Jump to content

నందన్ నిలేకని

వికీపీడియా నుండి
నందన్ ఎమ్. నిలేకని

జననం: జూన్ 2, 1955
బెంగుళూరు, కర్ణాటక, భారత్
వృత్తి: ఛైర్మన్ en:Unique Identification Authority of India (UIDAI)
వేతనము:$203,545 USD (net compensation in 2007)[1]
Net worth:Increase USD $1.3 బిలియన్లు

నందన్ నిలేకని (ఆంగ్లం : Nandan Nilekani) (కొంకణి/కన్నడ : ನಂದನ ನಿಲೇಕಣಿ), భారతదేశంలో సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన ప్రముఖుల్లో ఒకడు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు.

బాల్యం

[మార్చు]

ఆయన పుట్టింది కర్ణాటక లోని బెంగుళూరులో జన్మించాడు. తండ్రి మోహన రావ్ ఒక ప్రైవేటు జౌళి పరిశ్రమలో మేనేజరు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం బెంగుళూరు, ధార్వాడలో సాగింది.

1973 లో ముంబై ఐఐటీలో చేరాడు. 1978 లో ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ లో చేరాడు. అక్కడ ఆయనకు ఎన్.ఆర్. నారాయణ మూర్తి సహోద్యోగి. మూడేళ్ళ తరువాత 1981 లో నారాయణమూర్తి నాయకత్వంలో ఆరుగురు కలిసి ఇన్ఫోసిస్ ను స్థాపించారు. దానిని భారతదేశంలో తలమానికమైన కంపెనీగా తీర్చిదిద్దడంలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. 2002 మార్చిలో ఇన్ఫోసిస్ కు సీఈఓ అయ్యాడు. 2007 వ సంవత్సరం వరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. 2006 వ సంవత్సరంలో ఆయనను పద్మభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరంలో ఆయన్ను టైమ్ మేగజీన్ ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాల్లో ఆయన్ను చేర్చింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ నాలెడ్జ్ సొసైటీలో కూడా ఆయన సభ్యుడిగా పనిచేశాడు.

పుస్తకం

[మార్చు]

భారతదేశం స్థితిగతుల మీద ఇమేజింగ్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రాశాడు.

మూలాలు

[మార్చు]
  1. [1], Forbes.com

బయటి లింకులు

[మార్చు]