దేవాంగపురి
"దేవాంగపురి" ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన గ్రామం.[1]
దేవాంగపురి | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°49′N 80°21′E / 15.82°N 80.35°ECoordinates: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చీరాల మండలం |
మండలం | చీరాల ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
గ్రామ పరిపాలన[మార్చు]
శ్రీ పృధివి ఆదిశేషు, దేవాంగపురి గ్రామ పరిధిలోని హస్తినాపురి వాస్తవ్యులు. శ్రీ ఆదిశేషు గారికి ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వీరి భార్య శ్రీమతి వెంకటసుబ్బమ్మ, కుమారులు శ్రీ ధనుంజయ్ మరియూ వెంకటేశ్వర్లు, ఈ ముగ్గురూ ఎం.పి.టి.సి.లుగా పనిచేసారు. వీరి కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారి కోడలు, శ్రీమతి పృధివి చాందిని, 2013 జూలైలో దేవాంగపురి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామ పేరు[మార్చు]
ఈ గ్రామంలో అధికంగ దెవాంగులు నివసించడంవలన దేవాంగ పురిగా మారింది.
గ్రామ విశేషాలు[మార్చు]
శ్రీశైలంలోని మల్లన్నకు శివరాత్రి కళ్యాణానికి పెళ్ళికుమారుడిగా అలంకరించి తలపాగా చుట్టే అదృష్టం 100 ఏళ్ళక్రితం, దేవాంగపురి గ్రామ పంచాయతీ పరిధిలోని హస్తినాపురం గ్రామానికి చెందిన శ్రీ పండితారాధ్యుల స్వామికి మొదట దక్కింది. అప్పటికే శివభక్తులైన దేవాంగ సామాజిక వర్గానికి చెందిన పృధివి వంశస్తులు, ఇక్కడినుండి నిష్టతో వస్త్రాన్ని నేసి తీసుకొనివెళ్ళి సమర్పించుచున్నారు. ఈ అవకాశం మొదటగా, పృధివి వంశానికి చెందిన శ్రీ కందస్వామికి దక్కింది. నాటినుండి నేటివరకూ, ఈ ఆచారం కొనసాగుచున్నది. ప్రస్తుతం మూడో తరంలో వెంకటేశ్వర్లు ఈ క్రతువు నిర్వహించుచున్నారు. ఈ రకంగా వెంకటేశ్వర్లు, 46 సంవత్సరాలుగా శివయ్య సేవలో తరించుచున్నారు. [2]
గ్రామ ప్రముఖులు[మార్చు]
పృథ్వీ వెంకటేశ్వరరావు ( 1928 మే 10 - 2008 మార్చి 22) ప్రముఖ రంగస్థల నటుడు. [1] ఈనాడు ప్రకాశం/చీరాల; ఆగస్టు-6, 2013; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-25; 8వ పేజీ.