Jump to content

దేవి లాల్ సమర్

వికీపీడియా నుండి
దేవీ లాల్ సమర్
జననం(1911-07-30)1911 జూలై 30
మరణం1981 డిసెంబరు 3(1981-12-03) (వయసు 70)
జాతీయతభారతీయుడు

దేవి లాల్ సమర్ (1911 జూలై 30 - 1981 డిసెంబరు 3) రాజస్థాన్ ఉదయపూర్ భారతీయ లోక్ కలా మండల్ అనే జానపద- రంగస్థల మ్యూజియం వ్యవస్థాపకుడు, దర్శకుడు. ఆయన చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. రాజస్థానీ నాటక రంగం, తోలుబొమ్మలాట గురించి ఆయన హిందీలో అనేక పుస్తకాలు రాశారు.[1]

సమర్ పాఠశాల ఉపాధ్యాయుడు. అతను తోలుబొమ్మలాట నేర్చుకున్నాడు. 1952లో భారతీయ లోక కళా మండల్ ను ఏర్పాటు చేశాడు. ఆయన 1954లో మొదటి తోలుబొమ్మ ఉత్సవాన్ని కూడా ప్రారంభించారు.[2]

కట్పుట్లి కళకు గాను 1968లో దేవిలా సమర్ పద్మశ్రీని అందుకున్నారు. ఆయన తన 70వ ఏట 1981 డిసెంబర్ 3న మరణించారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Devi Lal Samar". UdaipurBlog. 17 December 2018. Retrieved 26 February 2023.
  2. "Antarmana". worldcat.org. Retrieved 2017-10-17.
  3. Sangeet Natak: Volume 37. Sangeet Natak Akademi. 2002. p. 54. Retrieved 26 February 2023.
  4. Indian and Japanese Folklore: An Introductory Assessment. KUFS Publication. 1984. p. 209. Retrieved 26 February 2023.

లాలు

[మార్చు]