దోర్నాల హరిబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోర్నాల హరిబాబు
Haribabu Dornala.jpg
జననం (1968-03-22) 22 మార్చి 1968 (వయస్సు 53)
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల, సినిమా నటుడు
తల్లిదండ్రులునరసింహరావు

దోర్నాల హరిబాబు (జ. 1968 మార్చి 22) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన రంగస్థల, సినిమా నటుడు. నాటకాల్లో, టీవీ రియాలిటీ కార్యక్రమాల్లో హాస్యనటుడిగా నటించాడు.

జననం[మార్చు]

హరిబాబు 1968, మార్చి 22న నెల్లూరులో జన్మించాడు. తండ్రిపేరు నరసింహరావు. బికాం వరకు చదువుకున్నాడు.

నాటకరంగం[మార్చు]

1980లో రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డి దగ్గర నాటకరంగంలో శిక్షణ పొందిన హరిబాబు, పన్నెండేళ్లపాటు పౌరాణిక నాటకాల్లో నటించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తమిళనాడు, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హాస్యనాటకాలు ప్రదర్శించి 19సార్లు ఉత్తమ హస్యనటుడిగా బహుమతులు అందుకున్నాడు.[1]

నటించినవి

 1. కర్కోటకుడు, జీవలుడు (చిత్రనళీయం)
 2. లోహితుడు, కేశవుడు (సత్యహరిశ్చంద్ర)
 3. భరతుడు (శకుంతల)
 4. చిన్న చంద్రుడు (తారాశశాంకం)
 5. సుకులుడు (సారంగధర)
 6. శ్రీరాముడు (భక్తరామదాసు)

టీవీరంగం[మార్చు]

టెలివిజన్ ఛానళ్ళలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్‌లలో నటించి ప్రేక్షకులను నవ్వించాడు. జీ స్మైల్ శ్రీ, మత్తుగా గమ్మత్తుగా, నవ్వుల్- నవ్వుల్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

పురస్కారాలు - బహుమతులు[మార్చు]

 1. నెల్లూరు జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం - 2018 - నాటకరంగంలో కృషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2018.[2][3]
 2. స్వర్ణ పతకం - ఆంధ్రసోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నాటక పోటీలు, చెన్నై
 3. ‘స్మైల్ రాజా’ అవార్డుతోపాటు లక్షరూపాయల బహుమతి
 4. అమెరికన్ ఎక్సలెన్సీ అవార్డు- తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, అమెరికా

ఇతర వివరాలు[మార్చు]

 1. హరివిల్లు క్రియేషన్స్ పేరుతో సాంస్కృతిక సంస్థను స్థాపించి, హాస్యవల్లరి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.
 2. సారా వ్యతిరేకోద్యమం, పారిశుద్ధ్యం- ప్రజారోగ్యం, దోమల నిర్మూలన వంటి ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాలలో నటించాడు.
 3. అమెరికా, దుబాయ్, మలేసియా, మారిషస్ దేశాల్లో సంక్రాంతి సంబరాలు, తెలుగు సంఘం వేడుకల్లో హాస్య ప్రదర్శనలు చేశాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

 1. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ మాజీ సభ్యుడు.

మూలాలు[మార్చు]

 1. సాక్షి, ఫ్యామిలీ (5 November 2013). "కళాత్మకం : నవ్వుల హరివిల్లు". Archived from the original on 22 మార్చి 2020. Retrieved 22 March 2020. Check date values in: |archivedate= (help)
 2. వెబ్ ఆర్కైవ్, ఈనాడు, తాజా వార్తలు (16 April 2018). "కందుకూరి రంగస్థల అవార్డులు ప్రకటన". Retrieved 22 March 2020.
 3. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2018" (PDF). web.archive.org. Retrieved 22 March 2020.