Jump to content

ద్యావరి నరేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
ద్యావరి నరేందర్‌ రెడ్డి
జననం
జాతీయతభారతీయుడు
వృత్తిఆంగ్ల ఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, గేయ రచయత
తల్లిదండ్రులుచిన్న రాంరెడ్డి (తండ్రి), నారాయణమ్మ (తల్లి)
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా 2015, జూన్ 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో 400 మంది కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న ద్యావరి నరేందర్ రెడ్డి

ద్యావరి నరేందర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి. వికారాబాదు జిల్లా పెద్దేముల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఆయన విరాటపర్వం (2022) తెలుగు సినిమాకు ‘నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగాదారిలో’ గీతాన్ని అందించి ప్రసిద్ధి చెందాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ద్యావరి నరేందర్ రెడ్డి వికారాబాదు జిల్లా పెద్దేముల్‌ లో చిన్న రాంరెడ్డి, నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. వారిది రైతు కుటుంబమే అయినా ఆయన ఆంగ్ల మాధ్యమంలో చదివాడు. ఆయన విద్యాభ్యాసం తాండూరులో కొనసాగింది. 2002లో, ఆయన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. 2006లో, ఆయన ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు.

సాహిత్యం

[మార్చు]

వృత్తిరీత్యా బోధిస్తున్నది ఆంగ్లం, అయినా తెలుగు భాషంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఏమాత్రం సమయం దొరికినా తెలుగు పుస్తకాలు చదవడం అలవర్చుకున్నాడు. చిన్నప్పటి నుండే కవితలు రాసే ఆయనకు తెలుగుభాషపై పట్టు దొరికిన తర్వాత పద్యరచన మొదలుపెట్టాడు. లక్ష్మీ నరసింహ శతకం, వేంకటేశ్వర శతకం, అయ్యప్పస్వామి శతకం, అమృతవర్షిణి శతకం వంటి వివిధ రచనలు చేశాడు. గీతామృతం, హంసధ్వని మినీ కవితలు, వేంకటేశ్వర భక్తి గజల్స్‌ రాశాడు.

2022లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా విరాట పర్వం ద్వారా ఆయన పాటల రచయితగా పరిచయం అయ్యాడు. ఇందులో రెండు పాటలు, ఒక గజల్‌, రెండు పద్యాలు రాశాడు. దీని విజయంతో, మరో సినిమాలోనూ ఆయన అవకాశం దక్కించుకున్నాడు.

2015లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ద్యావరి నరేందర్ రెడ్డిని సత్కరించింది. మహాకవి సినారె కళాపీఠం సంస్థ డా సి. నారాయణరెడ్డి 93వ జన్మదిన సందర్భంగా ఆయన సినారె సాహిత్య పురస్కారం - 2024 ను అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]