ధర్మవరం గోపాలాచార్యులు

వికీపీడియా నుండి
(ధర్మవరము గోపాలాచార్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ధర్మవరం గోపాలాచార్యులు
ప్రఖ్యాత నాటకకర్త ధర్మవరం గోపాలాచార్యులు
జననంధర్మవరం గోపాలాచార్యులు
అనంతపురం జిల్లా ధర్మవరం
మరణంకర్నూలు జిల్లా ఆలూరు
వృత్తివకీలు
ప్రసిద్ధిసుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు
తండ్రికొమాండూరు కృష్ణమాచార్యులు
తల్లిలక్ష్మీదేవమ్మ
Notes
ఆంధ్రనాటక పితామహ’ బిరుదాంకితుడు

ధర్మవరం గోపాలాచార్యులు నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ్మడు. వీళ్ళిద్దరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

కన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు ఒక తెలుగు నాటకం రాసి మొదట ప్రదర్శించాడు. కానీ అది సరిగా ప్రదర్శన కాలేదు. దాంతో తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న భావనకు దారితీసింది. అప్పుడు రామకృష్ణమాచార్యులు స్వయంగా నాటక రచన, ప్రదర్శనలను ప్రారంభించి ప్రప్రథమంగా చిత్రనళీయము నాటకం రాసి 1887 జనవరి 29 తేదీన విజయవంతంగా ప్రదర్శించాడు. తర్వాత చాలా నాటకాలను రచించి, స్వయంగా ప్రదర్శించాడు. గోపాలాచార్యులు తన అన్నతో కలిసి నాటకాలలో భరతుడు మొదలైన పాత్రలను పోషించాడు.

తర్వాత హైద్రాబాదులో వకీలు వృత్తిని నిర్వర్తించాడు. హైదరాబాదులో "కృష్ణ విలాసినీ సభ" అనే నాటక సంస్థను స్థాపించి, హరిశ్చంద్ర నాటకంను స్వయముగా రచించి ప్రదర్శింపజేశాడు. అక్కడినుండి 1910లో బళ్ళారికి తిరిగి వచ్చి 1912లో అన్న ధర్మవరం రామకృష్ణమాచార్యులతో కలిసి, ‘అభినవ సరస వినోదిని’ స్థాపించాడు. 1912, నవంబరు 30న రామకృష్ణమాచార్యులు మరణంతో అది ఆగిపోయిన తర్వాత ‘కృష్ణమాచార్య సభ’ అనే పేరుతో ఒక సమాజంను నడిపి, దేశమంతా తిరిగి ప్రదర్శనలు చేశాడు. ఈ సమాజానికి గోపాలాచార్యులు ఉపాధ్యక్షులుగా ఉన్నాడు. బళ్ళారి తిరిగివచ్చిన తరువాత ఇతను మరికొన్ని నాటకాలను రచించాడు.

రచనలు[మార్చు]

ఈయన మొత్తము 12 నాటకములును రచించాడు.

  1. రామదాసు
  2. సుభద్రార్జునీయము
  3. రామకబీరు
  4. ప్రేమచంద్రయోగి లేదా అస్పృశ్య విజయము (1933)
  5. చంద్రమతీపరిణయము
  6. రుక్మిణీకృష్ణీయము లేదా మాయాశక్తి
  7. శ్రీరామ లీలలు
  8. గిరిజా శంకరీయము
  9. పాండవాజ్ఞాతవాసం
  10. ఉత్తర రామచరిత (కన్నడ) (1889)
  11. కంసధ్వంసము
  12. కెయిసర్

ఇతర వివరాలు[మార్చు]

మేనల్లుడు బళ్ళారి రాఘవాచార్యులు ప్రతి నాటకపు ప్రతిని పరిశీలించి మార్పులు, చేర్పులు సూచించేవాడు. దాని ప్రకారమే వీళ్ళిద్దరు సరిదిద్దుకునేవారు. అలా ‘రామదాసు’, ‘సుభద్రార్జునియము’ ‘రాం కబీర్’ వంటి నాటకాలు రూపొందించారు. వీరు మొత్తం 13 నాటకాలు రాశారు. అందులో ప్రకటిత మైనవి –పై ముడున్నూ, ప్రేమచంద్రవిజయం’ లేదా ‘అస్ప్రస్యవిజయము’ ‘రుక్మిణీకృష్నియము’ లేదా ‘మాయాశక్తి’. ఇంకను అముద్రిత నాటకాలు; ‘ శ్రీరామ లిలలు’ గిరిజా శంకరియము, పాండజ్ఞాత్వాసం, ఉత్తర రామచరితము, హరిశ్చంద్ర, కేయిసర్ లేదా కలియుగ దుర్యోధన, ఉషాపరినయము, కంసద్వంసము’ వీరు పాత్రోచిత భాషను ఆధరించి , పౌరులు మొదలగు వారి భాషకు ‘మిస్రభాష’ అని పేరుపెట్టారు . వీరి నాటకాలు అన్నింటిలోకి ముఖ్యమైనది ‘రామదాసు’ నాటకం. బళ్ళారి రాఘవాచార్యులకు కీర్తి తెచ్చిన లేదా అతని వల్లన ప్రఖ్యాతి చెందినరెండు నాటకాలలో అది రెండవది. (మొదటిది కోలాచలం శ్రీనివసురావు ‘రామరాజు ) ‘భక్తి’ ప్రదనరసంగా ఉత్తమ నాటక రచన చేసినవారిలో వీరు రెండవ వారు. మొదటివాడు రాధాకృష్ణ ’ నాటక రచయిత అయిన పానుగంటి లక్ష్మి నరసింహారావు ).

మూలాలు[మార్చు]