దేచవరం
Jump to navigation
Jump to search
దేచవరము | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°18′55″N 79°59′06″E / 16.315254°N 79.985009°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | నకరికల్లు |
ప్రభుత్వము | |
- సర్పంచి | బండారు వెంకటేశ్వర్లును |
పిన్ కోడ్ | 522603 |
ఎస్.టి.డి కోడ్ |
దేచవరము, గుంటూరు జిల్లా, నకరికల్లు మండలంలోని గ్రామము. పిన్ కోడ్:522 603.
- ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. ఈ ఊరిలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరుపుకొంటారు. ఈ ఊరికి దగ్గరగా రూపెనగుంట్ల, కండ్లగుంట, చల్లగుండ్ల మరియు చీమలమర్రి గ్రామములు ఉన్నాయి.
- ప్రయాణ సదుపాయాలు: నరసరావుపేట నుండి ప్రతి రోజు బస్సులు ఉన్నాయి.
- ఈ గ్రామ జనాభా=4,252. ఓటర్లు=3,089. ఒకప్పుడు ఫాక్షన్ గ్రామంగా ఉన్న దేచవరం గ్రామం, 20 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచి అభ్యర్థికి పట్టం గడుతూ, గ్రామ ప్రత్యేకతను చాటుచున్నది. 1995 నుండి గ్రామంలో సర్పంచులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 1995 నుండి భవనం కోటేశ్వరమ్మ, గంగినేని రోశమ్మ, పెద్దింటి మార్కులు సర్పంచులుగా పనిచేశారు. ఈ గ్రామం అన్ని గ్రామాలకంటే అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలిచింది. కోట్లాది రూపాయలతో గ్రామంలో 80% సిమెంటు రహదారులు నిర్మించారు. మండలంలో ఏకైక ఆదర్శపాఠశాల దేచవరంలో ఇటీవల ప్రారంభమయినది. గతంలో రెండు సార్లు ఈ గ్రామం నిర్మల్ పురస్కారానికి అర్హత సాధించింది. గ్రామానికి నాలుగు వైపులాతారు రోడ్లున్నవి. 2013 జూలై ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బీ.టెక్. చదివిన బండారు వెంకటేశ్వర్లును గ్రామస్తులంతా కలిసి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [1]
- ఈ గ్రామంలో వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ, పునహ్ ప్రతిష్ఠా మహోత్సవం, 2014, మార్చి-3 సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. 200 సంవత్సరం చరిత్ర కలిగిన ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 2014, మార్చి-3న, ఉదయం 11-16 గంటలకు వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి, స్వామివార్ల విగ్రహాలు, నూతన ధ్వజ, విమాన శిఖరం, భ్రమరాంబాదేవి, లక్ష్మీ గణపతి, కుమారస్వామి, జంట నాగేంద్రస్వామి, కాలభైరవుడు, నవగ్రహాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, ద్వారపాలకుల విగ్రహాలను వేదమంత్రాలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. గ్రామంలో వినాయకుని, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో జీవధ్వజ ప్రతిష్ఠలను వేదపండితులు నిర్వహించారు. [1]