ధూళిపాళ శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ధూళిపాళ శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలంలోని ఏదులమద్దాలి (ఈదులమద్దాలి) గ్రామంలో 1918లో జన్మించాడు[1]. తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ. చదివాడు. ద్రావిడభాషాశాస్త్రము, అలంకార శాస్త్రాలలో పి.ఓ.యల్. పట్టాలను పొందాడు. విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. కరీంనగర్ ప్రభుత్వకళాశాలలో ప్రధాన సంస్కృతాంధ్ర అధ్యాపకునిగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

  1. భువన విజయము - ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల
  2. గృహరాజు మేడ[2] - ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల
  3. శివానందలహరి (వ్యాఖ్యానములతో)
  4. శ్రీ శివత్రిశతి
  5. శ్రీమదాంధ్ర మహాభాగవతానుశీలనం
  6. విశ్వనాథ సాహితీ సూత్రం జీవుని వేదన
  7. మల్లికార్జున శతకము
  8. రాజరాజేశ్వర శతకము

మూలాలు[మార్చు]