikers |
మూలం: Cricinfo, 14 March 2018 |
దుషన్ హేమంత (జననం 1994, మే 24) శ్రీలంక క్రికెట్ ఆటగాడు. ఆల్ రౌండర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి లెగ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[1] ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో దంబుల్లా ఆరా తరఫున ఆడుతున్నాడు.[2]
దేశీయ క్రికెట్
[మార్చు]2014 ఫిబ్రవరి 21న 2013–14 ప్రీమియర్ ట్రోఫీలో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[3] 2014, ఫిబ్రవరి 25న కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున హాంకాంగ్‌పై ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] 2014–15 ప్రీమియర్ లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్‌పై 2014, డిసెంబరు 13న సారాసెన్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[5]
2017 ఫిబ్రవరి 2న, లంక క్రికెట్ క్లబ్‌పై 62 పరుగులకు 7 వికెట్లతో తన తొలి ఫస్ట్-క్లాస్ ఐదు వికెట్లు సాధించాడు.[6] 2017, డిసెంబరు 29న, పాణదుర స్పోర్ట్స్ క్లబ్‌పై 193 పరుగులు చేసి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని కూడా సాధించాడు.[7]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2023 జనవరిలో, ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన వారి ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ సిరీస్ కోసం శ్రీలంక ఎ జట్టులో ఎంపికయ్యాడు. 2023, ఫిబ్రవరి 18న, ఐదు వికెట్లు సాధించాడు,[8] రెండవ అనధికారిక వన్డేలో ఇంగ్లాండ్ లయన్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.[9][10] లిస్ట్ ఎ సిరీస్‌లో 11.45 సగటుతో పదకొండు వికెట్లు తీశాడు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.[11][12] 2023లో, ఇంగ్లండ్ లయన్స్‌పై తన ఆటతీరుతో, ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ జట్టుకు హేమంత తన తొలి కాల్-అప్ పొందాడు.[13]
2023 మే లో, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[14][15] 2023, జూన్ 2న సిరీస్‌లోని మొదటి వన్డేతో తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[16]
మూలాలు
[మార్చు]- ↑ "Dushan Hemantha". ESPN Cricinfo. Retrieved 14 March 2018.
- ↑ "Teams which Dushan Hemantha played for". CricketArchive. Retrieved 2023-04-17.
- ↑ "Group B, Premier League Tournament at Katunayake, Feb 21-22 2014". ESPN Cricinfo. Retrieved 14 March 2018.
- ↑ "Hong Kong vs Colts Scorecard 2013/14 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
- ↑ "Saracens vs Col CC Scorecard 2014/15 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
- ↑ "Sri Lanka Navy Sports Club v Lankan Cricket Club, Premier League Tournament Tier B 2017/18". CricketArchive. Retrieved 2023-04-17.
- ↑ "Sri Lanka Navy v Panadura, 2017–18 Premier League Tournament Tier B". CricketArchive. Retrieved 2023-04-17.
- ↑ "Hemantha makes a mark for himself | Daily FT". Daily FT (in English). Retrieved 2023-04-17.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Hemantha bags five, as Sri Lanka 'A' level series". Print Edition - The Sunday Times, Sri Lanka. Retrieved 2023-04-17.
- ↑ "Dushan Hemantha too much for England Lions". Sunday Observer (in ఇంగ్లీష్). 2023-02-18. Retrieved 2023-05-21.
- ↑ "Best Bowler Dushan Hemantha Says: 'Flipper and leg breaks undid England Lions'". Sri Lanka Cricket (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
- ↑ "Sri Lanka drop Dickwella, recall Embuldeniya for Ireland Tests". ESPNcricinfo. Retrieved 13 April 2023.
- ↑ "Test cap for Dushan Hemantha against Ireland?". Print Edition - The Sunday Times, Sri Lanka. Retrieved 2023-04-17.
- ↑ "Sri Lanka recall Dimuth Karunaratne for Afghanistan ODIs". Cricbuzz. Retrieved 30 May 2023.
- ↑ "Rising pacer in line for ODI debut as Sri Lanka announce squad for Afghanistan series". International Cricket Council. Retrieved 30 May 2023.
- ↑ "1st ODI, Hambantota, June 02, 2023, Afghanistan tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2 June 2023.