నమో భూతనాధ (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"నమో భూతనాధ"
సంగీతంపెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యంపింగళి నాగేంద్రరావు
ప్రచురణ1965
భాషతెలుగు
రూపంభక్తి గీతం
గాయకుడు/గాయనిఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి
చిత్రంలో ప్రదర్శించినవారుఎన్.టి.రామారావు,
ఎస్.వరలక్ష్మి

నమో భూతనాధ తెలుగు సినీచరిత్రలో అమరంగా నిలిపోయే భక్తిగీతాలలో ఒకటి. ఇది విజయా వారి సత్య హరిశ్చంద్ర (1965) సినిమా లోనిది. ఈ పాటను ప్రముఖ సినీ రచయిత పింగళి నాగేంద్రరావు రచించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించిన ఈ పాటను ఘంటసాల, ఎస్.వరలక్ష్మి ఎంతో భక్తితో పాడి అమరులయ్యారు.

పాట[మార్చు]

చిత్రంలో పాట వచ్చు సన్నివేశం

హరిశ్చంద్రుడు:

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే

స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో

హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే

భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప


హరిశ్చంద్రుడు:

నమో భూతనాథ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాథ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

నమో భూతనాథ


హరిశ్చంద్రుడు:

భవా వేదసారా సదా నిర్వికారా

భవా వేదసారా సదా నిర్వికారా

జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా

నమో పార్వతీ వల్లభా నీలకంఠా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాథ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

నమో భూతనాథ


చంద్రమతి:

సదా సుప్రకాశా మహాపాపనాశా

ఆ....

సదా సుప్రకాశా మహాపాపనాశా

కాశీ విశ్వనాథా దయాసింధువీవే

నమో పార్వతీ వల్లభా నీలకంఠా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాథ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

నమో భూతనాథ

విశేషాలు[మార్చు]

విశ్వామిత్రుని అప్పు తీర్చుట కొరకు హరిశ్చంద్రుడు చంద్రమతి, లోహితులతో కాశీ చేరుకుంటాడు, కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునే సమయంలో ఈ పాటను ఆలాపిస్తారు. తెలుగులో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి పై ఈ పాటను చిత్రీకరించారు. మనసారా పార్వతీపరమేశ్వరులని అంత ఘనంగా కీర్తించలేరు అని అన్నంత ఘనంగా ఉంటుంది ఈ గీతం. ముఖ్యంగా చివరి చరణంలో సదా సుప్రకాశా మహాపాపనాశా అన్నప్పటి ఆర్తి వర్ణనాతీతం. సత్య హరిశ్చంద్ర చిత్రం సరిగ్గా నడవకపోయినా ఈ పాట చాలా గొప్ప పేరు పొందింది. ఇదే పాటను కన్నడంలోని సత్య హరిశ్చంద్రలో కూడా చిన్న మార్పులతో ఉపయోగించారు. తెలుగు చిత్రంలోని పాటలో సంస్కృతంతో పాటుగా కొన్ని తెలుగు పదాలుండగా, కన్నడ చిత్రంలో పాట పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది. ఆ పాటను ఘంటసాల, పి.లీల, రాజ్‌కుమార్, పండరీబాయి కొరకు ఆలాపించారు. కన్నడంలో మాత్రం ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ పాటే ఆ చిత్రానికి తలమానికం. ఈ రెండూ భాషలలో సత్య హరిశ్చంద్ర చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థ కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించింది. రెండింటికీ పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడు. మొదటి చరణంలో తెలుగులోని జగాలెల్లబ్రోవ ప్రభూ నీవెకావా స్థానంలో నమో లోకపాల నమో నాదలోలా ఉపయోగించగా, చివరి చరణంలో కాశీ విశ్వనాధా దయాసింధువీవే స్థానంలో కన్నడంలో కాశీ విశ్వనాధా దయాసింధుదాతా ఉపయోగించారు. ఇంతకు ముందు 1956లో రాజ్యం పిక్చర్స్ వారి హరిశ్చంద్రలో ఈ పాట స్థానంలో హరహర మహదేవ .... జయ కాశీ విశ్వనాథా అనే పాట ఉంటుంది. ఆ పాటను ఘంటసాల, పి.లీల, టి.సత్యవతి బృందం ఆలాపించారు.

కన్నడ చిత్రంలోని పాట[మార్చు]

హరిశ్చంద్రుడు:

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే

స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో

హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే

భూతాధిప ప్రమధనాధ గిరీశ చాప


హరిశ్చంద్రుడు:

నమో భూతనాధ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాధ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

నమో భూతనాధ


హరిశ్చంద్రుడు:

భవా వేదసారా సదా నిర్వికారా

భవా వేదసారా సదా నిర్వికారా

నమో లోకపాల నమో నాదలోలా

నమో పార్వతీ వల్లభా నీలకంఠా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాధ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

నమో భూతనాధ


చంద్రమతి:

సదా సుప్రకాశా మహాపాపనాశా

ఆ....

సదా సుప్రకాశా మహాపాపనాశా

కాశీ విశ్వనాధా దయాసింధుదాతా

నమో పార్వతీ వల్లభా నీలకంఠా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాధ నమో దేవదేవ

నమో భక్తపాల నమో దివ్యతేజా

నమో భూతనాధ

లింకులు[మార్చు]