నగుమోము గనలేని (కీర్తన)
Appearance
నగుమోము గనలేని అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.
ఈ కీర్తన ఖరహరప్రియ జన్యమైన ఆభేరి రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]
త్యాగరాజు ఈ అభేరి రాగంలో ఈ కీర్తన ఒక్కటి మాత్రమే వ్రాశాడు. ఆయనగారి శిష్యుడు తంజావూరు రామారావు. ఆయన నందరూ చిన్న త్యాగరాజు అంటూ ఉండేవారు. అతడు గురువుగారూ! ఈ రాగంలో మరొక కీర్తన వ్రాయండి అని అడిగితే త్యాగరాజు చిరు నవ్వు నవ్వి అభేరి సంపూర్ణ స్వరూప ప్రదర్శనకు ఈ ఒక్క కీర్తన చాలు నాయనా అన్నారు.
కీర్తన
[మార్చు]- పల్లవి
నగు మోము గన లేని నా జాలిఁ దెలిసి
నన్ను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ | | నగు మోము | |
- అనుపల్లవి
నగరాజధర ! నీదు పరివారు లెల్ల -
ఒగి బోధన జేసెడువారలు గారె ? యిటు లుండుదురే ? నీ
భారతీయ సంస్కృతి
[మార్చు]- మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ కీర్తనను రాగ తాళాల మేళవంగా "త్యాగరాజ కృతులు" ఆల్బబ్ కోసం సుదీర్ఘంగా గానం చేశాడు.[2]
- ఈ కీర్తనను చక్రపాణి (1954) సినిమా కోసం భానుమతి రామకృష్ణ గానం చేసి నటించింది.
- ఇదే పాటను అల్లుడుగారు (1990) సినిమాలో జేసుదాసు, పూర్ణచందర్ గానం చేశారు.[3]
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్ లో నగుమోము గనలేని పూర్తి కీర్తన.
మూలాలు
[మార్చు]- ↑ "కర్ణాటిక్ సైట్ లో నగుమోము కీర్తన పూర్తి సాహిత్యం". Archived from the original on 2011-11-19. Retrieved 2011-10-27.
- ↑ "మంగళంపల్లి పాడిన కీర్తన రాగా.కాం లో వినండి". Archived from the original on 2011-09-10. Retrieved 2011-10-27.
- ↑ "రాగా.కాం లో నగుమోము పోటీ పాట". Archived from the original on 2011-11-26. Retrieved 2011-10-27.