Jump to content

దొడ్ల నారపరెడ్డి

వికీపీడియా నుండి

దొడ్ల నారపరెడ్డి ఆయుర్వేద వైద్యులు, రచయిత.

వీరు వైఎస్ఆర్ జిల్లా రెడ్డికృష్ణంపల్లి లో మే 1, 1965 సంవత్సరంలో దొడ్ల పిచ్చిరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.

వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి ఆయుర్వేదాచార్య (బి.ఎ.ఎమ్.ఎస్.), పి.జి.డిప్లొమా ఇన్ ప్లాంట్ డ్రగ్స్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి నుండి "ఆలయ సంస్కృతి", యోగా నందు డిప్లొమాలు పొందారు. వివిధ జాతీయ ఔషధ మొక్కల సదస్సులలో ప్రసంగించారు. హెరిటేజ్ హీలింగ్, సప్తగిరి, అన్నదాత మాస పత్రికలలోను, వివిధ దినపత్రికలలోనూ మూలీకావైద్యం మీద అనేక వ్యాసాలను రచించారు.

ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు బాలరాజు మహర్షి గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా "వనౌషధీ వితరణ యజ్ఞం" పేరుతో నిర్వహించిన పలు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలలో పాల్గొన్నారు. వారి ప్రేరణతో వీరు అమూల్యమైన పుస్తకాలను సంకలనం చేశారు.

ప్రముఖమైన రచనలు

[మార్చు]
  • ఔషధ మొక్కల సాగు - మార్కెటింగ్ అవకాశాలు
  • గృహ వైద్యము
  • వనౌషధీ ప్రదీపిక