ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధరణి సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్ . ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం, భూమి, ఆస్తి సంబంధిత సమాచారాన్ని అంతర్జాలం (ఆన్‌లైన్) లో ‌ నిల్వ చేయడం, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వం విభజనను సరళీకృతం చేయడానికి, మొత్తం రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యేలా చూడటానికి , ప్రజలకు ఇ-పట్టదార్ పాస్‌బుక్‌ను భూ యజమానులకు వెంటనే అందించడం దీని ప్రత్యేకత, ఈ అధికారిక పత్రములు కొద్ది నిముషములలోనే ప్రజలు పొందవచ్చును. కొత్త వ్యవస్థ విధాన ప్రకారం, వ్యవసాయ ఆస్తుల( భూములు) నమోదు కోసం తహసీల్దార్ ఉమ్మడి సబ్ రిజిస్ట్రార్లుగా,సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తుల ( ఇళ్ళు , స్థలములు ) వంటివి రిజిస్ట్రేషన్లను చేస్తారు [1] [2]

ధరణి పోర్టల్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయములో 29-10-2020 నాడు ప్రారంభించారు. ధరణి పోర్టల్ లో ప్రజలకు సంభందించిన వ్యవసాయ ఆస్తులు దాదాపుగా 1,45,58,000 ఎకరాల భూముల వివరములు ఇందులో ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రత్యేకత కొనుగోలు దారుడు తన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను 20 నిముషములలో పూర్తి చేసుకొని , ఇ-పాసుబుక్కు ( యజమాని హక్కుకు సంభందించిన ధ్రువపత్రము ) పొందవచ్చును.సింగల్ విండో ( ఏక గవాక్ష ) విధానములో తనకు కావలిసిన సేవలను భూ యజమాని ధరణి పోర్టల్ ద్వారా పొంద వచ్చును. అవినీతి నిర్ములనలో, పారదర్శకతను , జవాబు దారి విధానం గా భూపరిపాలన వ్యవస్థ( రెవెన్యూ పరిపాలనా వ్యవస్థ ) లో ధరణి పోర్టల్ ఒక విప్లవాత్మిక ఘట్టం[3] [4] [5]

న్యాయస్థానం లో ధరణి పోర్టల్ :

ధరణి పోర్టల్ లో ఉన్న లో ప్రజల సమాచారం ( ఆధార కార్డు , కుటుంబ సభ్యల వివరములకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కలిపిస్తున్నదని గౌరవనీయ తెలంగాణ హైకోర్టు ప్రజాప్రయోజన పిటీషన్ ను స్వీకరించింది . ధరణి పోర్టల్ చట్టబద్దత పై హైకోర్టు , పిటిషినర్లు తెలిపిన పలు సందేహాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివరణను 20 నవంబర్ 2020 లోపు హైకోర్టు కు సమ్పర్పించ వలెనని ఆదేశించింది [6]

మూలాలు

మూలాలు[మార్చు]

  1. TelanganaToday. "Dharani portal to go live in TS from Thursday". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-29.
  2. "DHARANI". dharani.telangana.gov.in. Retrieved 2020-10-29.
  3. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2020-11-03.
  4. Ishaqui, S. A. (2020-10-29). "KCR launches one-of-its-kind Dharani portal". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-11-03.
  5. "Know your application status, Dharani, Integrated Land Records Management System, Telangana | National Government Services Portal". services.india.gov.in. Retrieved 2020-11-03.
  6. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2020-11-04.