నండూరు ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నండూరి ప్రసాదరావు

పదవీ కాలం
30-11-1953 to 2-4-1956

వ్యక్తిగత వివరాలు

జననం 24 సెప్టెంబరు 1912
అరుగోలను, గన్నవరం తాలూకా, కృష్ణా జిల్లా
మరణం 29 నవంబరు 2001
హైదరాబాదు, భారతదేశం
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)


నండూరి ప్రసాదరావు (ఎన్.పి.ఆర్ గా సుపరిచితులు) కమ్యూనిస్టు నాయకుడు.అతను భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నడిపించాడు.అతను భారతదేశ పార్లమెంటులోని రాజ్యసభలో సభ్యునిగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కూడా తన సేవలనందించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ప్రసాదరావు జానకీరామయ్య, సుమిత్ర దంపతులకు 1012 సెప్టెంబరు 24 న జన్మించాడు.[1] అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) లో వ్యవస్థాపక సభ్యులు, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ కు కూడా వ్యవస్థాపక సభ్యుడు. ఆయన మరణించే వరకు కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా యున్నారు. అతను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు.ప్రసాదరావు పుచ్చలపల్లి సుందరయ్య ప్రేరణతో 1934 లో కమ్యూనిస్టు పార్టీలోనికి చేరాడు.కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకులలో ప్రసాదరావు ఒకడు.పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, హరికిషన్‌సింగ్ సూర్జిత్, మాకినేని బసవపున్నయ్య, ఇతరులతో కలసి ఉద్యమంలో పాల్గొన్నాడు. మునగాలలో రైతు ఉద్యమాన్ని నడిపాడు.[2] తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. తెలుగు భాషలో అనేక పుస్తకాలను రాసాడు.1953 నవంబరు 30 నుండి,1956 ఏప్రియల్ 2 వరకు వరకు రాజ్యసభ సభ్యునిగా తన సేవలనందించాడు.[3] అతను సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ తన సుఖాలను వదలి సన్యాసి జీవితం గడిపాడు.2001 నవంబరు 29 న జబ్బుతో హైదరాబాదులో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "కార్మికులూ కర్షకులూ ప్రసాదరావూ - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-04-26.[permanent dead link]
  2. "The Role of Political Parties In Munagala Paragana Kisan Struggle" (PDF).
  3. "Rajya Sabha Members Biographical Sketches, 1952 - 2003" (PDF).