దూరదర్శన్ సప్తగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దూరదర్శన్ సప్తగిరి
Doordarshan.png
రకము ప్రచార టి.వి. నెట్‌వర్క్[తెలుగు పదము కావాలి]
దేశము భారతదేశం భారతదేశము
లభ్యత భారత దేశం, ఇతర ఆసియా దేశాలు.
యజమాని ప్రసార భారతి
కీలక వ్యక్తులు కె.యస్. శర్మ
ఆవిర్భావ దినం 2014 సెప్టెంబరు 27 ( విజయవాడ దూరదర్శన్ కేంద్రం)
ఇతరపేర్లు సప్తగిరి దూరదర్శన్ కేంద్రం, డి డి -8
జాలగూడు www.ddsaptagiri.tv

దూరదర్శన్ సప్తగిరి (తెలుగు భాషలో) తొలి టీవి ఛానల్. ఇది 1977 సంవత్సరంలో అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిచే ప్రారంభింఛబడింది. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి మొదట్లో రోజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి.1998 నుంచి 24గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 ఏప్రియల్ 2 నుండి దీని పేరు " సప్తగిరి" ఛానల్ గా మార్చారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం విజయవాడలో చిన్న స్టూడియో స్థాయిలో ఉన్న ఉపకేంద్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ ప్రసారానికి ప్రధాన కేంద్రంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

ప్రేక్షకాదరణ[మార్చు]

1996 వరకు తెలుగులో ఉన్న ఏకైక టివి ఛానల్ దూరదర్శన్ సప్తగిరి. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇది అశేష ప్రేక్షకాదరణను చవిచూసింది. 1996 తరువాత ఇతర ప్రైవేటు ఛానళ్ళు రావడంతో క్రమంగా ప్రేక్షకాదరణను కోల్పోయింది. 1996కు ముందు ప్రతి రాత్రి 7:30గంటలకు వార్తలు చదివే వక్తలు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. శాంతి స్వరూప్, లక్ష్మి, రమాకాంత్ తదితరులు ఇంటింటా పేరొందారు. శుక్రవారం రాత్రి 8గంటలకు ప్రసారం అయ్యే చిత్రలహరి కార్యక్రమం అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.[ఆధారం చూపాలి]

కార్యక్రమాలు[మార్చు]

 • వార్తలు
 • చిత్రలహరి
 • ఆనందో బ్రహ్మ
 • ఋతురాగాలు
 • గ్రామదర్శిని
 • జాబులు-జవాబులు
 • టెలిస్కూలు
 • బాలమందిరం
 • మర్యాద రామన్న
 • డామిట్...కథ అడ్డం తిరిగింది
 • ఆగమనం
 • బంగారు చిలుక

బయటి లింకులు[మార్చు]