Jump to content

నందనా సేన్

వికీపీడియా నుండి
నందనా సేన్
ఢాకా లిట్ ఫెస్ట్ 2017లో నందనా సేన్
జననం
నందనా దేవ్ సేన్

(1967-08-19) 1967 ఆగస్టు 19 (వయసు 57)
జాతీయతఅమెరికన్
విద్యాసంస్థహార్వర్డ్ విశ్వవిద్యాలయం
వృత్తినటి • కార్యకర్త • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1997–2014
RAHI, అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్, ఆపరేషన్ స్మైల్, సేవ్ ది చిల్డ్రన్ ఇండియా, UNICEF తదితర సంస్థలలో అంబాసిడర్‌షిప్‌లు
జీవిత భాగస్వామి
జాన్ మాకిన్సన్
(m. 2013)
భాగస్వామిమధు మంతెన (2002–2013)[1]
పిల్లలుమేఘలా దేవ్‌సేన్ మెకిన్సన్
తల్లిదండ్రులుఅమర్త్య సేన్
నబనీత దేవ్ సేన్

నందనా దేవ్ సేన్ (జననం 1967 ఆగస్టు 19) ఒక అమెరికన్ నటి,[2] స్క్రీన్ రైటర్. ఆమె పిల్లల రచయిత్రి, వారి హక్కుల కార్యకర్త కూడా.[3][4] బాలీవుడ్‌లో ఆమె మొదటి సినిమా సంజయ్ లీలా బన్సాలీ బ్లాక్ (2005). ఈ చిత్రంలో రాణి ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఆమె నటించింది. ఆమెది రాణికి 17 ఏళ్ల చెల్లెలి పాత్ర. రామ్ గోపాల్ వర్మ, కేతన్ మెహతాతో సహా భారతీయ దర్శకులతో వరుస ప్రాజెక్ట్‌లలో పని చేసింది. నందనా సేన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన తీవ్రవాద నేపథ్యం కలిగిన అమెరికన్ డ్రామా ది వార్ వితిన్ (2005)లో ప్రధాన పాత్రలో ఒకదానికి సంతకం చేసింది.[5][6][7]

జీవితం తొలి దశలో

[మార్చు]

నోబెల్ గ్రహీత, భారతరత్న ఆర్థికవేత్త అమర్త్యసేన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత నబనిత దేవ్ సేన్ ల కుమార్తె నందనా సేన్. నందనా సేన్ కలకత్తాలో జన్మించారు. ఆమె అక్క అంటారా దేవ్ సేన్ జర్నలిస్టు. నందనా సేన్ మొదటి రచన ఆమె చిన్నతనంలో సత్యజిత్ రే ఎంపిక చేసిన సందేశ్ పత్రికలో ప్రచురించబడింది.[8] ఆమె భారతదేశంలో పుట్టినా యూరప్, అమెరికాలోని వివిధ నగరాల్లో పెరిగింది.

కెరీర్

[మార్చు]

నందనా సేన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని అభ్యసించారు, అక్కడ ఆమె మొదటి సంవత్సరంలో తన తరగతిలో అగ్రస్థానంలో నిలిచినందుకు ఆమెకు డెటూర్ ప్రైజ్ లభించింది.[9] ఆ తర్వాత జాన్ హార్వర్డ్ స్కాలర్‌షిప్, ఎలిజబెత్ కారీ అగాసిజ్ అవార్డ్ రెండింటినీ అమె డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణురాలయి గెలుచుకుంది. ఆ తరువాత USC ఫిల్మ్ స్కూల్‌లోని పీటర్ స్టార్క్ ప్రొడ్యూసింగ్ ప్రోగ్రామ్‌లో నందనా సేన్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్‌ని అభ్యసించారు. ఆమె అనేక చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన తన థీసిస్ చిత్రం "అరేంజ్డ్ మ్యారేజ్"తో సహా పలు లఘు చిత్రాలను వ్రాసి దర్శకత్వం వహించింది. నటిగా, నందనా సేన్ న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో అలాగే లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్‌లో శిక్షణ పొందింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నందనా సేన్ 2013 జూన్ లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఛైర్మన్ జాన్ మాకిన్‌సన్‌ను వివాహం చేసుకుంది.[10] ఈ జంట 2018లో ఒక యువ బెంగాలీ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమె గతంలో భారతీయ చలనచిత్ర నిర్మాత మధు మంతెనాతో దశాబ్దానికి పైగా సహజీవనం కొనసాగించింది.[11]

మూలాలు

[మార్చు]
  1. "Nandana Sen: All my big decisions in life made sense to no one but me - Times of India". The Times of India.
  2. @nandanadevsen (21 June 2021). "Friends from #NewYork , a big day tomorrow at the #primaries ! Are you ready to #vote ? I voted early to avoid the lines, and it was super quick! #I♥️NY" (Tweet). Retrieved 26 February 2022 – via Twitter.
  3. "Nandana Dev Sen (2021)". JLF New York. 17 September 2013. Retrieved 2022-05-22.
  4. "Nandana Dev Sen". Brooklyn Book festival. Archived from the original on 2022-01-26. Retrieved 2022-05-22.
  5. Koehler, Robert (2005-10-04). "The War Within". Variety.
  6. "The War Within | Arts | The Harvard Crimson". www.thecrimson.com. Retrieved 2016-04-30.
  7. "Nandana the maneater". The Telegraph. Calcutta, India. 2012-05-10.
  8. Chopra, Anupama (2012-01-28). "Newswallah: Bollywood Edition". The New York Times.
  9. "Amartya Sen's daughter Nandana meticulously handles her passion from movies to non-profit work". The Times Of India. 2013-05-22. Archived from the original on 2013-11-10. Retrieved 2022-07-19.
  10. "Celebrities News - Latest Celebrity News & Gossip, Couples and celebrities birthdays". Archived from the original on 2014-07-25. Retrieved 2022-07-19.
  11. "Nandana Sen: All my big decisions in life made sense to no one but me – Times of India". The Times of India.