ధడక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధడక్
దర్శకత్వంశశాంక్‌ ఖైతాన్‌
రచనశశాంక్‌ ఖైతాన్‌
దీనిపై ఆధారితంసైరాత్ (మరాఠి సినిమా) [1][2]
నిర్మాత
 • కరణ్‌ జోహార్‌
 • అపూర్వ మెహతా
తారాగణం
ఛాయాగ్రహణంవిష్ణు రావు
కూర్పుమోనిష ఆర్. బల్దావా
సంగీతంబ్యాక్ గ్రౌండ్ సంగీతం:
జాన్ స్టీవర్ట్ ఎదురి
పాటలు:
అజయ్‌-అతుల్‌
నిర్మాణ
సంస్థలు
 • జీ స్టూడియోస్
 • ధర్మ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
20 జులై 2018
సినిమా నిడివి
138 నిమిషాలు[3]
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్41 కోట్లు[4]
బాక్సాఫీసుest. 110.11 కోట్లు[5]

ధడక్ 2018లో విడుదలైన హిందీ సినిమా. జీ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ పై కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించాడు. జాహ్నవీ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌‌, అశుతోష్‌ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 20 జులై 2018న విడుదలైంది.

కథ[మార్చు]

జైపూర్లోనే హోటల్ నడుపుకునే వాడి కొడుకు మధుకర్ (ఇషాన్‌ ఖట్టర్‌‌) ఉదయ్ పూర్ లోని అగ్రవర్ణానికి చెందిన రతన్ సింగ్ (అశుతోష్ రాణా) కుమార్తె పార్ధవి (జాహ్నవి కపూర్) ను ప్రేమిస్తాడు. ఇది పార్థవి తండ్రికి తెలిసిపోయి ఇద్దర్నీ విడదీసి, మధుకర్ ని పోలీసుల చేత కొట్టిస్తాడు. పోలీసుల నుండి తప్పించుకుని ఇద్దరు ముంబై కు పారిపోతారు. ముంబై నుంచి నాగ్ పూర్ వెళ్ళిన మధుకర్, పార్హవి అక్కడ ఉండడం సురక్షితం కాదని భావించి కలకత్తా వెళ్లిపోతారు. అక్కడ ఇద్దరు చిన్న ఉద్యోగాలు చేస్తూ వుంటారు. చీటికీ మాటికీ ఇద్దరు గొడవలు పడుతూ, పార్థవి ఇంటికి వెళ్లి పోడానికి కూడా సిద్ధపడుతుంది. ఆ తర్వాత మనసు మార్చుకొని, ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్లకు బాబు పుడతాడు. కొన్నాళ్లకు పార్ధవి కుటుంబ సభ్యులు మళ్ళీ వారి జీవితాల్లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత వారి జీవితం ఎటువంటి మలుపు తిరిగింది? అనేది మిగతా సినిమా కథ. [6]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్స్ : జీ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌
 • నిర్మాతలు: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా
 • సంగీతం: అజయ్‌-అతుల్‌
 • సినిమాటోగ్రాఫర్: విష్ణూ రావ్‌
 • ఎడిటర్: మోనిష ఆర్. బల్దావా

మూలాలు[మార్చు]

 1. "SEE: Karan Johar unveils poster of Janhvi Kapoor's debut film Dhadak opposite Ishaan Khatter". India Today. Retrieved 15 November 2017.
 2. "Dhadak first look: Janhvi Kapoor has Sridevi's charm and Ishaan Khatter is Bollywood's next chocolate boy". The Indian Express. Retrieved 15 November 2017.
 3. "DHADAK - British Board of Film Classification". www.bbfc.co.uk.
 4. "Dhadak". Box Office India. Retrieved 1 August 2018.
 5. "Box Office: Worldwide Collections and Day wise breakup of Dhadak". Bollywood Hungama. Retrieved 4 June 2019.
 6. Telugu Rajyam (2018). "'కథ' ని మింగేసిన విజువల్ హంగామా : 'ధడక్' (రివ్యూ) | Telugu Rajyam". telugurajyam.com. Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ధడక్&oldid=3601315" నుండి వెలికితీశారు