Jump to content

ద లోన్లీ ప్యాలెట్

వికీపీడియా నుండి
ద లోన్లీ ప్యాలెట్
The podcast that returns art history to the masses, one object at a time.
ప్రదర్శన
ఆతిథ్యదాతతమర్ అవిషాయ్
కళా ప్రక్రియకళా చరిత్ర
భాషఆంగ్లం
నిర్మాణం
ఎపిసోడ్ల సంఖ్య50, plus 4 bonus (as of డిసెంబరు 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])
ప్రచురణ
వాస్తవ విడుదల2016 – present
ప్రదాతహబ్ అండ్ స్పోక్

ద లోన్లీ ప్యాలెట్ (ఆంగ్లం: The Lonely Palette) చిత్రలేఖన చరిత్రకు సంబంధించిన ఒక పాడ్కాస్ట్. బోస్టన్ లోని మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో లెక్చరెస్ గా పని చేసే తమర్ ఆవిషై, ఈ పాడ్కాస్ట్ కు వ్యాఖ్యాత.[1] 2016 లో మొదలైన ఈ పాడ్ కాస్ట్, రెండు వారాలకు ఒక ఎపిసోడ్ గా నిర్మించబడింది. ఈ పాడ్కాస్ట్ నేపథ్యంలో ఉన్న ధ్యేయం "ఒక సమయం లో ఒకే అంశంగా, సాధారణ ప్రజానీకం వద్దకే చిత్రలేఖన చరిత్ర పునరాగమనం!" 30-40 నిముషాల నిడివి గల ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లు చిత్రలేఖన కళాఖండాలను, అవి సృష్టించిన కళాకారులను, వారు జీవించిన/పనిచేసిన కాలమాన స్థితిగతులను సునిశితంగా పరిశీలిస్తాయి.[2][3] ఈ పాడ్కాస్ట్, చిత్రలేఖన చరిత్రను ఆసక్తికరంగా మార్చటానికి, శ్రోతలకు చిత్రలేఖన చరిత్రకు దగ్గర చేయటానికి ప్రయత్నిస్తుంది.[4] ఈ పాడ్ కాస్ట్ ను ఇదే పేరుతో ఉన్న వెబ్ సైట్ అయిన పైనే కాకుండా, యాపిల్ పాడ్కాస్ట్స్, గూగుల్ పాడ్కాస్ట్స్, సౌండ్ క్లౌడ్ వంటి పాడ్ క్యాచర్ ల పై వినవచ్చును.[5]

కళను నిర్వచించిన వ్యాఖ్యాత

[మార్చు]

ఇప్పటికైనా, ఎప్పటికైనా, అనుక్షణం మారిపోతోన్న ప్రపంచం లో కళ యొక్క నిర్వచం మాత్రం ఎప్పటికీ మారలేదు. కళ అంటే ఒక సంబంధం. 9వ శతాబ్దమైనా, 12వ శతాబ్దమైనా, 1970 అయినా కళాకారులు వారి అనుభవాన్ని మొత్తం తమ చిత్రలేఖనాలలో రంగరించాలని చూశారు. వీటి ద్వారనే మనతో సంబంధం ఏర్పరచుకోవాలని చూశారు.

అని కళని నిర్వచిస్తుంది తమర్.[1]

పాశ్చాత్య కళాభ్యాసం గురించి

[మార్చు]

నేను కళ గురించి చేసిన అభ్యాసం కూడా ఐరోపా చుట్టూ తిరుగుతుంది. ఇతర ప్రాంతాలలో కళను గురించి తెలుసుకోవటానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇది నాకు చాల ముఖ్యం. నా పరిమితులను నేను విస్తరించుకొని నేను ఎవరి కథలను చెప్పాలో వెదికి నన్ను నేను సవాలు చేసుకోవాలి అని అనుకొంటున్నాను. నేను కళా చరిత్రను అభ్యసించాను కాబట్టి ఇది నేను చేయగలుగుతాను అనే నమ్మకం నాకు ఉంది.

అంటుంది తమర్.[1]

నిర్వహణ

[మార్చు]

కళాఖండాలను వీక్షిస్తోన్న (అన్ని వయస్కుల) కళాభిమానుల గమనికలను ముఖాముఖి నమోదు చేసుకుంటుంది తమర్. అయితే కోవిడ్-19 వ్యాధి వలన మ్యూజియాలు మూతబడటంతో కళాఖండాల యొక్క ఫోటోలను తన స్నేహితులకు పంపి వారు గమనికలు నమోదు చేసేది.[1] వారి గమనికలకు కొనసాగింపుగా తన వ్యాఖ్యానాన్ని పొడిగిస్తూ ఆ ఎపిసోడ్ ను ముందుకు తీసుకువెళుతుంది.

ఫ్రీడా కాహ్లో, రెంబ్రాండ్ట్, ఆన్సెల్ ఆడంస్, రెనె మాగ్రిట్టె, ఆండీ వార్హోల్, ఎడ్వార్డ్ హాపర్, కత్సుషికా హొకుసాయ్ వంటి వారిని తన ఎపిసోడ్స్ లో స్పృశించింది తమర్.

వ్యాఖ్యాత యొక్క అభిప్రాయాలు

[మార్చు]

24వ ఎపిసోడ్ అయిన Meditation on Mark Rothko తనకు అన్నింటికన్న ఇష్టమైనదిగా చెబుతుంది తమర్. "ఈ ఎపిసోడ్ నాకు ఒక కొరకరాని కొయ్య. ఒక పట్టాన అర్థం కానిది. దీనిని అర్థం చేసుకొనే అనుమతి కంటే, చేసుకోలేక పోయే అనుమతే మనకు ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది. వీక్షకునికి భావోద్రేక కోణం లో ఏమీ జరగనట్లే అనిపిస్తోన్నా, మేధస్సు కోణం లో ఏం జరుగుతోందో ఈ ఎపిసోడ్ లో తెలియజేసాను!" అంటుంది తమర్! [1]

కరోనా వైరస్ 2019 వలన మ్యూజియాలు మూసుకుపోయినా, పరిస్థితులు అదుపు లోకి వచ్చిన తర్వాత మెల్లగా తెరుచుకోవటం ప్రారంభించటం పై, "కళాఖండానికి ఎదురుగా నిలబడి ప్రత్యక్షంగా చూడటాన్ని మించిన అనుభవం లేదని మనం అనుకొంటాం కానీ, అందులో నిజం లేదు. కాలం మారిపోయింది. వర్చువల్ ఆర్ట్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం లకు, కళాకారులకు, ఇతరులకు కళను అనుభవించే విధానానికి నూతన భాష్యం పలికింది." అని తమర్ అభిప్రాయపడుతుంది.[1]

ఎపిసోడ్ ల వివరాలు

[మార్చు]
విడుదల తేదీల వారీగా ద లోన్లీ ప్యాలెట్ పాడ్కాస్టు లోని ఎపిసోడ్ ల జాబితా
క్రమ సంఖ్య విడుదల తేదీ ఎపిసోడ్ పేరు (ఆంగ్లంలో యథాతథంగా) తెలుగులో ఎపిసోడ్ పేరు యొక్క అనువాదం కామెంటు
1 2016 మే 11 Paul Cézanne's Fruit and Jug on a Table (c. 1890–94) 1890-94 మధ్య పాల్ సెజానె చే చిత్రీకరించబడ్డ ఫ్రూట్ అండ్ జగ్ ఆన్ ద టేబుల్
2 2016 మే 25 Christian Boltanski's Lumieres (blue square - Sylvie) (2000) 2000 లో క్రిస్టియన్ బోల్టాన్స్కీ చే రూపొందించబడ్డ లూమియర్స్ (బ్లూ స్క్వేర్ - సిల్వీ)
3 2016 జూన్ 08 John Singleton Copley's Portrait of Samuel Adams (1772) 1772 లో జాన్ సింగిల్ టన్ కోప్లీ చే చిత్రీకరించబడ్డ సామ్యూల్ ఆడమ్స్ యొక్క పోర్ట్రెయిట్
4 2016 జూన్ 22 Edgar Degas' Duchessa di Montejasi with Her Daughters, Elena and Camilla (1876) 1876 లో ఏద్గార్ డిగాస్ చే చిత్రీకరించబడ్ద మోంటెజాసి డచెస్, ఆమె కుమార్తెలు ఎలీనా, కామిల్లా
5 Andy Warhol's Red Disaster (1962) 1962 లో ఆండీ వార్హోల్ అనే ఫోటోగ్రఫర్ చే (పాప్ ఆర్ట్ శైలిలో) ముద్రించబడ్డ రెడ్ డిజాస్టర్ అనే ఫోటోగ్రాఫ్
6 Pablo Picasso's Portrait of a Woman (1910) 1910 లో పాబ్లో పికాసో చే చిత్రీకరించబడ్డ పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ వుమన్
7 Claude Monet's Rouen Cathedral Series (1892-94) 1892-94 లో క్లావ్డె మోనేట్ చే చిత్రీకరించబడ్డ రూవెన్ క్యాథెడ్రల్ సిరీస్
8 Richard Serra's Torqued Ellipses (1998) 19998 లో రిచార్డ్ సెర్రా చే చిత్రీకరించబడ్డ టార్క్డ్ ఎలిప్సెస్
9 Ernst Ludwig Kirchner's Reclining Nude (1909) 1909 లో ఎర్ంస్ట్ లుడ్విగ్ కిర్చ్నర్ చే చిత్రీకరించబడ్డ రిక్లైనింగ్ న్యూడ్
10 Piet Mondrian's Composition with Red, Yellow, and Blue (1927) 1927 లో పీట్ మోండ్రియన్ చే చిత్రీకరించబడ్డ కాంపోజిషన్ విత్ రెడ్, యెల్లో, అండ్ బ్లూ
11 John Singer Sargent's The Daughters of Edward Darley Boit (1882) 1882 లో జాన్ సింగర్ సార్జెంట్ చే చిత్రీకరించబడ్డ ద డాటర్స్ ఆఫ్ ఎడ్వార్డ్ డార్లీ బోయిట్
12 Jackson Pollock's Number 10 (1949) 1949 లో జాక్సన్ పోలోక్ చే చిత్రీకరించబడ్డ నెంబరు 10
13 Edward Hopper's Room in Brooklyn (1932) 1932 లో ఎడ్వార్డ్ హాపర్ చే చిత్రీకరించబడ్డ రూం ఇన్ బ్రూక్లిన్
14 Paul Gauguin's Where Do We Come From? What Are We? Where Are We Going? (1897-98) 1897-98 లో పాల్ గ్వాగ్విన్ చే చిత్రీకరించబడ్డ వేర్ డూ వీ కం ఫ్ర్ం? వాట్ ఆర్ వీ? వేర్ ఆర్ వీ గోయింగ్?
15 El Anatsui's Black River (2009) 2009 లో ఎల్ అనాట్సూయ్ చే చిత్రీకరించబడ్డ బ్లాక్ రివర్
16 Vincent van Gogh's Postman Joseph Roulin (1888) 1888 లో విన్సెంట్ వాన్ గాఘ్ చే చిత్రీకరించబడ్డ పోస్ట్ మ్యాన్ జోసెఫ్ రౌలిన్
17 Marcel Duchamp's Fountain (1917) 1917 లో మార్సెల్ డుచాంప్ చే చేయబడిన ఫౌంటెయిన్ మార్సెల్ డూచాంప్ అనే కళాకారుడు మూత్రవిసర్జన చేయబడే ఒక మరుగుదొడ్డిని కళాఖండం వలె ప్రతిష్ఠించటంతో అది సంచలనాత్మకం అయ్యింది
18 JMW Turner's The Slave Ship (1840) 1840 లో జే ఎం డబ్ల్యు టర్నర్ చే చిత్రీకరించబడ్డ ద స్లేవ్ షిప్
19 Guanyin, Bodhisattva of Compassion (Song Dynasty, 12th c. CE) 12వ శతాబ్దంలో సాంగ్ రాజవంశం చే చెక్కబడిన గువాన్యిన్, కరుణ రసాన్ని ఒలికిస్తున్న బోధిసత్వ అనే శిల్పం
20 Henryk Ross's Photographs of the Lodz Ghetto హెన్రిక్ రోస్ చే తీయబడ్డ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద లోడ్జ్ ఘెట్టో
21 Mary Cassatt's In the Loge (1878) 1878 లో మేరీ కస్సాట్ చే చిత్రీకరించబడ్డ ఇన్ ద లోజే
22 Jasper Johns' Target (1961) 1961 లో జాస్పర్ జాన్ చే చిత్రీకరించబడ్డ టార్గెట్
23 Umberto Boccioni's Forms of Continuity in Space (1913) 1913 లో ఉంబర్టో బోస్సియోనీ చే చిత్రీకరించబడ్డ ఫార్మ్స్ ఆఫ్ కంటిన్యుయిటీ ఇన్ స్పేస్
24 Meditations on Mark Rothko మార్క్ రోథ్కో పై ధ్యానం
25 Mission: Mona Lisa మిషన్: మోనా లీసా
26 C.M. Coolidge's Dogs Playing Poker (1903) 1903 లో సి.ఎం.కూలిడ్జ్ చే చిత్రీకరించబడ్డ డాగ్స్ ప్లేయింగ్ పోకర్
27 Roy Lichtenstein's Ohhh...Alright... (1964) 1964 లో రాయ్ లిచ్టెన్స్టైన్ చే చిత్రీకరించబడ్డా ఓహ్హ్హ్...ఆల్రైట్
28 Yoko Ono's Cut Piece (1964) 1964 లో యోకో ఓనో చిత్రీకరించిన కట్ పీస్
29 Egon Schiele's Nude Self-Portrait (1910) 1910 లో ఎగాన్ షీలే చిత్రీకరిచిన తన స్వంత వివస్త్ర అయిన చిత్రపటం
30 Donatello's Madonna of the Clouds (c.1425-1435) 1425-1435 వరకు డోనటెల్లో చే చిత్రీకరించబడ్డ మడోన్నా ఆఫ్ ద క్లౌడ్స్
31 Hiroshi Sugimoto's Byrd Theater, Richmond, 1993 (1993) 1993 లో హిరోషీ సుగిమోటో చే చిత్రీకరించబడ్డ బిర్డ్ థియేటర్, రిచ్ మండ్
32 René Magritte' The Son of Man (1964) 1964 లో రెనె మ్యాగ్రిట్టె చే చిత్రీకరించబడ్డ ద సన్ ఆఫ్ మ్యాన్
33 Jean-Honoré Fragonard's The Desired Moment (c. 1770) 1770 లో జీన్-హానరే ఫ్రాగొనార్డ్ చే చిత్రీకరించబడ్డ ద డిజైర్డ్ మొమెంట్
34 Dance Dance Revolution డాన్స్ డాన్స్ రివొల్యూషన్
35 Cecilia Vicuña's Disappeared Quipu (2018) 2018 లో సిసిలియ వికునా చే చిత్రీకరించబడ్డ డిజపియర్డ్ క్విపు
36 Behold the Monkey బిహోల్డ్ ద మంకీ
37 Ansel Adams' The Tetons and Snake River, Grand Teton National Park, Wyoming (1942) 1942 లో ఆన్సెల్ ఆడమ్స్ చే చిత్రీకరించబడ్డ ద టెటన్స్ అండ్ స్నేక్ రివర్, గ్రాండ్ టెటన్ నేషనల్ పార్క్, వ్యోమింగ్
38 Wassily Kandinsky's Untitled (1922) 1922 లో వాసిలీ కండిన్స్కీ చే చిత్రీకరించబడ్డ ఒక అనామక చిత్రం
39 2019 జూన్ 07 Rembrandt van Rijn's Portrait of Aeltje Uylenburgh (1632) రెంబ్రాండ్ట్ వాన్ రిజ్న్ చే చిత్రీకరించబడ్డ ఆల్ట్జె ఉయ్లెంబర్ఘ్ యొక్క చిత్రం
40 2019 జూలై 19 Frida Kahlo's Dos Mujeres (Salvadora y Herminia) (1928) 1928 లో ఫ్రీడా కాహ్లో చే చిత్రీకరించబడ్డ డాస్ ముజెరాస్ (సాల్వడోరా ఇ హెర్మినియా)
41 2019 నవంబరు 29 Jan van Eyck's Arnolfini Portrait (1434) 1434 లో జాన్ వాన్ ఐక్ చిత్రీకరించిన అర్నోల్ఫిని యొక్క చిత్రం
42 2020 ఫిబ్రవరి 24 Katsushika Hokusai's The Great Wave off Kanagawa (C.1829-1831) 1829-1831 వరకు కాత్షుషిక హొకుసాయ్ చే చిత్రీకరించబడ్డ ద గ్రేట్ వేవ్ ఆఫ్ కనగావా వాట్సాప్ లో ఈ చిత్రలేఖనం పై ఒక ఎమోట్ ఐకాన్ కలదు!
43 2020 మార్చి 01 Carmen Herrera's Blanco y Verde (no. 1) (1962) 1962 లో కార్మెన్ హెరెరా చే చిత్రీకరించబడ్డా బ్లాంకో ఎ వర్దే (నెం. 1)
44 2020 మార్చి 08 Louise Bourgeois' Pillar (1949-50) 1949-50 లో లూయీస్ బోర్గోయిస్ చే చిత్రీకరించబడ్డ పిల్లర్
45 2020 మార్చి 15 Georgia O'Keeffe's Deer's Skull With Pedernal (1936) 1936 లో జార్జియా ఓ కీఫె చే చిత్రీకరించబడ్డ డీర్స్ స్కల్ విత్ పెడెర్నల్ (1936)
46 2020 మార్చి 22 Patty Chang's Melons (At A Loss) (1998) 1998 లో పాటీ చాంగ్ చే చిత్రీకరించబడ్డ మెలన్స్ (ఎట్ ఎ లాస్)
47 2020 మే 04 Georges Seurat's A Sunday Afternoon on La Grande Jatte (1884) 1884 లో జార్జెస్ స్యూరట్ చే చిత్రీకరించబడ్డ ఎ సండే ఆఫ్టర్ నూన్ ఆన్ లా గ్రాండే జాట్టే
48 2020 ఆగస్టు 03 Anselm Kiefer's Margarete and Sulamith (1981) 1981 లో ఆన్స్లెం కీఫర్ చే చిత్రీకరించబడ్డ మార్గరెట్ అండ్ సులామిత్ (1981)
49 2020 సెప్టెంబరు 10 Claes Oldenburg's Giant Toothpaste Tube (1964) 1964 లో క్లాయెస్ ఓల్డెన్ బర్గ్ చే చిత్రీకరించబడ్డ జయంట్ టూత్ పేస్ట్ ట్యూబ్ (1964)
50 2020 డిసెంబరు 04 Carrie Mae Weems's Not Manet's Type (1997) 1997 లో క్యారీ మాయ్ వీం చే చిత్రీకరించబడ్డా నాట్ మానెట్'స్ టైప్

గుర్తింపు

[మార్చు]
  • న్యూ యార్క్ టైమ్స్ లో 10 Binge-Worthy Art Podcasts in the Age of Corona Virus (కరోనా వైరస్ సమయంలో విని తీరవలసిన 10 కళా సంబంధిత పాడ్ కాస్ట్ లు) లో స్థానం దక్కింది
  • రాయల్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ చేసిన కథనంలో 9 Art Podcasts to Keep You Inspired During Lockdown (లాక్ డౌన్ లో ప్రేరణను అందించే 9 కళా సంబంధిత పాడ్ కాస్ట్ లు) లో స్థానం దక్కింది [1]

సాంఘిక మాధ్యమాలలో

[మార్చు]

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టంబ్లర్ ల పై తమర్ లోన్లీ ప్యాలెట్ ఖాతాలు చైతన్యంగా ఉన్నాయి.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Pfitzinger, Julie. "LISTEN: 'The Lonely Palette' Podcast Makes Art Accessible". nextavenue.org. Retrieved 2 November 2021. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)
  2. Finkel, Jori (20 March 2020). "10 Binge-Worthy Art Podcasts in the Age of Coronavirus". The New York Times. Retrieved 27 December 2020.
  3. Mathiowetz, Adrianne (20 July 2017). "Meet Tamar Avishai, Podcast Producer Behind "The Lonely Palette"". Scout Somerville. Archived from the original on 27 ఫిబ్రవరి 2021. Retrieved 27 December 2020. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. Griffin, Grace (March 3, 2020). "At the MFA, a new podcaster-in-residence spotlights women artists". The Boston Globe. Retrieved 27 December 2020.
  5. 5.0 5.1 "The Lonely Palette website". thelonelypalette.com. Retrieved 9 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)