నబిన్ చంద్ర బోర్డోలోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలోని 1975 స్టాంప్‌పై బార్డోలోయి

నబిన్ చంద్ర బార్డోలోయ్, (1875-1936) ఒక భారతీయ రచయిత, రాజకీయనాయకుడు, అస్సాం రాష్ట్రానికి చెందిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనాయకుడు. భారతస్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త, మహాత్మాగాంధీ నాయకత్వంలో సాగిన సహాయ నిరాకరణఉద్యమంలో (1920-1922) అస్సాం నుండి పాల్గొన్న ప్రముఖనాయకుడు.1975 లో అతని జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం అతని గౌరవార్థం స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.[1]అతన్ని కర్మబీర్ లేదా కర్మవీర్ నబిన్ చంద్ర బోర్డోలోయ్ అని పిలుస్తారు.[2]

జీవిత గమనం

[మార్చు]

నబిన్ చంద్ర బోర్డోలోయ్ అస్సాంలోని ఉత్తర గౌహతిలో 1875 అక్టోబరు 30న జన్మించాడు. అతని తండ్రి మధాబ్ చంద్ర బోర్డోలోయ్ అసోం ప్రభుత్వంలో అదనపు అసిస్టెంట్ కమిషనర్.బార్డోలోయ్ తేజ్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్లి 1896 లో ప్రెసిడెన్సీ కాలేజీ నుండి బిఎ పట్టా పొందాడు.

నబిన్ చంద్ర 1899 లో లా గ్రాడ్యుయేట్ అయ్యాడు.స్వరాష్ట్రం అస్సాం వచ్చి ప్రజా వ్యవహారాలలో చురుకైన ఆసక్తిని కనబరిచాడు. అతను 1913 లో గౌహతిలో ఎర్లే లా కళాశాల స్థాపనలో పాలుపంచుకున్నాడు. ఆ కళాశాలలో కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశాడు. 1919లో నబిన్ చంద్ర, ప్రసన్న కుమార్ బారువాతో పాటు ఇంగ్లాండ్ వెళ్లి, మాంటెగ్-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల్లో అస్సాం కేసును చేర్చడానికి ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ముందు ఉంచాడు. 1920 లో నబిన్ చంద్ర బర్డోలోయ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాగ్‌పూర్ సభలో పాల్గొన్నాడు. జలియన్ వాలాబాగ్ దురంతం తరువాత, బోర్డోలోయ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. అతను తన న్యాయ అభ్యాసాన్ని విడిచిపెట్టి, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1921లో, నబిన్ చంద్ర అరెస్టయ్యాడు. పద్దెనిమిది నెలల పాటు జైలులో గడిపాడు. 1929 లో అతను మళ్లీ అరెస్టయ్యాడు. రెండవ సారి జైలు పాలయ్యాడు. 1934లో నబిన్ చంద్ర బోర్డోలోయ్ అస్సాం శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను ప్రతిపక్ష ప్రతినిధి. అతని అలసిపోని కార్యకలాపాలు అతనికి కర్మబీర్ (అంటే హీరో ఆఫ్ యాక్షన్) అనే బిరుదును పొందటానికి దోహదం చేసాయి. నబిన్ చంద్ర బోర్డోలోయ్ 1936 లో కన్నుమూశారు.[2]

కుటుంబం

[మార్చు]

అతని కుమార్తె నళినీ బాలదేవి ప్రముఖ కవి, రచయిత, ఆమెజీవిత చరిత్ర స్మృతిర్ తీర్థ (1948) రాసాడు. అతను అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి ప్రధాన కార్యదర్శి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "1975 stamps: Nabin Chandra Bardoloi, 3 November 1975". Archived from the original on 12 అక్టోబరు 2016. Retrieved 22 సెప్టెంబరు 2021.
  2. 2.0 2.1 "Nabin Chandra Bordoloi - Assams.Info". www.assams.info. Retrieved 2021-09-22.

వెలుపలి లంకెలు

[మార్చు]