ఈపూరుపాలెం (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈపూరుపాలెం
రెవిన్యూ గ్రామం
ఈపూరుపాలెం is located in Andhra Pradesh
ఈపూరుపాలెం
ఈపూరుపాలెం
నిర్దేశాంకాలు: 15°51′04″N 80°23′02″E / 15.851°N 80.384°E / 15.851; 80.384Coordinates: 15°51′04″N 80°23′02″E / 15.851°N 80.384°E / 15.851; 80.384 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీరాల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,142 హె. (7,764 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం40,482
 • సాంద్రత1,300/కి.మీ2 (3,300/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08594 Edit this at Wikidata)
పిన్(PIN)523166 Edit this at Wikidata

ఆదినారాయణపురం అసలు పేరు. ప్రకాశం జిల్లా, చీరాల మండలానికి చెందిన ఈపూరుపాలెం (గ్రామీణ) శివారు గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 166., ఎస్.టి.డి.కోడ్ = 08594.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

విజయనగరకాలని 1 కి.మీ, బూర్లవారిపాలెం 2 కి.మీ, ఎన్.టి.ఆర్.నగర్ 2 కి.మీ, జయంతిపేట 3 కి.మీ, వివేకానంద నగర్ 3 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన కారంచేడు మండలం, తూర్పున బాపట్ల మండలం, పశ్చిమాన వేటపాలెం మండలం, ఉత్తరాన పరుచూరు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 1951 లో ఏర్పాటయింది. ఈ గ్రామంతో పాటు ఈ పంచాయతీ పరిధిలో బోయినవారిపాలెం, ఆదినారాయణపురం గ్రామాలు గూడా ఉన్నాయి. ఈ పంచాయతీకి తొలిసర్పంచిగా ఆకురాతి రంగనాయకులు స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అప్పటినుండి 25 ఏళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ సర్పంచిగా ఉన్నారు. పంచాయితీ కార్యాలయంతో పాటు, మార్కెట్ పరిసర ప్రాంతాల స్థలాన్ని ఆయనే దానంగా ఇచ్చినట్లు పెద్దలు చెపుతుంటారు. సీతారాంపేట, ఇస్లాంపేట, పద్మనాభునిపేట తదితరప్రాంతాలలో పేదలకు ఇళ్ళ స్థలాలిచ్చేటందుకు, తన స్వంత భూమిని వితరణ చేశారు. అలా ఈపూరుపాలెం చేనేతగడ్డగా మారటానికి ఆయన ఆనాడే, పునాది వేశారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయము, ఈపూరుపాలెం

రైల్వే స్టేషన్ కు వెళ్ళు దారిలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయము, శివాలయములు ఎంతో ప్రాచినమినవి, ప్రముకమినవి అని చెప్పవచ్చు. అంతే కాకుండా, శ్రీ రాములవారి కోవెల, నరసింహ స్వామి వారి దేవాలయములు కూడా చరిత్ర గలవి. ఈపూరుపాలెం గ్రామ వాసులకు, ఊరికి గ్రామ దేవత అయిన ఎంతో మహిమ గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ కు అతి సమీపములోనే ఉంది. ఇవే కాకుండా మరెన్నో ఇతర దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • పాలపర్తి వెంకటేశ్వర్లు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ [3]
 • వంగర మహేశ్ నేతకార్మికుడైన శ్రీ వంగర శ్రీహరి కుమారుడు శ్రీ వంగర మహేశ్, బి.టెక్. చదివి, 2014,ఫిబ్రవరి-న వి.ఆర్.వో. ఎంపికపరీక్ష వ్రాశారు. ఆ పరీక్షలో ఈయన 99% మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు పొంది తన సత్తా చాటినాడు. [4]
 • భూదాటి బాలశంకర్ భూదాటి చిన్నంకమ్మ ఒక చేనేత కార్మికుడు. ఈయన భార్య మల్లేశ్వరి. ఈ దంపతుల కుమారుడైన బాలశంకర్ ను, కొన్ని అనుకోని పరిస్థితులలో కొందరు బౌద్ధ భిక్షువులు చైనాకు తీసికొని వెళ్ళి అక్కడ కొంతకాలం ఇతనికి ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో ఇతడు అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, సాధన చేసాడు. తరువాత కొన్నాళ్ళకు స్వగ్రామానికి తిరిగివచ్చి, నేర్చుకున్న విద్యకు మరింత పదును పెట్టి, కత్తి, కర్రతో వివిధ రకాల విన్యాసాలు చేయడం ప్రారంభించి, అత్యుత్తమ నైపుణ్యాన్ని స్వంతం చేసుకున్నాడు. ఇతడి విన్యాసాలను చూసిన కొందరు స్నేహితులు, ఇతడి విన్యాసాలను అంతర్జాలంలో ఉంచగా, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎందరో తిలకించారు. ఈ విధంగా శంకర్ నైపుణ్యానికి అందరి ప్రశంసలు లభించినవి. ఇతడు స్వంతంగా రూపొందించుకొని ప్రదర్శిచుచున్న యుద్ధ విన్యాసాలను మరికొందరికి శిక్షణనిచ్చుచున్నాడు. ఇంతేగాక ఇతడికి చిత్రలేఖనంపై గూడా అద్భుత ప్రావీణ్యం ఉంది. చీరలపై అందమైన బొమ్మలను సునాయాసంగా చిత్రీకరించుచూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కుటుంబపోషణ కోసం, దీనినే వృత్తిగా స్వీకరించాడు. ఎందరో మహిళలకు చిత్రలేఖనంలో శిక్షణనిచ్చుచున్నాడు. అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చి, గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించవలెనని ఇతడి అభిలాష. [5]
 • వినుకోటి వేణు వినుకోటి వేణు ఒక వికలాంగ క్రీడాకారుడు. వీరు, 2014,అక్టోబరు-18 నుండి 24 వరకు, దక్షిణకొరియాలోని "ఇంఛియాన్" నగరంలో నిర్వహించిన పారా ఏషియాడ్ పోటీలలో పాల్గొని డిస్కస్ త్రోలో రజతపతకం సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాలనుండి ఈ పోటీలలో పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు ఈయనే కావడం విశేషం. (మామూలు ఏషియాడ్ పోటీలు నిర్వహించిన తరువాత, అదే స్టేడియంలలో వికలాంగ క్రీడాకారులకు పోటీలు నిర్వహించడం ఆనవాయితీ). మొదట ఈ పోటీలకు ఎంపికైన తరువాత వీరు బెంగళూరులోని సాయ్ స్టేడియంలో ఒక నెలరోజులపాటు శిక్షణ తీసికొన్నారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఆ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర క్రీడామంత్రి మరియూ క్రికెట్ దిగ్గజం శ్రీ కపిల్ దేవ్ ఇచ్చిన ప్రోత్సాహం వీరిని ఉత్తేజపరచింది. 2015 లో దోహాలో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీలలోనూ మరియూ 2016లో జరిగే ఒలింపిక్స్ లోనూ పాల్గొనడానికి అర్హత సాధించాలని ఈయన సంకల్పం. [6]
 1. 2016,మార్చి-26 నుండి 30 వరకు హర్యాణా రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలలో, ఈపూరుపాలెం గ్రామానికి చెందిన శ్రీ వినుకోటి వేణు కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీలలో మన రాష్ట్రం నుండి 12 మంది వికలాంగ క్రీదాకారులు పాల్గొనగా ఎఫ్-56 విభాగంలో వేణు రాణించాడు. [7]

గ్రామ విశేషాలు[మార్చు]

 1. ఈ గ్రామం శతాబ్దాలుగా చేనేతకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేనేత వస్త్రాలు దేశ, విదేశాలకు ఎగుమతి అగుచున్నవి.[4]
 2. ఈ వూరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుప్పడం చీరకు పుట్టినిల్లు. చేనేత ఉద్యమాలకు పురిటిగడ్డ. మల్లేశ్వరి వంటి అంతర్జాతీయ వెయిట్ లిఫ్ టర్లు వోనమాలు దిద్దుకుంది ఇక్కడే. రాష్ట్రంలోని ఆరు పెద్ద పంచాయితీలలో ఒకటి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 40,482 - పురుషుల సంఖ్య 20,440 - స్త్రీల సంఖ్య 20,042 - గృహాల సంఖ్య 11,288

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,543.[5] ఇందులో పురుషుల సంఖ్య 12,998, మహిళల సంఖ్య 12,545, గ్రామంలో నివాస గృహాలు 6,500 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,142 హెక్టారులు.

 • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. ఈనాడు ప్రకాశం 18 జులై 2013, 8వ పేజీ.
 3. Burlavari Palem City in India[permanent dead link]
 4. ఈనాడు మే 7 వ తేదీ, 2013. ప్రకాశం జిల్లా, పేజీ-8.
 5. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[4] ఈనాడు ప్రకాశం; 2014,ఫిబ్రవరి-23; 1,11 పేజీలు. [5] ఈనాడు ప్రకాశం; 2014, ఆగస్టు-7; 9వ పేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2014,నవంబరు-5; 9వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2016,ఏప్రిల్-2; 2వపేజీ.