Jump to content

నన్ను ప్రేమించు

వికీపీడియా నుండి
నన్ను ప్రేమించు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం పుట్టణ్ణ కణగాల్
నిర్మాణం కె.ఎస్.రామారావు
తారాగణం జై జగదీష్,
శుభ,
ఆరతి,
పద్మ,
వైశాలి
సంగీతం విజయభాస్కర్
గీతరచన వీటూరి
సంభాషణలు పి.ఎస్.గోపాలకృష్ణ
ఛాయాగ్రహణం హరిదాసు
నిర్మాణ సంస్థ హరిచిత్ర
భాష తెలుగు

హరిచిత్ర పతాకంపై పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన రంగుల చిత్రం నన్ను ప్రేమించు 1977, నవంబరు 5వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమా ఫలితాంశ అనే కన్నడ సినిమాకి తెలుగు డబ్బింగ్.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పుట్టన్న కణగాల్
  • సంగీతం: విజయ భాస్కర్
  • గీత రచన: వీటూరి
  • మాటలు: పి.ఎస్.గోపాలకృష్ణ
  • ఛాయాగ్రహణం: హరిదాసు

తారాగణం

[మార్చు]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

లీలతో పెళ్ళి కాక పూర్వం ఇద్దరు ముగ్గుర్ని ప్రేమించి ఆ ప్రేమను ఎప్పటికప్పుడు చెయ్యి జారిపోయినా చివరకు లీలను పెళ్ళి చేసుకున్న కృష్ణమూర్తి కథ ఇది. గోల్‌గుంబాజ్ చారిత్రక కట్టడాన్ని తిలకించడానికి వెళ్ళిన కృష్ణమూర్తి - తన బేగమ్‌ ప్రేమను శంకించిన ఒక నవాబు ఆమెను పరీక్షించడానికి చాలా ఎత్తైన ఆ కట్టడం శిఖరభాగం నుండి దూకమని కోరగా ఆమె క్రిందికి దూకి మరణించిన ఉదంతాన్ని విని - తన ప్రేమను నిరూపించుకోవలసిందిగా తన భార్యను ఆ గోల్‌గుంబాజ్ వద్దకు తీసుకు వెళతాడు. ఆమె కూడా క్రిందకు దూకుతుంది[1].

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు:[2]

  1. ఈ అల్లరి ఆట ఈ కమ్మని పాట హృదయాలను - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. మాటకారి చిన్నవాడా జంట కోరే కొంటెవాడా - వాణీ జయరాం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. లవ్ అంటే ఎదో అనుకున్నాను నిజమే తెలిసి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. లవ్ అన్నది ఇలలో మాయని చిన్నది - వాణీ జయరాం కోరస్

మూలాలు

[మార్చు]
  1. తుర్లపాటి (12 November 1977). "చిత్ర సీమ - నన్ను ప్రేమించు - సమీక్ష". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 21 March 2020.[permanent dead link]
  2. కల్లూరి భాస్కరం. "నన్ను ప్రేమించు - 1977 ( డబ్బింగ్ )". ఘంటసాల గళామృతమ్. కల్లూరి భాస్కరం. Archived from the original on 21 మార్చి 2020. Retrieved 21 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)