ధాన్యము
ధాన్యాలు అనునవి గట్టిగా, పొడిగా గల విత్తనాలు (పైకప్పు కల లేదా పైకప్పు లేనివి). యివి మానవుని లేదా జంతువుల ఆహారంగా ఉపయోగపడతాయి[1] . వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాలను యిచ్చే మొక్కలను "ధాన్య పంటలు"గా పిలుస్తారు.
కోతలు కోసిన తర్వాత పొడిగా ఉన్న ధాన్యాలు యితర ఆహార పదార్థాలు అనగా పిండిపదార్థాలు కలవి ఉదా:అరటి పండ్లు, రొట్టెపండు) మరియు వేర్లు (ఉదా:బంగాళా దుంపలు), దుంపలు, పెండలం దుంప, వంటి వాటికంటే నిల్వ ఉండటానికి, ఉపయోగించటానికి, మరియు ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేకముగా ఈ లక్షణాలు యంత్రాలతో కోయుటకు, రైలు, ఓడలలో రవాణాకు, అనేక రోజులు నిల్వ ఉంచుటకు, అధిక పరిమాణంలో నూర్చుటకు మరియు పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగపడతాయి. సాధారణంగా మొక్కజొన్న, వరి, సోయాబీన్స్, గోధుమ మరియు యితర ధాన్యాలు వంటివి అధిక సంఖలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. కానీ కాయగూరలు, దుంపలు మరియు యితర పంటలు ఎగుమతులు తక్కువగా జరుగుతాయి.[2]
విషయ సూచిక
ధాన్యాలు మరియు పప్పులు[మార్చు]
వృక్ష శాస్త్రంలో ధాన్యాలు మరియు పప్పులు కెరీయోప్‌సెస్ గా పిలువబడుతాయి. గడ్డిజాతి కుటుంబ ఫలాలుగా వ్యవసాయ శాస్త్రంలో మరియు కామెర్స్ లోనూ, యితర కుటుంబాలలో గల విత్తనాలు మరియు ఫలాలు గానూ పిలుస్తారు. ఉదాహరణకు అమరనాథ్ అమ్మిన వాటిని "గ్రైన్ అమరనాథ్" అనీ, మరియు అమరనాథ్ ఉత్పత్తులను "హోల్ గ్రైన్స్" అనీ పిలుస్తారు[3].
వర్గీకరణ[మార్చు]
పప్పుధాన్యాలు[మార్చు]
పప్పు ధాన్యాల పంటలు అన్నీ గడ్డి జాతి కుటుంబానికి చెందుతాయి.[4] పప్పు ధాన్యాలలో అధిక పిండి పదార్థం, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
కొన్ని ధాన్యములు[మార్చు]
నవధాన్యాలు[మార్చు]
తిండిగింజలు వృథా[మార్చు]
ఆకలితో అలమటించే జనం ఉన్న ఈ దేశంలో ఒక్క తిండిగింజను వృథాచేసినా అది నేరమేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ ధాన్యాన్ని కొల్లగొట్టేవారిని ప్రాసిక్యూట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృథా అయ్యే ధాన్యం విలువ రూ.17వేల కోట్లు
- దేశవ్యాప్తంగా 1.78 కోట్ల టన్నుల గోధుమలు/బియ్యాన్ని టార్పాలిన్ల కింద నిల్వ ఉంచారు. ఇందులో కోటి టన్నులు కుళ్లి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
- వీటి విలువ దాదాపు రూ.17వేల కోట్లు. ఈ ధాన్యంతో 1.4కోట్ల మంది ఆకలి తీర్చవచ్చని అంచనా.
- మూడేళ్లనుంచి మురగపెట్టడంతో ఒక్క పంజాబ్‌లోనే 49వేల టన్నులను వృథాగా పారబోసే పరిస్థితి దాపురించింది.
చిత్రమాలిక[మార్చు]
సంతలో అమ్మకానికి ఉంచిన ఆహార ధాన్యాలు
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Babcock, P.G., ed. 1976. Webster's Third New International Dictionary. Springfield, Massachusetts: G. & C. Merriam Co. .
- ↑ "Agricultural Commodities Products". Cmegroup.com. 2012-07-13. Retrieved 2012-07-19.
- ↑ "Now Vitamins - Now - Organic Amaranth Grain 1 Lb". Totaldiscountvitamins.com. 2011-12-13. Retrieved 2012-07-19.
- ↑ Vaughan, J.G., C. Geissler, B. Nicholson, E. Dowle, and E. Rice. 1997. The New Oxford Book of Food Plants. Oxford University Press.
![]() |
Wikimedia Commons has media related to ధాన్యము. |