ధీరజ్ ప్రసాద్ సాహు
ధీరజ్ ప్రసాద్ సాహు | |
---|---|
జార్ఖండ్ రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు | |
Assumed office 2018 మే 4 | |
అంతకు ముందు వారు | ప్రదీప్ కుమార్ బల్ముచు, కాంగ్రెస్ |
In office 2010 జులై 8 – 2016 జులై 7 | |
తరువాత వారు | మహేష్ పొద్దార్, భాజాపా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1959 నవంబరు 23 లోహార్‌దాగా |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లి | శుశీలా దేవి |
తండ్రి | బల్దేయో సాహు |
బంధువులు | శివ ప్రసాద్ సాహు (సోదరుడు) |
కళాశాల | మార్వాడీ కళాశాల, రాంచీ |
ధీరజ్ ప్రసాద్ సాహు (జననం 1959 నవంబరు 23) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2010 జూలైలో కాంగ్రెస్ టిక్కెట్‌పై జార్ఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో సామాజిక కార్యకర్త బల్దియో సాహు, శుశీలా దేవి దంపతులకు ఆయన 1959 నవంబరు 23న జన్మించాడు. ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సాహు సోదరుడు.[2] ధీరజ్ ప్రసాద్ సాహు బిఏ డిగ్రీ పుచ్చుకున్నాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]1977లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1978లో జైల్ భరో ఆందోళనలో జైలు పాలయ్యాడు. 2009 జూన్లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యాడు. జూలై 2010లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
2023 ఐటీ దాడులు
[మార్చు]ఆయనకు చెందిన ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు 2023 డిసెంబరులో చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది.[4] ఇప్పటివరకు ఒడిశా, జార్ఖండ్‌లలోని ఆయన నివాసాలు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అనేక దాడులు నిర్వహించి, ₹351 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఇంకా మూసి ఉన్న లాకర్లను తెరవాల్సి ఉండగా దాడి కొనసాగుతోంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Detailed Profile: Shri Sahu". Retrieved 14 October 2015.
- ↑ "राहुल गांधी से मिले सांसद धीरज प्रसाद साहू". livehindustan. 10 April 2018. Retrieved 23 September 2019.
- ↑ "Dhiraj Prasad Sahu". myNeta.info. Retrieved 14 October 2015.
- ↑ "దాడుల్లో దొరికింది 290 కోట్లు | Income Tax department raid on Odisha distillery has turned up Rs 290 Cr - Sakshi". web.archive.org. 2023-12-11. Archived from the original on 2023-12-11. Retrieved 2023-12-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Congress distances itself from MP amid Rs 300 crore cash haul in tax raid". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-10.