ప్రసార భారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసార భారతి
సంస్థ అవలోకనం
స్థాపనం 23 నవంబరు 1997
(26 సంవత్సరాల క్రితం)
 (1997-11-23)
అధికార పరిధి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేశన్ అండ్ బ్రోడ్ కాస్టింగ్ భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం ఢిల్లీ, ఇండియా
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/లు Dr. A. సూర్య ప్రకాశ్, చైర్మన్
శశి శేఖర్, ceo
Child agencies ఆల్ ఇండియా రేడియో
(Radio Broadcasting Service)
దూరదర్శన్
(Television Broadcasting Service)

ప్రసార భారతి అనేది భారతదేశ అతిపెద్ద ప్రసార సంస్థ, దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో ఉంది. ఇది పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది దూరదర్శన్, టెలివిజన్ నెట్‌వర్క్, ఆల్ ఇండియా రేడియోలను కలిగి ఉంటుంది.[1]

చైర్మన్[మార్చు]

డాక్టర్ ఎ. సూర్య ప్రకాష్ 2020 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేసినప్పటి నుండి ప్రసార భారతి బోర్డు చైర్‌పర్సన్ స్థానం ఖాళీగా ఉంది.2022 నుండి ప్రస్తుతం గౌరవ్ ద్వివేది చైర్మన్ గా ఉన్నారు

చట్టం[మార్చు]

ఈ చట్టంను పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత 1990 సెప్టెంబర్ 12 న భారత రాష్ట్రపతి అంగీకారం పొందింది. ఇది చివరకు నవంబర్ 1997 లో అమలు చేయబడింది. ప్రసార భారతి చట్టం ద్వారా, అన్ని ఆస్తులు, అప్పులు, బాధ్యతలు, చెల్లించాల్సిన డబ్బు చెల్లింపులు, అలాగే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో), దూరదర్శన్ ల అన్ని చట్టపరమైన చర్యలు ప్రసార భారతికి అనువర్తింపజేశారు..[2]

అభ్యర్థి ఎంపికపై వివాదం[మార్చు]

2010 లో దూరదర్శన్ న్యూస్ లో జర్నలిస్టుల పోస్టులకు ఎంపికైన 30 మందిలో 24 మంది అభ్యర్థులు రాజకీయ పరిశీలనల ఆధారంగా నియమించబడ్డారని ఆరోపించారు.[3]

మూలాలు[మార్చు]

  1. http://prasarbharati.gov.in/default.aspx
  2. "PRASAR BHARATI ACT, 1990". Retrieved 2012-03-21.
  3. Garg, Abhinav (14 September 2010). "CAT quashes DD selection of minister's kin". The Times of India. Archived from the original on 3 November 2012. Retrieved 14 September 2010.