నగేశ్ భీమపాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నగేశ్ భీమపాక

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-

వ్యక్తిగత వివరాలు

జననం (1967-06-04) 1967 జూన్ 4 (వయసు 56)
భద్రాచలం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు భూపతిరావు, శాంతమ్మ
పూర్వ విద్యార్థి నిజాం కాలేజీ, హైదరాబాద్

నగేశ్‌ భీమపాక భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. అతనును తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జూలై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

నగేష్ భీమపాక 1969 మార్చి 8న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి జిల్లా, భద్రాచలంలో భూపతిరావు, శాంతమ్మ దంపతులకు జన్మించాడు. అతను తండ్రి భీమపాక భూపతిరావు స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే. నగేష్ భీమపాక భద్రాచలంలో ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తి చేసి ఏలూరు సీఆర్ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని హైదరాబాద్ నిజాం కాలేజీలో ఎల్‌ఎల్‌ఎంను పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం[మార్చు]

నగేశ్ భీమపాక ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి 1993లో బార్ కౌన్సిల్ లో పేరు ఎన్‌రోల్‌ చేసుకొని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, మున్సిపల్ చట్టాలతో పాటు ఆర్బిట్రేషన్ చట్టాలకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించాడు. అతను ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా, వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. అతనును తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జూలై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3]

2022 ఆగస్టు 16న హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ సమక్షంలో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (26 July 2022). "హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  2. Sakshi (26 July 2022). "హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు!". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  3. Andhra Jyothy (25 July 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  4. telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.