దోర్జీ షెరింగ్ లెప్చా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోర్జీ షెరింగ్ లెప్చా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 ఫిబ్రవరి 24 (2024-02-24)
ముందు హిషే లచుంగ్పా
నియోజకవర్గం సిక్కిం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019

భవనాలు & రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
2014 – 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1958
గాంగ్‌టక్ జిల్లా, సిక్కిం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
జీవిత భాగస్వామి దేవిక లెప్చా
వృత్తి రాజకీయ నాయకుడు

దోర్జీ షెరింగ్ లెప్చా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు సిక్కిం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఒకసారి మంత్రిగా పని చేసి 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో సిక్కిం రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

దోర్జీ షెరింగ్ లెప్చా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994 శాసనసభ ఎన్నికలలో మార్టం శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎస్‌డిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1994, 2004 ఎన్నికలలో పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

దోర్జీ షెరింగ్ లెప్చా 2009 శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు ఆ తరువాత 2014, 2019లో గ్నాతంగ్ మచాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై పవన్ కుమార్ చామ్లింగ్ మంత్రివర్గంలో 2014 నుండి 2019 వరకు రవాణా& పబ్లిక్ వర్క్స్ (భవనం, గృహనిర్మాణం) శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 2019లో గ్నాతంగ్ మచాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 ఆగస్టు 13న ఈశాన్య ప్రాంతంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో ఎస్‌డిఎఫ్‌కి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

2023 రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ పార్టీ దోర్జీ షెరింగ్ లెప్చాను అభ్యర్థిగా జనవరి 7న ప్రకటించగా[4] ఇతర పార్టీల నుండి ఎవరు కూడా పోటీలో లేకపోవడంతో ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి  డిటి లెప్చాను రిటర్నింగ్ అధికారి లలిత్ కుమార్ గురుంగ్స రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రకటించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. The Hindu (7 January 2024). "BJP names D.T. Lepcha as candidate for Rajya Sabha election in Sikkim" (in Indian English). Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  2. 2.0 2.1 NDTV (12 January 2024). "BJP Candidate DT Lepcha Wins Lone Sikkim Rajya Sabha Seat Uncontested". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  3. The Times of India (13 August 2019). "10 SDF MLAs join BJP in Sikkim". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  4. The Hindu (7 January 2024). "BJP rewards Sikkim MLA D.T. Lepcha with Rajya Sabha nomination" (in Indian English). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.